Guntur Karam First Review : గుంటూరు కారం సెన్సార్ టాక్: ఫస్ట్ రివ్యూ వచ్చేసింది, బొమ్మ బ్లాక్ బస్టర్, హైలెట్స్ ఇవే!

గుంటూరు కారం పక్కా సంక్రాంతి చిత్రం అని సెన్సార్ టాక్. కాబట్టి మహేష్ బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరనుందన్న మాట వినిపిస్తుంది. గుంటూరు కారం మూవీ జనవరి 12న విడుదల కానుంది

Written By: NARESH, Updated On : January 4, 2024 7:08 pm
Follow us on

Guntur Karam First Review : గుంటూరు కారం మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. మరో వారం రోజుల్లో థియేటర్స్ లోకి రానుంది. ఈ క్రమంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారు. గుంటూరు కారం చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. అంటే చిన్న పిల్లలు చూడొచ్చు, కానీ పేరెంట్స్ గైడెన్స్ లో మాత్రమే చూడాలి. ఇక గుంటూరు కారం సినిమా చూసిన సెన్సార్ సభ్యులు తమ అభిప్రాయం తెలియజేశారట. గుంటూరు కారం మూవీపై వారి అభిప్రాయం ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేదిగా ఉంది.

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు. సినిమాలో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ హైలెట్ అంటున్నారు. గత చిత్రాల్లో ఎన్నడూ మహేష్ ని ఇంత ఊరమాస్ రోల్ లో చూసి ఉండరని అభిప్రాయ పడ్డారు. మహేష్ మేనరిజమ్స్, డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్. హీరోయిన్ శ్రీలీలతో మహేష్ కెమిస్ట్రీ, రొమాన్స్ మరో హైలెట్ అంటున్నారు.

శ్రీలీల గ్లామర్, ఆమె పాత్ర కూడా అలరించే అంశాలు అంటున్నారు. గుంటూరు కారం చిత్రంలో బలమైన కథ ఉందట. ఇక క్లైమాక్స్ కి ముందు వ్ వచ్చే కుర్చీ మడతపెట్టి సాంగ్ కి జనాలు కుర్చీలో కూర్చోలేరు అంటున్నారు. త్రివిక్రమ్ మార్క్ ఎమోషన్స్, డైలాగ్స్, కామెడీ పంచెస్ చక్కగా కుదిరాయని అంటున్నారు. మొత్తంగా గుంటూరు కారం లో ఆడియన్స్ ఆశించే అన్ని రకాల అంశాలు ఉన్నాయి.

గుంటూరు కారం పక్కా సంక్రాంతి చిత్రం అని సెన్సార్ టాక్. కాబట్టి మహేష్ బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరనుందన్న మాట వినిపిస్తుంది. గుంటూరు కారం మూవీ జనవరి 12న విడుదల కానుంది. త్వరలో ట్రైలర్ విడుదల కానుంది. షూటింగ్ అనుకున్న ప్రకారం సాగలేదు. దీంతో సంక్రాంతికి వస్తుందా లేదా అనే సందేహాలు ఏర్పడ్డాయి. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఖచ్చితంగా పెద్ద పండగక్కి వస్తున్నామని హామీ ఇచ్చారు. మహేష్ కి జంటగా మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

https://twitter.com/haarikahassine/status/1742881333704106309