Homeక్రీడలుVirat Kohili : అతడు కింగ్ కోహ్లీ.. ప్రత్యర్థులూ తస్మాత్ జాగ్రత్త: వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాడు

Virat Kohili : అతడు కింగ్ కోహ్లీ.. ప్రత్యర్థులూ తస్మాత్ జాగ్రత్త: వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాడు

Virat Kohili : క్రికెట్ మైదానంలో ఆటగాళ్లు చాలా సమయనంతో ఉండాలి, ఆట తీరు కూడా అలాగే ఉండాలి అంటారు క్రీడా పండితులు.. ఆటగాళ్లు కూడా దానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు. జెంటిల్మెన్ గేమ్ లో జెంటిల్మెన్ లాగా ప్రవర్తించాలని అనుకుంటారు. కానీ ఒక్కసారి మైదానంలోకి దిగితే ఆ పరిస్థితి ఉండదు. ప్రత్యర్థుల ప్రవర్తన వల్ల ఆటగాళ్లు ఏకాగ్రత కోల్పోతారు. కొందరు తమ ఆటతీరుతో దానికి సమాధానం చెబితే, కొందరు తమ నోటికి పని చెబుతారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ముందుంటారు.. మన జట్టులోనూ కొంతమంది ఉన్నారు. ఆ వరుసలో ముందు నిలిచేవాడు విరాట్ కోహ్లీ. మ్యాచ్ గెలిచిన అనంతరం ఆనందాన్ని ఆపుకోలేడు. కోపాన్ని కూడా తట్టుకోలేడు. అది ఇటీవల ఐపీఎల్లో లక్నో జట్టు తో జరిగిన మ్యాచ్లో  నిరూపితమైంది. అన్నట్టు కోహ్లీ ఆగ్రహ రూపం దాల్చడం ఇదే మొదటిసారి కాదు. గతంలో జరిగిన ఘటనలో ఇంతకు మించి ఉన్నాయి. అవి ఏమిటో మీరూ చదివేయండి.
ఫీజు కోల్పోయారు
ఐపీఎల్ 17 వ ఎడిషన్లో భాగంగా లక్నో జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడింది. ఈ మ్యాచ్ లో లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్, విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. మధ్య లో గౌతమ్ గంభీర్ కల్పించుకోవడంతో అది మరింత ముదిరింది. గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ సహనం కోల్పోయి పరస్పరం దూషించుకున్నారు. ఈ ఘటన క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉండటంతో ఐపీఎల్ నిర్వాహకులు విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మ్యాచ్ ఫీజులో 100%, నవీన్_ ఉల్_ హక్ ఫీజులో 50 % ఫీజు కోత విధించారు. ఐపీఎల్ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం వల్ల విరాట్ కోహ్లీ కోటి రూపాయలకు పైగా నష్టాన్ని చవిచూశాడు. గౌతమ్ గంభీర్ 25 లక్షలు కోల్పోయాడు. నవీన్ ఉల్ హక్ కు 1.75 లక్షల నష్టం వాటిల్లింది.
ఆగ్రహం ఆపుకోలేడు
టీమిండియా క్రికెట్ చరిత్రలో సౌరవ్ గంగూలీ మాత్రమే ఆగ్రహంగా ఉంటాడని చాలామందికి తెలుసు. కానీ విరాట్ కోహ్లీ అతడిని మించేలా ఉంటాడు. తనను మాత్రమే కాదు తన జట్టులోని సహచరులను దూషిస్తే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను అస్సలు సహించడు. నోటికి వెంటనే పని చెబుతాడు. అవసరమైతే మీదికి దూసుకెళ్తాడు. ఇక మొన్న గౌతమ్ గంభీర్, నవీన్_ ఉల్ _ హక్ తో జరిగిన వివాదం మాత్రమే విరాట్ కోహ్లీకి కొత్తది కాదు. గతంలో కూడా విరాట్ కోహ్లీ తన ఆగ్రహరూపాన్ని ప్రత్యర్థులకు చవిచూపించాడు.
దెబ్బకు దెబ్బ కొట్టాడు
ఒక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టుపై విజయం సాధించినందుకు ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ గాలిలో తేలిపోయాడు. భారత జట్టు ఆటగాళ్లను కించపరిచే విధంగా సంబరాలు చేసుకున్నాడు. తర్వాత ఒక నెల గడిచిందో లేదో అదే ఆటగాడిని విరాట్ కోహ్లీ అవుట్ చేశాడు. భారత జట్టుకు విజయాన్ని అందించాడు. మమ్మల్ని గెలికితే ఎలా ఉంటుందో జో రూట్ కు విరాట్ కోహ్లీ రుచి చూపించాడు. అప్పటినుంచి జో రూట్ పద్ధతి మార్చుకున్నాడు. ఒక టెస్ట్ మ్యాచ్లో అప్పటి ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ బంతిని గట్టిగా బాదాడు. అది విరాట్ కోహ్లీ భుజానికి బలంగా తగిలింది. అప్పుడు విరాట్ కోహ్లీని చూసి ఎగతాళి చేశాడు. తర్వాత కొద్దిసేపటికే స్మిత్ ను ఔట్ చేశాడు కోహ్లీ. అంతేకాదు ఆ భుజాన్ని పట్టుకొని గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఇక ఐపీఎల్ లో లక్నోతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ బెంగళూరు జట్టు ఆటగాడు పూరన్ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. దీనికి గుర్తుగా విరాట్ కోహ్లీ గాలిలో ముద్దులు విసిరి బెంగళూరు అభిమానులను ఆనందపరిచాడు. కేస్రిక్ విలియమ్స్ అనే ఆటగాడు పదునైన బంతులతో విరాట్ కోహ్లీని ఇబ్బంది పెట్టాడు. తర్వాత విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. దెబ్బకు విలియమ్స్ నోట్ బుక్ మీద సంతకం చేసే వేడుకను విరమించుకున్నాడు. ఇక మరొక మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్ భారత బౌలర్ మహమ్మద్ సిరాజ్ ను ఎగతాళి చేశాడు. దీనిని మనసులో పెట్టుకున్న విరాట్ కోహ్లీ తర్వాత లిటన్ దాస్ అవుట్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే విరాట్ కోహ్లీ తన విశ్వరూపాన్ని చాలా సందర్భాల్లో ప్రదర్శించాడు. ఆట తీరు మాత్రమే కాదు కోపంలోనూ తనకు ఎవరూ సాటిరారని నిరూపించాడు.
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular