గూగుల్ సూపర్ ఫీచర్.. మెసేజ్‌కు టైమ్ సెట్ చేసుకునే ఛాన్స్..?

టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో మనుషుల జీవితంలో విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. ఒకప్పుడు అవతలి వ్యక్తులకు ఉత్తరాల ద్వారా సమాచారం అందేది. తర్వాత కాలంలో ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఉత్తరాలు కనుమరుగయ్యాయి. కొన్నేళ్ల క్రితం ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులోకి రాగా వాట్సాప్, ఫేస్ బుక్, సిగ్నల్ లాంటి యాప్స్ ద్వారా మెసేజ్ లు సెకన్లలో అవతలి వ్యక్తులకు చేరుతున్నాయి. Also Read: ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు.. చిరిగిపోయిన నోట్లను ఎలా మార్చుకోవాలంటే..? మెసేజింగ్ యాప్స్ మధ్య పోటీ నెలకొన్న […]

Written By: Navya, Updated On : March 2, 2021 11:32 am
Follow us on

టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో మనుషుల జీవితంలో విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. ఒకప్పుడు అవతలి వ్యక్తులకు ఉత్తరాల ద్వారా సమాచారం అందేది. తర్వాత కాలంలో ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఉత్తరాలు కనుమరుగయ్యాయి. కొన్నేళ్ల క్రితం ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులోకి రాగా వాట్సాప్, ఫేస్ బుక్, సిగ్నల్ లాంటి యాప్స్ ద్వారా మెసేజ్ లు సెకన్లలో అవతలి వ్యక్తులకు చేరుతున్నాయి.

Also Read: ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు.. చిరిగిపోయిన నోట్లను ఎలా మార్చుకోవాలంటే..?

మెసేజింగ్ యాప్స్ మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో యాప్ నిర్వాహకులు సైతం ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నారు. అయితే సాధారణ మెసేజ్ ను షెడ్యూల్ చేసుకునే సదుపాయం మాత్రం ఇప్పటివరకు మెసేజింగ్ యాప్స్ లో అందుబాటులో లేదు. తాజాగా గూగుల్‌ మెసేజింగ్‌ యాప్‌ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో షెడ్యూల్ ప్రకారం అవతలి వ్యక్తులకు మెసేజ్ ను పంపవచ్చు.

Also Read: కోటి మందికి ఫ్రీగా గ్యాస్ కనెక్షన్.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

ప్లే స్టోర్ లో ఉన్న గూగుల్ మెసేజింగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే ఈ ఫీచర్ ను వినియోగించుకోవచ్చు. గూగుల్ మెసేజింగ్ ఈ ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇతర యాప్స్ కూడా మెసేజ్ లను షెడ్యూల్ చేసుకునే ఫీచర్ ను అందుబాటులోకి తెస్తాయేమో చూడాల్సి ఉంది. గూగుల్ మెసేజింగ్ యాప్ యూజర్లు ఈ ఫీచర్ ను వినియోగించుకోవాలంటే మెసేజ్ సెండ్‌ బటన్‌పై కొన్ని సెకండ్ల పాటు లాంగ్ ప్రెస్‌ చేయాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

అలా చేస్తే మనకు షెడ్యూల్‌ సెండ్‌ అనే ఆప్షన్‌ మనకు కనిపిస్తుంది. ఆ తరువాత ఏ సమయానికి మెసేజ్ ను పంపాలనుకుంటున్నామో ఎంటర్ చేసి సెండ్ బటన్ పై క్లిక్ చేస్తే మెసేజ్‌ షెడ్యూల్‌ అవుతుంది. మెసేజ్ ను షెడ్యూల్ చేసిన తరువాత అవసరమైతే షెడ్యూల్ చేసిన సమయాన్ని కూడా మార్చుకోవచ్చు.