Holy Celebrations: హోలీ పండుగ సంబరాలు దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకను వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతుల ద్వారా నిర్వహించుకుంటారు. నార్త్ లో హోలీ కార్యక్రమానికి ముందుగా రాధా, కృష్ణులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. కానీ సౌత్ లో మాత్రం నేరుగా హోలీ వేడుకల్లో పాల్గొంటారు. ఈ తరుణంలో అసలు హోలీ పండుగ ఎప్పటి నుంచి ఎప్పుడు జరుపుకోవాలి? అనే సందేహం వ్యక్తమవుతోంది. కొందరు పండితులు చెబుతున్న ప్రకారం ఈ సమయంలో హోలీ నిర్వహించుకుంటే మంచిదని అంటున్నారు. అ వివరాల్లోకి వెళితే..
వసంతరుతువులో వచ్చే అతి ముఖ్యమైన హోలీ. ఈ పండుగకు ఒక రోజు ముందు కాముడి దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 2024 సంవత్సరంలో మార్చి 25న హోలీ పండుగ నిర్వహించుకుంటున్నారు. ఒకరోజు ముందు అంటే మార్చి 24న రాత్రి కాముడి దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాత వస్తువులన్నింటిని కూడళ్లలోకి తీసుకొచ్చి కాల్చేశారు. ఈ సందర్భంగా ఆ మంటలు చుట్టూ పాటలు పాడుకుంటూ నృత్యాలు చేశారు.
మర్నాడు అంటే 25న ఉదయమే హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. కొందరు స్నేహితులంతా కలిసకొని రంగులు చల్లుకున్నారు. టమాటలు, కోడిగుడ్లతో కూడా హోలీ నిర్వహించుకుంటున్నారు. అయితే కొందరు పండితులు చెబుతున్న ప్రకారం ఈ సమయంలో హోలీ నిర్వహించడం ప్రయోజనకరం అని అంటున్నారు.
హిందూ క్యాలెండ్ ప్రకారం.. మార్చి 25న శుక్లపక్షం పౌర్ణమి. పౌర్ణమి 24న ఉదయం ప్రారంభమై 25న మధ్యాహ్నం 12.29 గంటల వరకు ఉండనుంది. పౌర్ణమి ఉన్నంతకాలం హోలీ జరుపుకోవడం వల్ల మంచి జరుగుతుందని కొందరు పండితులు చెబుతున్నారు. అయితే చీకటి పడ్డాక హోలీ వేడుకలు నిర్వహించుకోవడం అంత శ్రేయస్కరం కాదని, అలా చేస్తే దరిద్రం చుట్టుకుంటుందని చెబుతున్నారు. అందువల్ల మధ్యహ్నం సమయం కాగానే హోలీ వేడుకల నుంచి నిష్క్రమించాలని చెబుతున్నారు.