Rajinikanth : ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రజినీకాంత్ ఎపిసోడ్ సెగలు పుట్టిస్తోంది. వైసీపీ నేతల మాటల దాడి నేపథ్యంలో రజినీ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. రజినీ విషయంలో వైసీపీ రచ్చపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. రజినీ కాంత్ ఎపిసోడ్ లోవైసీపీ తప్పును ఎత్తిచూపే ప్రయత్నం చేస్తోంది. అటు వైసీపీకి చెందిన మంత్రి రోజా, మరో నటుడు పోసాని కృష్ణమురళీ స్పందించారు. రజినీ చర్యలను తప్పపడుతూ మాట్లాడారు. కానీ రజినీకి మద్దతుగా సినీ పరిశ్రమ నుంచి ఒక్కరూ స్పందించలేదు. ఓ ఇంటర్వ్యూలో నటుడు జగపతిబాబు స్పందించారు. రజినీకాంత్ ఏ విషయమైనా నిజాయితీగా మాట్లాడతారని.. ఆయన మాట్లాడింది 100 శాతం వాస్తవమేనని చెప్పుకొచ్చారు. అంతకు మించి ఎవరూ స్పందించడానికి సాహసించడం లేదు.
చాలా కసరత్తు..
అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ ను వ్యూహాత్మకంగా కార్యక్రమానికి పిలిపించారని టాక్ నడుస్తోంది. ఎన్నికల ముంగిట ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని టీడీపీ హైకమాండ్ డిసైడయ్యింది. వేడుకగా నిర్వహించి మరింత హైప్ పెంచుకోవాలని నిర్ణయించింది. అయితే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రజినీకాంత్ పిలవడానికి ముందుగానే చాలా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు మోహన్ బాబు సహకారాన్ని చంద్రబాబు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ కు మోహన్ బాబు ఆత్మీయ మిత్రుడు. తన మంచి చెడ్డలను పంచుకోవడానికి మోహన్ బాబును ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు మోహన్ బాబు సహకారంతోనే రజినీకాంత్ ను రప్పించారన్న టాక్ నడుస్తోంది.
మోహన్ బాబు ద్వారా..
మోహన్ బాబు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. గత ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు. అప్పటి చంద్రబాబు సర్కారుపై పెద్ద యుద్ధమే చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో తిరుపతిలో బైఠాయించి నిరసన తెలిపారు. వైసీపీలో చేరి గత ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత మోహన్ బాబును జగన్ పెద్దగా పట్టించుకోలేదు. అటు ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో కూడా మోహన్ బాబు ఆశలపై నీళ్లు చల్లాడు. అటు నామినేటెడ్ పదవులు సైతం కేటాయించలేదు. దీంతో మోహన్ బాబు మనసు మార్చుకున్నాడు. చంద్రబాబుకు దగ్గరయ్యాడు. టీడీపీ వైపు అడుగులేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండుసార్లు చంద్రబాబుతో సైతం భేటీ అయ్యారు. ఇప్పుడు రజినీకాంత్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరుకావడం వెనుక కూడా మోహన్ బాబు హస్తం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇలా దగ్గరయ్యారు..
వాస్తవానికి రజినీకాంత్ హాజరయ్యే వేడుకలకు మోహన్ బాబు హాజరవుతారని అంతా భావించారు. కానీ అది రాజకీయ దుమారానికి దారితీస్తుందని గైర్హాజరైనట్టు తెలుస్తోంది. వాస్తవానికి మోహన్ బాబు చాలా పదవులపై ఆశ పెట్టుకున్నారు. తొలుత టీటీడీ చైర్మన్ పదవి అడిగారు. అదీ ఇవ్వలేదు. రాజ్యసభ స్థానాన్ని ఆశించారు. దానిని దాటవేశారు. చాలాసార్లు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి కొన్ని ఆబ్లిగేషన్లు పెట్టుకున్నారు. వాటికి కూడా మోక్షం లేదు. దీంతో మోహన్ బాబు పునరాలోచనలో పడ్డారు. చంద్రబాబు విషయంలో రియలైజ్ అయ్యి స్నేహహస్తం అందించారు. ఇదే అదునుగా చంద్రబాబు సైతం వ్యూహరచన చేశారు. మోహన్ బాబు ద్వారా రజినీకాంత్ ను ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు రప్పించుకున్నారు. రాజకీయ రచ్చకు కారణమయ్యారు.