
భారత అమ్ముల పొదిలోని విజయవంతమైన అస్త్రం ఎందుకోగానీ సాంకేతిక కారణాలతో ఫెయిల్ అయ్యింది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలం కావడం శాస్త్రవేత్తలను నిరాశలో ముంచింది.
రెండు దశలు బాగానే సాగిన ప్రయోగం మూడో దశకు వచ్చేసరికి సాంకేతిక లోపాలతో రాకెట్ గతి తప్పింది. క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ వద్ద సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రయోగం విఫలమైనట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ కే.శివన్ ప్రకటించారు.
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికిల్ ఎఫ్10 ప్రయోగించేందుకు బుధవారం వేుకువజామున 3.43 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించారు. ఉదయం 5.43 గంగలకు ఈ రాకెట్ ప్రయోగించాల్సి ఉంది. కానీ కాసేపటికే ప్రయోగం విఫలమైంది.
ఈ రాకెట్ ద్వారా ఈవోఎస్03 శాటిలైట్ ను పంపించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని సిద్ధం చేశారు. రాకెట్ విజయవంతమైతే రియల్ టైమ్ ఇమేజింగ్ ను శాటిలైట్ అందించేది. ప్రకృతి వైపరీత్యాలు, వ్యవసాయం, అటవీ, నీటివనరులతో పాటు విపత్తు హెచ్చరికలను అందించేది. తుఫాన్ పర్యవేక్షణ, కుండపోత వర్షాలను గుర్తించడానికి ఉద్దేశించిన ఈ ప్రయోగం విఫలం కావడంతో శాస్త్రవేత్తల్లో నైరాశ్యం అలములుకుంది.