Cine Industry : హిందీ వారికి హిట్లు.. తెలుగు వారికి డిజాస్టర్లు.. తమిళవారి వివక్ష!

తమిళవారికి మంచి హిట్లు అందించిన తమిళ దర్శకుడు లింగస్వామి. అయితే ఈ డైరెక్టర్ తెలుగు హీరో రామ్ తో తీసిన ది వారియర్ మాత్రం డిజాస్టర్ గా మిగిలింది.

Written By: NARESH, Updated On : September 10, 2023 3:18 pm

Cine Industry

Follow us on

Cine Industry : ఒకప్పుడు సౌత్ ఇండియా సినిమా అంటే తమిళ సినిమా అనుకునేవారు అందరూ. కానీ బాహుబలి సినిమా తర్వాత నుంచి అది పూర్తిగా మారిపోయింది. ఈ మధ్య తమిళ సినిమాల కన్నా కూడా తెలుగు, కన్నడ, మలయాళం చిత్రాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

కాగా ఈ మధ్య తమిళవారు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ సినిమా పైన ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బ్రేక్ చేసి తమ ఆశను ఆ చిత్రం తీరుస్తుంది అని అనుకున్నారు. కానీ ఆ చిత్రం కూడా తమిళ భాష మినహా ఏ భాషలోనూ రికార్డు సృష్టించలేదు.‌ దాంతో తమిళవారు ఎప్పుడెప్పుడు తమ దర్శకులు బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తారా అని ఎదురుచూస్తున్నారు.

అయితే తమిళ దర్శకులు బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తున్నారు కానీ అది తమిళ హీరోలతో మాత్రం కాదు. తమిళ సూపర్ హిట్ డైరెక్టర్ అట్లీ షారుక్ ఖాన్ తో తీసిన జవాన్ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సునామీ సృష్టిస్తోంది. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక బ్లాక్ బస్టర్ సినిమాని అందించాడు ఈ డైరెక్టర్. బాలీవుడ్ వారికి సూపర్ హిట్లు అందించడంలో ఈ తమిళ దర్శకులు ఎప్పుడూ ముందే ఉంటారు. ఏఆర్ మురుగదాస్ కూడా హిందీ వారికి గజినీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు.

ఇక్కడి వరకు కథ బాగానే ఉన్నా ఈ మధ్య తమిళ దర్శకులు తెలుగువారిపైన మాత్రం వివక్ష చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. తెలుగు వారి పైన పగ పెంచుకున్నారో ఏమో తెలియదు కానీ వరస పెట్టి మన హీరోలకు దిజాస్టర్లు ఇస్తున్నారు.

తమిళవారికి మంచి హిట్లు అందించిన తమిళ దర్శకుడు లింగస్వామి. అయితే ఈ డైరెక్టర్ తెలుగు హీరో రామ్ తో తీసిన ది వారియర్ మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఏ ఆర్ మురుగదాస్ కూడా హిందీ వారికి గజినీ లాంటి బ్లాక్ బస్టర్ అందించి మన తెలుగు వారికి మాత్రం ఎప్పటికీ మరిచిపోలేని చేదు అనుభూతిని మహేష్ బాబు స్పైడర్ ద్వారా ఇచ్చారు.

ఇదంతా చూస్తూ ఉంటే మన తెలుగువారిపైనా తమిళ వారికి ఏదో పగ ఉన్నట్టు ఉంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా దర్శనమిస్తున్నాయి. మరి ఇకనైనా తమిళ దర్శకులు తెలుగు హీరోలకు హిట్లు అందిస్తారో లేదో వేచి చూడాలి.