Homeజాతీయ వార్తలుMLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: కేసీఆర్ శ్రమంతా ‘సీబీఐ’కి పోసిన పన్నీరైంది!

MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: కేసీఆర్ శ్రమంతా ‘సీబీఐ’కి పోసిన పన్నీరైంది!

MLA Poaching Case
MLA Poaching Case

MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో బిగ్‌ షాక్‌ తగిలింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును సమర్ధించిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సింగిల్‌ బెంచ్‌ గతంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. ప్రభుత్వం నియమించిన సిట్‌ను రద్దు చేసింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును ప్రభుత్వం హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈ మేరకు కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పిటీషన్‌ను కొట్టివేసింది. ఈ కేసు సీబీఐకి వెళ్తుందా లేక సిట్‌కు అప్పగిస్తారా అనే ఉత్కంఠ హైకోర్టు తీర్పుతో వీడింది.

మొయినాబాద్‌ ఫామ్‌ హౌస్‌లో..
ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి చెందిన మోయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో పైలెట్‌ రోహిత్‌రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, సుధీర్‌రెడ్డిని బీజేపీలో చేర్చేందుకు నందకుమార్‌ నేత్రుత్వంలో రామచంద్రభారతి, సింహయాజీ మంతనాలు జరిపారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈమేరకు ఫామ్‌హౌస్‌లో నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజీని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపింది. నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు మీడియాలో ప్రచారం చేసింది. ఆ తర్వాత దర్యాప్తు కోసం సీవీ.ఆనంద్‌ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసింది.

ప్రెస్‌మీట్‌ పెట్టి వీడియోలు రిలీజ్‌ చేసిన కేసీఆర్‌..
ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సబంధించిన పలు వీడియోలను బయట పెట్టారు. వీటిని హైకోర్టు, సుప్రీంకోర్టుకు పంపుతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయో మాత్రం తెలుపలేదు. ఇంకా అనేక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించారు.

MLA Poaching Case
MLA Poaching Case

హైకోర్టును ఆశ్రయించిన నిందితులు..
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న నందుకుమార్, రామచంద్రభారతి, సింహయాజీ సిట్‌ దర్యాప్తుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు సింగల్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి సిట్‌ విచారణపై స్టే ఇచ్చారు. సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చారు. సిట్‌ను సస్పెండ్‌ చేశారు. దీంతో తొలిసారి తెలంగాణ ప్రభుత్వానికి షాక్‌ తగిలింది.

డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌..
సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై సిట్, తెలంగాణ ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేశాయి. సుమారు 15 రోజులు ఇరు పక్షాల వాదనలు విన్న డివిజన్‌ బెంచ్‌ తీర్పును రిజర్వ చేసింది. దీంతో ఇరుపక్షాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు సింగిల్‌ బెంచ్‌ తీర్పునే సమర్థిస్తూ డివిజన్‌ బెంచ్‌ కూడా తీర్పు చెప్పింది. దీంతో మరోమారు కేసీఆర్‌ సర్కార్‌కు షాక్‌ తగిలింది. సీబీఐ రాష్ట్రానికి రావొద్దని జీవో తెచ్చిన సర్కార్‌ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తుందా లేక విచారణకు అనుమతిస్తుందా అనేది వేచి చూడాలి.

 

అదానీ వ్యవహారం మోడీ మెడకు చుట్టుకుంటుందా? || You need to know about the story of Adani vs Hindenburg

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version