Nandamuri Balakrishna: నందమూరి నటసింహం, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణకు సహజంగానే కోపం ఎక్కువ. దీంతో చాలాసార్లు కేసుల్లో సైతం ఇరుక్కున్నారు. దీనిపై పలు రకాల కేసులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణపై హిందూపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం సంచలనం కలిగించింది. ఆయనపై హిజ్రాలు కేసు నమోదు చేయించారు. ఆయన హిందూపూర్ లోఉండకపోవడంతోనే ఆయనపై ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు బాలకృష్ణ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై తీవ్రంగా స్పందించారు.

వ్యక్తుల పేర్లను ఇష్టమొచ్చినట్లుగా మార్చడం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది. తండ్రి ఎయిర్ పోర్టు పేరు మార్చితే కొడుకేమో యూనివర్సిటీ పేరు మార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైసీపీ నేతల నిర్వాకంతో విసిగివేసారి పోతున్నారని మండిపడుతున్నారు. మహనీయుల పేర్లు మార్చడం సిగ్గు చేటు. రాజకీయాల్లో నైతికత దెబ్బతింటోంది. ఇష్టానుసారం మార్చడానికి మీకు అధికారం ఎక్కడిది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. దీనిపై వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు.
ఇక హిజ్రాలు బాలయ్య పై కేసు పెట్టడంలో ఎవరి హస్తం ఉందోననే అనుమానం టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది మంత్రులు సైతం ప్రజలకు అందుబాటులో లేకున్నా ఒక్క బాలయ్యను టార్గెట్ చేసిన అంశం వివాదాస్పదంగా మారుతోంది. దీనికి టీడీపీ నేతలు కూడా హిజ్రాల వెనుక ఎవరున్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు. గతంలో కూడా బాలయ్యపై ఎన్నో కేసులు నమోదైనా హిజ్రాలు మాత్రం కేసు పెట్టడం ఇదే తొలిసారి. దీంతో బాలకృష్ణపై కేసు వేయడంలో ఎవరి ప్రోద్బలం ఉందోనని విచారిస్తున్నారు.

హిందూపూర్ ప్రజల కోసం బాలకృష్ణ ఎన్నో రకాల సేవలు అందిస్తున్నా ఆయనపై కావాలనే కేసులు వేయిస్తున్నారని అనుమానిస్తున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఎన్టీఆర్ రథం ప్రారంభించి పలు రోగాలకు ఉచితంగా మందులు అందజేస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కూడా చొరవ చూపుతున్నారు. సమయం వచ్చినప్పుడల్లా అక్కడే ఉంటూ వారికి చేదోడు వాదోడుగా వ్యవహరిస్తున్నా దురుద్దేశంతో ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే నేతను కావాలనే బదనాం చేసేందుకు నిర్ణయించుకుని ఇలా చేయడంపై ప్రతివిమర్శలు పెరుగుతున్నాయి. వైసీపీ నేతల తీరుతోనే ఇలా బాలయ్య పై కేసులు పెట్టినా ఆయనకు ఒరిగేదేమీ లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.