Manchu Manoj EX Wife Pranathi: మంచు మనోజ్ ఇటీవల రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. విడాకులు అనంతరం మూడేళ్లు ఒంటరిగా ఉన్న మనోజ్ మార్చి 3న భూమా మౌనిక మెడలో తాళి కట్టాడు. ఆమెకు కూడా ఇది రెండో వివాహం. మొదటి భర్తతో కొడుకు ఉన్నాడు. ఆ కుర్రాడితో మనోజ్ కి మంచి అనుబంధం ఉంది. దేవుడు ఇచ్చిన బిడ్డగా అతన్ని భావిస్తున్నట్లు మనోజ్ చెప్పుకొచ్చారు. మౌనిక కొడుకును ఆయన దత్తత తీసుకున్నారు. ఈ వివాహం విషయం మనోజ్ ఫ్యామిలీలో చాలా గొడవలు జరిగాయి. ఆ విషయాన్ని మనోజ్ నేరుగా ఒప్పుకున్నారు కూడాను.
ఈ క్రమంలో మనోజ్ ఫస్ట్ వైఫ్ ప్రణతి రెడ్డి ఏం చేస్తున్నారు? ఆమె మరో వివాహం చేసుకున్నారా? ఎక్కడ ఉన్నారు? అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ప్రణతి రెడ్డి ప్రజెంట్ అమెరికాలో ఉన్నారు. అక్కడ ఆమె ఇల్యూస్ట్రేషన్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నారట. ఇక ప్రణీత రెడ్డి మరో వివాహం చేసుకోలేదట. ఆమెకు ఆ ఆలోచన కూడా లేదట. సింగిల్ లైఫ్ బాగుంది. ఇలానే ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యారట.
ప్రణీత రెడ్డిని కూడా మనోజ్ ప్రేమ వివాహమే చేసుకున్నారు. 2015లో బంధు మిత్రుల మధ్య ఘనంగా వీరి వివాహం జరిగింది. నాలుగేళ్లు కలిసి ఉన్న ఈ జంట 2019లో విడాకుల ప్రకటన చేశారు. మనస్పర్థలతో విడిపోతున్నట్లు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రణీత రెడ్డితో విడిపోయాక ఆయన మౌనిక రెడ్డికి దగ్గరయ్యారు. ఆమెతో పెళ్ళికి ఒప్పుకోలేదు. ఏడాదిన్నర పాటు మౌనికతో చెన్నైలో ఉన్నట్లు మనోజ్ ఇటీవల ఓ షోలో చెప్పారు.
ఇక మనోజ్ కెరీర్ పరిశీలిస్తే ఆయన వెండితెర మీద కనిపించి చాలా కాలం అవుతుంది. ఇటీవల వాట్ ది ఫిష్ టైటిల్ తో ఒక మూవీ ప్రకటించారు. ఇది షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం. అలాగే రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతున్నట్లు వెల్లడించారు. గతంలో ప్రకటించిన అహం బ్రహ్మస్మి ఆగిపోయిందన్న మనోజ్… భవిష్యత్ లో సొంత బ్యానర్లో చేస్తానని ప్రకటించారు.