CM Jagan : ప్రభుత్వ కార్యక్రమానికి, రాజకీయానికి తేడాతెలియని దౌర్భాగ్యం

జగన్ కు భాష రాదు.. తెలుగులో మాట్లాడడం లేదు. ఆయన భాష తీరు చూస్తే రౌడీ ముఖ్యమంత్రి అనక తప్పదు. జగన్ తనే స్వయంగా రెచ్చగొట్టి ఇలా మాట్లాడిస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. మంత్రులు మాట్లాడే భాషకు, జగన్ మాట్లాడే భాషకు తేడా తెలియదు.

Written By: NARESH, Updated On : December 15, 2023 6:29 pm

CM Jagan : జగన్ మోహన్ రెడ్డి తీరు చూస్తే అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ ఏడుపు ఏంటి అని అందరూ ఈసడించుకుంటున్నారు. ఇవి ప్రభుత్వ డబ్బులతో పార్టీ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న జగన్ పై విమర్శలు వస్తున్నాయి.

జగన్ కు భాష రాదు.. తెలుగులో మాట్లాడడం లేదు. ఆయన భాష తీరు చూస్తే రౌడీ ముఖ్యమంత్రి అనక తప్పదు. జగన్ తనే స్వయంగా రెచ్చగొట్టి ఇలా మాట్లాడిస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. మంత్రులు మాట్లాడే భాషకు, జగన్ మాట్లాడే భాషకు తేడా తెలియదు.

మోడీ ప్రభుత్వ కార్యక్రమాల్లో హుందాగా మాట్లాడుతాడు. రాజకీయం మాట్లాడడు. కానీ జగన్ మాత్రం ఈ తేడా లేకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయం మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి పదవి హోదా తగ్గించేస్తున్నాడు జగన్. పవన్ గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదు.

ప్రభుత్వ కార్యక్రమానికి, రాజకీయానికి తేడా తెలియని దౌర్భాగ్యంలో జగన్ ఉన్నాడని.. ఆయన తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Tags