https://oktelugu.com/

నెలకు రూ.1,900 చెల్లిస్తే కొత్త స్కూటర్ పొందే ఛాన్స్..?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత కొన్ని రోజుల నుంచి భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని ప్రజల్లో కరోనా విజృంభణ తరువాత వ్యక్తిగత వాహనాల కొనుగోలుపై ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో ప్రముఖ టూవీలర్ కంపెనీలు కొత్త కార్ల కొనుగోలుపై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రముఖ టీవీలర్ కంపెనీలలో ఒకటైన హోండా కొత్త స్కూటర్ కొనుగోలుపై ఆఫర్లను ప్రకటించింది. Also Read: మెట్రో రైళ్లలో ఆ సీట్లలో కూర్చుంటే రూ.100 జరిమానా..? తక్కువ ఈఎంఐతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 17, 2021 / 11:55 AM IST
    Follow us on

    దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత కొన్ని రోజుల నుంచి భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని ప్రజల్లో కరోనా విజృంభణ తరువాత వ్యక్తిగత వాహనాల కొనుగోలుపై ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో ప్రముఖ టూవీలర్ కంపెనీలు కొత్త కార్ల కొనుగోలుపై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రముఖ టీవీలర్ కంపెనీలలో ఒకటైన హోండా కొత్త స్కూటర్ కొనుగోలుపై ఆఫర్లను ప్రకటించింది.

    Also Read: మెట్రో రైళ్లలో ఆ సీట్లలో కూర్చుంటే రూ.100 జరిమానా..?

    తక్కువ ఈఎంఐతో పాపులర్ మోడల్‌ ను ఇంటికి తీసుకెళ్లే అవకాశం కల్పించింది. నెలకు 1,936 రూపాయలు చెల్లించడం ద్వారా హోండా యాక్టివా స్కూటర్‌ ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర 66,799 రూపాయలు కాగా ఆన్ రోడ్ ధర 80,000 రూపాయలుగా ఉంది. కనీసం 20,000 రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే నెలకు రూ.1,936 సులభ వాయిదాలలో చెల్లించి కొత్త స్కూటర్ ను కొనుగోలు చేయవచ్చు.

    Also Read: మొబైల్ ఫోన్ కు ఫుల్ ఛార్జింగ్ పెట్టవచ్చా..? పెట్టకూడదా..?

    వడ్డీరేటును పది శాతంగా పరిగణనలోని తీసుకుంటే మూడు సంవత్సరాల పాటు నెలకు 1,936 రూపాయల చొప్పున ఈ.ఎం.ఐ చెల్లించాల్సి ఉంటుంది. హోండా యాక్టివా స్కూటర్‌ లో సైలెంట్ ఏసీజీ స్టార్టర్ మోటార్ ఉంది. సైలెంట్ ఏసీజీ స్టార్టర్ మోటార్ వల్ల ఎటువంటి సౌండ్ లేకుండానే స్కూటర్ స్టార్ట్ అవుతుంది. ఈ స్కూటర్ లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్పీడో మీటర్, ఓడో మీటర్, ఫ్యూయెల్ స్టేటస్ ఉన్నాయి.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఇంజిన్ కిల్ స్విచ్, హెడ్‌లైట్ ఎల్ఈడీ వంటి ప్రత్యేకతలు ఉన్న ఈ స్కూటర్ ను సమీపంలోని హోండా షోరూంను సంప్రదించి కొనుగోలు చేయవచ్చు. 110 సీసీ ఇంజిన్‌ తో తయారైన ఈ స్కూటర్ దేశంలోని మోస్ట్ పాపులర్ స్కూటర్ లలో ఒకటని చెప్పవచ్చు.