రాజమౌళి- రామ్ చరణ్- ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న RRR కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా హెవీ ఎక్స్ పెక్టేషన్స్ నడుమ రూపొందుతోంది. దీంతో.. సినిమా బిజినెస్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నాడట నిర్మాత దానయ్య.
Also Read: వకీల్ సాబ్ ప్రెజర్ః పవన్ ను లాక్ చేసేందుకు తెగ ట్రై చేస్తున్న నిర్మాత!
ఇక పవర్ స్టార్ – క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వీరమల్లు’పైన కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల అనౌన్స్ చేసిన టైటిల్, రిలీజ్ చేసిన గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మెగా ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం ఈ సినిమాను దాదాపు రూ.170 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కొనసాగుతూనే ఉంది. RRR బిజినెస్ మొదలై చాలా కాలం అయినప్పటికీ.. వీరమల్లు బిజినెస్ మాత్రం ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది. అయితే.. థియేట్రికల్ బిజినెస్ సంగతి అటుంచితే.. శాటిలైట్ రేట్స్ మాత్రం ఆకాశంలో ఉంటున్నాయట.
RRR నాన్-థియేట్రికల్ హక్కుల కోసం ఏకంగా రూ.200 కోట్ల రేటు ఫిక్స్ చేశాడట నిర్మాత దానయ్య. ఈ రేటు చూసి ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్లు గుడ్లు తేలేస్తున్నాయట. ఇప్పటికే స్టార్ మా, జెమిని, జీ తెలుగు సంప్రదించి, వెనక్కి తగ్గాయట. దీంతో.. ఏ ఛానల్ తోనూ డీల్ సెట్ కాలేదట.
Also Read: బాలయ్య హీరోయిన్ బీచ్ పక్కన ఇలా
ఇక, వీరమల్లు చిత్రానికి సంబంధించిన బిజినెస్ కూడా ఇలాగే సాగుతోందట. రూ.150 కోట్లు చెల్లిస్తేగానీ.. నాన్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారట నిర్మాతలు. దీంత.. ఏం చేయాలో అర్థంకాక ఛానళ్లు సైలెంట్ అయిపోయాయట. ఇక, మెగాస్టార్ ఆచార్య కూడా ఇదే విధంగా ఉందట. ఈ టీం కూడా భారీగా రేట్ చెబుతుండడంతో.. ఈ సినిమా శాటిలైట్ డీల్ కూడా ఇంకా పూర్తి కాలేదు. మరి, ఏం జరుగుతుంది? అన్నది చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్