Hardik Pandya: మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీ వదులుకున్నాక అంతటి విజయవంతమైన నాయకుడు టీమిండియాలో కనిపించడం లేదు. కోహ్లీ ద్వైపాక్షిక సిరీస్ లు గెలుస్తున్నా.. అసలు ప్రపంచకప్ టోర్నీలు మాత్రం గెలిపించలేకపోతున్నాడు. భారత్ కు ప్రపంచకప్ అందించే నాయకుడి కోసం బీసీసీఐ ఇప్పుడు శూలశోధన చేస్తోంది. ఈ క్రమంలోనే కోహ్లీ, రోహిత్ తర్వాత టీమిండియా పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆలోటును భర్తీ చేసేందుకు ముందుకొచ్చాడు హార్ధిక్ పాండ్య. అవును ఐపీఎల్ లో తన కెప్టెన్సీలోనే గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరింది. అతడి నాయకత్వ లక్షణాలను ఈ ఐపీఎల్ బయటపెట్టినట్టైంది.

టీమిండియా కొన్ని సంవత్సరాల నుంచి కష్టాలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కెప్టెన్సీ విషయంలో అనేక వివాదాలు.. విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు కొనసాగిన కెప్టెన్ విరాట్ కోహ్లి అనుహ్యంగా తన స్థానం నుంచి తప్పుకోవడంతో ఆల్ టైం కెప్టెన్సీపై ఇంకా నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుతం వన్డే, 2020, టెస్ట్ ఫార్మాట్లకు రోహిత్ శర్మ కొనసాగుతున్నారు. అయితే రోహిత్ కెప్టెన్సీని చాలా మంది స్వాగతించినా అతడి వయసు 35 ఏళ్లు దాటడంతో భవిష్యత్ దృష్ట్యా యువకుడైన కెప్టెన్ అవసరం ఎంతైనా ఉంది. కొందరు సీనియర్లు ఇతరులకు అవకాశం ఇవ్వాలని పలు సందర్భాల్లో పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా ఒకప్పటి పాస్టెస్ట్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవల సంచలన కామెంట్స్ చేశారు. ఇండియన్ టీం ఫ్యూచర్ కెప్టెన్ హార్థిక్ పాండ్యానే అన్నారు.
ఐపీఎల్ 2022లో హార్థిక్ పాండ్యా జోరు కొనసాగిస్తున్నాడు. ఆయన నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఫైనల్ వరకు వెళ్లింది. దీంతో హార్థిక్ ను మెచ్చుకుంటూ సెహ్వాగ్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తనను బాగా ఆకట్టుకున్న కెప్టెన్ హార్థిక్ పాండ్యా అన్నారు. అతని బ్యాటింగ్ విధానాన్ని చూస్తే కెప్టెన్ గా సమర్థవంతంగా పనిచేస్తాడని అన్నాడు. మ్యాచ్ ఎంత టెన్షన్ గా ఉన్న కూల్ గా ఆటాడుతాడని, ఒక కెప్టెన్ కి ఉన్న లక్షణాలు హార్థిక్ పాండ్యాలో ఉన్నాయన్నారు. గుజరాత్ టైటాన్స్ విషయంలో కీలక సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ జట్టును ముందుకు తీసుకెళ్లాడన్నారు.
హార్థిక్ పాండ్యా స్నేహితుడయినందు వల్ల అతడిని పొగడడం లేదని, అతని ఆటతీరును చూసే చెబుతున్నానన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నందున నాకు నచ్చిన కెప్టెన్ హార్థిక్ పాండ్యా అని అన్నారు. ఆట కాస్త వెనకబడిన సందర్భంలో బౌలింగ్, బ్యాటింగ్ విషయంలో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి సమయాల్లో హార్థిక్ పాండ్యా తీసుకున్న డెసిషన్స్ బాగా ఆకట్టుకున్నాయన్నారు. జట్టు ఎంత ఒత్తిడి ఉన్నా ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్లే సమర్థత హార్థిక్ పాండ్యాలో ఉందన్నారు. అందుకే అతడు బాగా నచ్చాడన్నారు. భవిష్యత్ కెప్టెన్ గా కనిపిస్తున్నాడని కితాబిచ్చారు.
Also Read: Koratala Siva: ప్చ్.. ‘కొరటాల’ కు మళ్లీ లాంగ్ గ్యాప్ తప్పేలా లేదు !
ప్రస్తుతం టీమిండియాలో యువకులైన కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ లు కెప్టెన్సీ రేసులో ఉన్నారు. అయితే కేఎల్ రాహుల్ ఆటగాడిగా క్లిక్ అయిన కెప్టెన్సీలో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఇక పంత్ ఐపీఎల్ లో పేలవమైన వ్యూహాలతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ కు చేరకుండా నిరాశపరిచాడు. శ్రేయాస్ అయ్యర్ లో కెప్టెన్సీ లక్షణాలున్నా అతడు ఆటగాడిగా సరిగ్గా రాణించలేకపోతున్నాడు. ఓవరాల్ గా ఇటు బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి టీంను ఫైనల్ వరకూ తెచ్చిన హార్ధిక్ పాండ్యానే ఇప్పుడు టీమిండియాకు ఏకైక ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు.
ఐపీఎల్ ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ 14 మ్యాచుల్లో పదింటిని గెలిచింది. ఈ జట్టును గెలిపించడంలో హార్థిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. జట్టులోకి క్రీడాకారుల సెలక్షన్స్ నుంచి.. గేమ్ లో సరైన డిసిషన్ తీసుకునే వరకూ హార్ధిక్ పాండ్యా నిర్ణయాలు అద్భుతంగా పేలాయి.అందుకే గుజరాత్ జట్టు ఇలా సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళుతోంది. అలాగే హార్థిక్ పాండ్యా జట్టుకు కెప్టెన్ అయినప్పటికీ సాధారణ ఆటగాడిలాగే ప్రవర్తిస్తున్నాడు. జట్టులో ఉండే ప్రతీ ఒక్కరూ కెప్టెన్ అని భావించేలా స్వేచ్ఛ ఇస్తున్నాడని క్రికెట్ ప్రముఖులు అంటున్నారు. టీంలో ఎంత స్వేచ్ఛ ఉంటే జట్టు అంత సక్సెస్ అవుతుందని ఇటీవల హార్థిక్ పాండ్యా చెప్పడం విశేషం.దీంతో ఇప్పుడు టీమిండియా భవిష్యత్ కెప్టెన్ ఆశాకిరణంగా హార్ధిక్ కనిపిస్తున్నాడు.
Also Read: Mohan Babu: మోహన్ బాబు చేసిన పనికి 10 లక్షలు ఫైన్ కట్టిన ప్రముఖ స్టార్ హీరోయిన్
[…] Also Read: Hardik Pandya : హార్ధిక్ పాండ్యానే టీమిండియా భ… […]
[…] Read: Hardik Pandya : హార్ధిక్ పాండ్యానే టీమిండియా భ… Recommende […]