https://oktelugu.com/

The Kerala Story : కేరళ స్టోరీపై నిషేధం ఎంత వరకు కరెక్ట్?

ది కేరళ స్టోరీ సినిమాను ముఖ్యంగా మూడు రాష్ట్రాలు కేరళ, పశ్చిమ బెంగాళ్, తమిళనాడులు ఈ సినిమాను నిషేధించాయి. అసలు ఈ సినిమా కథనే కేరళ రాష్ట్రంలో అమ్మాయిల మిస్సింగ్ కథ. అక్కడ అస్సలే ఆడకుండా చేశారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 9, 2023 8:10 pm
    Follow us on

    The Kerala Story : కేరళ స్టోరీ సినిమా ఇప్పుడు దేశాన్ని షేక్ చేస్తోంది. దీన్ని పలు బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలు నిషేధించాయి. అయితే కోర్టుకు వెళితే సినీ నిర్మాతలకు ఊరట లభిస్తోంది. అటు చెన్నై హైకోర్టు, కేరళ హైకోర్టు, సుప్రీంకోర్టు సైతం ‘ది కేరళ స్టోరీని’ నిషేధించడం తప్పు అంటూ తీర్పునిచ్చాయి. అయినా కూడా రాష్ట్రాలు, కొందరు ప్రాంతీయ నేతలు నిషేధాన్ని ఎత్తివేయడం లేదు. కేవలం బీజేపీపై కోపంతో మాత్రమే ఈ సినిమాను ఆడకుండా అడ్డకున్నారు.

    ముఖ్యంగా మూడు రాష్ట్రాలు కేరళ, పశ్చిమ బెంగాళ్, తమిళనాడులు ఈ సినిమాను నిషేధించాయి. అసలు ఈ సినిమా కథనే కేరళ రాష్ట్రంలో అమ్మాయిల మిస్సింగ్ కథ. దీంతో సినిమా విడుదలకు ముందే ఈ సినిమాను ఆ రాష్ట్రంలో ఆడకుండా ప్రభుత్వం నిషేధించింది. బీజేపీ, సంఘ్ పరివార్ చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ముస్లిం లీగ్, ఆర్ ఎస్పీలు కలిసి కేరళలలో నిషేధం విధించారు. ప్రదర్శనకు ముందే నిరసనలు తెలిపారు.

    కేరళలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు.. ఈ సినిమా సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై విపుల్ అమృత్ పాల్ షా నిర్మిస్తున్నారు. సుదీప్తో సేన్ డైరెక్షన్ చేయగా.. వీరేష్ శ్రీ వాల్స బిషాఖ్ జ్యోతి సంగీతం అందిస్తున్నారు. ఇందులో నటి ఆదాశర్మ, యోగితా బిహాని, సోనియా బిలానీ, సిద్ధి ఇద్నానీ, విజయ్ కృష్ణ, ప్రణయ్ పచౌర్ తదితరులు నటించారు.

    కేరళలోని హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన కొందరు యువతులును ఐసీస్ ఉగ్రవాదులు లవ్ జిహాద్ లో భాగంగా వారిని వలలో వేసుకున్నారు. ఆ తరువాత వారిని సిరియా, ఇరాక్ దేశాలకు పంపించి బలవంతంగా టెర్రరిస్టులుగా మార్చారు. ఆ తరువాత కొందరు అరెస్టయి జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఆ ఘటన ఆధారంగా సినిమా తీశారు. వాస్తవ పరిస్థితులను వివరించారు.. అయితే ఈ సినిమాలో ఓ మతాన్ని కించపరిచేలా చూపించారని, దీనిని బ్యాన్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తూ కేరళ సహా కొన్ని బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నిషేధించారు.. ఈ మూవీ బయటకు వస్తే మతాల మధ్య చిచ్చు రేగుతుందని వారు ఆరోపిస్తున్నారు.

    ‘ది కేరళ స్టోరీ’పై నిషేధం ఎంత వరకు కరెక్ట్ అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

    బెంగాల్ ప్రత్యక్షంగా, తమిళనాడు, కేరళలు పరోక్షంగా సినిమా నిషేధం | WB bans The Kerala Story | Ram Talk