Opposition ‘INDIA’ : ప్రతిపక్షాల ‘INDIA’ కూటమి బలమెంత? బలగమెంత?

ఇలా ఏ విధంగా చూసినా దేశంలో 2019 ఎన్నికల్లో మోడీ ఒక్కడి చరిష్మా వల్లనే 300 సీట్లు వచ్చాయి. ఇప్పుడు దేశంలోని 26 ప్రతిపక్ష పార్టీలు కలిసినా కనీసం 100 సీట్లు కూడా వచ్చే అవకాశాలు లేవు. గట్టిగా కొట్టినా 150 దాటవు.

Written By: NARESH, Updated On : July 18, 2023 8:03 pm
Follow us on

Opposition ‘INDIA’ : 2024 సార్వత్రిక ఎన్నికల హీట్ మొదలైంది. బెంగళూరులో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాల కూటమి భేటి ముగిసింది. ఈ రాత్రి ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి సమావేశమైంది. బీజేపీని ఓడించడమే ధ్యేయంగా ప్రతిపక్ష పార్టీల సమావేశం ముగిసింది.

మొత్తం 26 పార్టీల నేతలు ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ భేటిలో పాల్గొన్నారు. విపక్షాల కూటమికి గతంలో కాంగ్రెస్ నిర్వహించిన ‘యూపీఏ’ పేరుకు బదులుగా ‘I-N-D-I-A’గా నామకరణం చేశారు. దేశం పేరునే ప్రతిపక్షాల కూటమికి పెట్టడం విశేషం. ఈ పేరును ఈ సమావేశంలో పాల్గొన్న 26 పార్టీలు అంగీకరించాయి. ఈ సమావేశంలో బీజేపీ ఓటమికి.. కార్యాచరణ రూపొందించారు. 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ముంబైలో తదుపరి సమావేశంలో ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది కూడా వెల్లడిస్తామని తెలిపారు.

ప్రతిపక్ష కూటమికి ఇండియా (ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) అని పేరు పెట్టారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఢీకొట్టేందుకు ఏకీకృత వ్యూహంపై చర్చించేందుకు 26 ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు ఇక్కడ సమావేశమయ్యారు.

-ప్రతిపక్షాల కూటమికి ఇండియా అని పేరు ఎందుకు పెట్టారు?

ప్రతిపక్షాల కూటమి ఇండియా (ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) అనే పేరు ఎందుకు తీసుకున్నారంటే.. రాబోయే నెలల్లో ఇది భారతదేశం vs ప్రధాని మోడీలాగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్నదే ప్రతిపక్షాల ఉద్దేశమని తెలిపారు.ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ ప్రతిపక్షంగా వ్యవహరిస్తారని వాళ్లు ఊటంకించారు. రాజ్యాంగంలోని సమ్మిళిత భారతదేశం కోసం పోరాడుతున్నామన్నారు. పీఎం మోడీకి వ్యతిరేకంగా ఈ ఇండియా పోరాడాలన్నదే ఉద్దేశమన్నారు. అందుకే ఈ పేరు పెట్టినట్టు తెలిపారు.

-ముఖ్యమైన పార్టీలు ఇవీ

1 – కాంగ్రెస్ : 52 MP లు
2 – DMK : 24
3 – TMC : 22
4 – JDU : 16 (మోదీజీ ఛరిష్మా)
5 – SP : 05
6 – NC : 03
7 – CPM : 03
8 – IUML : 03
9 – CPI : 02
10- JMM : 01
11 – AAP : 01
12 – VCK : 01
13 – MDMK : 00
14 – KDMK : 00
15 – RSP : 00
16 – కేరళ కాంగ్రెస్ : 00
17 – CPI -ML : 00
18 – RJD : 00
19 – RLD : 00
20 -PDP : 00
21 – శివసేన (ఉద్దవ్) : పార్టీ లేదు
22 – NCP : పార్టీ లేదు

*మిగతా నాలుగు పార్టీలు పెద్దగా గుర్తింపు లేని రిజిస్ట్రర్ కానీ పార్టీలు..

మొత్తం 26 పార్టీలలో….8 పార్టీలకు లోక్ సభలో ఒక్క సీటు కూడా లేదు. 3 పార్టీలకు ఒక్కటే ఎంపీ సీటు ఉంది. మహారాష్ట్రకు చెందిన ఉధ్ధవ్ థాకరే, శరద్ పవార్ లకు అసలు పార్టీనే లేదు. వీరి పార్టీలను శిందే, అజిత్ పవార్ లు లాగేసుకొని వీరిని పార్టీ నుంచే గెంటేశారు.

ఇలా ఏ విధంగా చూసినా దేశంలో 2019 ఎన్నికల్లో మోడీ ఒక్కడి చరిష్మా వల్లనే 300 సీట్లు వచ్చాయి. ఇప్పుడు దేశంలోని 26 ప్రతిపక్ష పార్టీలు కలిసినా కనీసం 100 సీట్లు కూడా వచ్చే అవకాశాలు లేవు. గట్టిగా కొట్టినా 150 దాటవు. ఇక టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, ఒడిషా నవీన్ పట్నాయ్ పార్టీలు స్వతంత్రంగా ఉన్నాయి. దేశంలో ఇవే బలమైన ప్రాంతీయ పార్టీలు. సో ఎటూ చూసినా ఇప్పటికిప్పుడు మోడీ బీజేపీని ఢీకొట్టి ఓడించే అవకాశాలు ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమికి లేవు. వీరి ఎంపీ సీట్లు చూస్తే అంత బలం లేదు.. బలగం లేదని అర్థమవుతోంది.