
Chiranjeevi: మంచు ఫ్యామిలీ ‘మా’ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీని బహిష్కరించారు. బాలయ్య బాబును ఇంటికి వెళ్లి ఆహ్వానించి.. మెగాస్టార్ ను మాత్రం కనీసం పిలవకపోవడాన్ని మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికితోడు నిన్న మంచు మోహన్‌బాబు, మెగాస్టార్ ను, మెగా ఫ్యామిలీ హీరోలను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి.
మెగా కుటుంబం ఓవర్ యాక్షన్ చేస్తూ.. బెదిరింపులకు పాల్పడిందని మోహన్ బాబు ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావిస్తూ.. వారి బెదిరింపులకు భయపడేది లేదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. గంధర్వులు అన్నీ చూస్తుంటారు. మరుక్షణమే దిమ్మ తిరిగేట్టు కొడతారు జాగ్రత్త’ అంటూ మోహన్ బాబు ఇచ్చిన హెచ్చరిక పై కూడా మెగా ఫ్యాన్స్ సీరియస్ గా ఉన్నారు.
నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాపు సామాజిక వర్గ నాయకత్వ ఆధిపత్యం ఎక్కువ అవుతుందని.. అందుకే కావాలని ‘మా’ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం పట్టుపట్టి మరీ గెలిచారని ఇప్పటికే గట్టిగా వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కూడా మెగాస్టార్, పవర్ స్టార్ మౌనంగా ఉండటం మెగా అభిమానులు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గీయులు సహించలేకపోతున్నారు.
ప్రత్యర్థులు అర్ధంపర్ధం లేని హెచ్చరికలు జారీ చేస్తున్నా.. కిమ్మనకుండా మౌనం పాటించడం మంచిది కాదు అని సోషల్ మీడియాలో మెగా అభిమానులు మెసేజ్ లు చేస్తూ.. ‘అన్నయ్యా ఒక్కసారిగా జూలు విధిల్చి చూడండి. మీ సత్తా ముందు వాళ్ళు తోక ముడుచుకుంటారు’ అని పెద్ద ఎత్తున కామెంట్లతో డిమాండ్ చేస్తున్నారు.
అయితే, మెగా బ్రదర్స్‌లో ఒక్క నాగబాబు తప్ప, ఏ హీరో.. ఇంతవరకు అభిమానుల అభిప్రాయానికి తగట్టు ఎవరూ రియాక్ట్ కాలేదు. స్వతహాగా మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు ఉన్న వ్యక్తి. శత్రువుకి కూడా సాయం చేసే గుణం ఉన్న వ్యక్తి. తోటి వారికీ మర్యాద ఇచ్చే వ్యక్తి. ప్రతి చిన్న వ్యక్తి పై ప్రేమను చూపించే వ్యక్తి. పైగా ఎవరి పై ఎలాంటి సందర్భంలో కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం చిరు స్వభావానికి విరుద్ధం.
ఇదే ఇప్పుడు ఆయన మౌనానికి కారణం అయింది. అయితే, విశ్వాసం చూపించని వ్యక్తుల పై ప్రేమను చూపించడం ఎంతవరకు కరెక్ట్ ? కరోనా కాలంలో మెగాస్టార్ చేసిన సేవ మరో హీరో చేయలేదు. ముఖ్యంగా సినిమా నటీనటులకు, జూనియర్ ఆర్టిస్ట్ లకు ఆయన ఎంతో సేవ చేశారు. కరోనా క్రైసిస్ ఛారిటీ అంటూ ఆకలి కడుపుతో ఉన్న ప్రతి నటుడికి ప్రతి సాంకేతిక నిపుణిడికి అన్నం పెట్టారు.
కానీ “మా” ఎన్నికల్లో ఆ నటీనటులు ఎవ్వరూ చిరంజీవి పై విశ్వాసం చూపించలేదు. చిరు మద్దతు ఇచ్చిన ప్రకాష్ రాజ్ ని ఓడించి.. ఇన్ డైరెక్ట్ గా చిరంజీవిని ఓడించారు. మెగాస్టార్ దగ్గర సాయం తీసుకున్న వారు కూడా చిరంజీవి వైపు నిలబడలేదు. ఇలాంటి వ్యక్తుల గురించి, వారి మంచి గురించి ఆలోచిస్తూ.. చిరంజీవి అందరి చేత తిట్లు తినడం అవసరమా ?