దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరడం కోసం మెట్రోరైళ్లలో ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మెట్రో రైళ్లలో కొన్ని సీట్లు ప్రత్యేకంగా స్త్రీల కోసం కేటాయిస్తారనే సంగతి తెలిసిందే. ఆ సీట్లలో పురుషులు కూర్చుంటే మాత్రం అధికారులు తర్వాతి స్టేషన్ లో పురుషులను కిందికి దింపి మరీ జరిమానాలను విధిస్తూ ఉండటం గమనార్హం. గుంటూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఆరుగురు కుటుంబ సభ్యులు ఈ నెల 12వ తేదీన తొలిసారి మెట్రో రైలు ఎక్కారు.
Also Read: భక్తుల కోరికలను క్షణాల్లో తీర్చే ఆలయం గురించి తెలుసా ..?
జనరల్ కోచ్ లలో కూర్చోవడానికి సీట్లు ఖాళీగా లేకపోవడంతో మహిళలకు కేటాయించిన సీట్లలో పురుషులు కూర్చున్నారు. అయితే వాళ్లు ఊహించని విధంగా ఈ.ఎస్.ఐ స్టేషన్ లో మెట్రో సిబ్బంది, పోలీసులు వాళ్లను కోచ్ నుంచి బయటకు దించి ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున ఆరుగురు పురుషులకు 600 రూపాయలు జరిమానా విధించారు. ఆరుగురు ప్రయాణికులు తమకు నిబంధనలు తెలియవని.. మహిళలు ఎవరూ సీటు కావాలని అడగలేదని వాదించారు.
Also Read: మొబైల్ ఫోన్ కు ఫుల్ ఛార్జింగ్ పెట్టవచ్చా..? పెట్టకూడదా..?
ఎవరైనా సీటు ఇవ్వలేదని ఫిర్యాదు చేసినా, తాము కూర్చున్న సమయంలో మహిళలు నిలబడి ఉన్నా జరిమానా విధించారంటే అర్థం చేసుకోవచ్చని అధికారులతో వాళ్లు వాదోపవాదానికి దిగారు. పోలీసులు, మెట్రో సిబ్బంది వారి వాదనను పట్టించుకోకపోవడంతో చివరకు జరిమానా చెల్లించి మరో మెట్రో రైలులో గమ్యస్థానాలకు వెళ్లారు. పురుషులు మెట్రోలో ప్రయాణిస్తే ఈ నిబంధన గురించి అవగాహన కలిగి ఉండాలి.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
రూల్స్ గురించి సరిగ్గా తెలుసుకోకపోతే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెట్రో అధికారులు రైలు ప్రయాణికులకు నిబంధనల విషయంలో అవగాహన కల్పించి జరిమానా విధించాలని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.