Rahul Gandhi : వలస పక్షులతో, ఒకే సామాజిక వర్గ ఆధిపత్యంతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయమా?

వలస పక్షులతో, ఒకే సామాజిక వర్గ ఆధిపత్యంతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయమా? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : November 2, 2023 3:53 pm

Rahul Gandhi : కేసీఆర్ తిన్న డబ్బులను రాహుల్ గాంధీ కక్కిస్తాడట.. అసలు డబ్బులను కక్కించే సంస్కృతి మీ దగ్గర ఎక్కడ ఉంది రాహుల్ గాంధీ గారు..? అవినీతిని పెంచి పోషించిందే కాంగ్రెస్ పార్టీ. మీ ట్రాక్ రికార్డ్ చూస్తే ఎక్కడా కక్కించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎంతో తింటున్నా అది మాత్రం రాహుల్ గాంధీ కక్కించిన దాఖలాలు కనిపించడం లేదు. అవినీతి పరులు, కాంట్రాక్టర్లు అందరినీ చేర్చుకొని పార్టీలో.. నేను కేసీఆర్ తిన్న డబ్బులను కక్కిస్తాననడం జనం చెవుల్లో పూలు పెట్టడం కాదా.. అసలు కాంగ్రెస్ పాలనలో ఈడీ పనిచేయనే లేదు.

మోడీ పాలనలో మెరిట్స్, డీమెరిట్స్ పక్కనపెట్టండి.. వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లు, బ్లాక్ మనీ దారుల నుంచి కక్కించాడు. ఆ ట్రాక్ రికార్డ్ కాంగ్రెస్ కు లేదు. మాట్లాడితే అంబానీ, అదానీ అంటున్నారు. వీళ్ల ప్రస్థానం కాంగ్రెస్ హయాం నుంచే మొదలైంది. వెల్త్ క్రియేషన్ ను విలన్ గా చూపించడం అనేది కాంగ్రెస్ హయాం నుంచే మొదలైంది..

కాంగ్రెస్ అంటేనే అవినీతి మయం.. చేతులు ఎప్పుడూ అవినీతి మురికితోనే ఉంటాయి కదా.. కర్ణాటకలో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం అని చెప్పి అవినీతిపరులందరినీ పార్టీలో చేర్చుకున్నారు. దేశం మొత్తం మీద టాప్ రిచెస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే డీకే శివకుమార్. కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రి.. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు.. మీరు వేరే పార్టీ నుంచి వేలేత్తి చూపించడం హాస్యాస్పదంగా ఉంది రాహుల్ గాంధీ గారు..

వలస పక్షులతో, ఒకే సామాజిక వర్గ ఆధిపత్యంతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయమా? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.