https://oktelugu.com/

ల‌వ‌ర్ ఫొటో షేర్ చేసిన శ్రీముఖి.. క్ర‌ష్ మొత్తం అత‌నిపైనే అంట‌!

బుల్లితెర‌పై యాంక‌ర్ శ్రీముఖి సంద‌డి లెక్కే వేరుగా ఉంటుంది. యాంక‌రింగ్ ప్రారంభించిన అతి త‌క్కువ కాలంలోనే బెస్ట్ యాంక‌ర్ గా పేరు తెచ్చుకున్న వారిలో ముందు వ‌ర‌స‌లో ఉంటుందీ బొద్దు గుమ్మ‌. ప్ర‌స్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తద్వారా ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అవుతోంది. కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. త‌న బిహేవియ‌ర్ తో మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవ‌ల ఫాలోవ‌ర్స్ తో ఇంట‌రాక్ట్ అయిన శ్రీముఖి.. త‌న ల‌వ‌ర్ పేరుతోపాటు ఫ‌స్ట్ క్ర‌ష్ […]

Written By:
  • Rocky
  • , Updated On : March 2, 2021 / 09:59 AM IST
    Follow us on


    బుల్లితెర‌పై యాంక‌ర్ శ్రీముఖి సంద‌డి లెక్కే వేరుగా ఉంటుంది. యాంక‌రింగ్ ప్రారంభించిన అతి త‌క్కువ కాలంలోనే బెస్ట్ యాంక‌ర్ గా పేరు తెచ్చుకున్న వారిలో ముందు వ‌ర‌స‌లో ఉంటుందీ బొద్దు గుమ్మ‌. ప్ర‌స్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తద్వారా ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అవుతోంది. కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. త‌న బిహేవియ‌ర్ తో మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవ‌ల ఫాలోవ‌ర్స్ తో ఇంట‌రాక్ట్ అయిన శ్రీముఖి.. త‌న ల‌వ‌ర్ పేరుతోపాటు ఫ‌స్ట్ క్ర‌ష్ ఎవ‌రిమీద‌నో చెప్పేసింది.

    Also Read: 8 కోట్ల వరకూ నష్టాలు.. బయ్యర్లు అసంతృప్తి !

    పటాస్ షో ద్వారా యాంకర్ గా స‌త్తా చాటిన శ్రీ ముఖి.. స్టేజీ షోల‌లోనూ స‌త్తా చాటుతోంది. అయితే.. యాంక‌రింగ్ లో కాంపిటేష‌న్ పెరుగుతుండ‌డంతో త‌న ప్లేస్ ను కాపాడుకునేందుకు.. అదే స‌మ‌యంలో సుస్థిరం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉంది శ్రీముఖి. అంతేకాదు.. ఎలాగైనా వెండితెర‌పై అన‌సూయ మాదిరిగా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల‌ని ట్రై చేస్తోంది.

    అందుకే.. త‌రచూ హాట్‌ ఫొటో షూట్స్ చేస్తూ.. ఫ్యాన్స్ కు అందాల విందులు ఇస్తూ ఉంటుందీ బ్యూటీ. దీంతో.. ఈ అమ్మ‌డికి ఆన్ లైన్లో ఫాలోయింగ్ పెరిగిపోతోంది. వారితో మ‌రింత‌గా ద‌గ్గ‌ర‌య్యేందుకు ఇటీవ‌ల ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఫొటోలతో ఆన్స‌ర్ ఇచ్చిందీ బ్యూటీ. ఇందులో భాగంగానే ఓ ఫాలోవ‌ర్‌.. ‘నీ బాయ్‌ఫ్రెండ్ పేరేంటి’ అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా.. ‘420′ అనే సంఖ్య ఉన్న ఫొటోను షేర్ చేసి షాకిచ్చింది. ఫ‌న్నీగా ఇలా పెట్టిందా? ఇందులో ఏదైనా మ‌త‌ల‌బు ఉందా? అని అంతా ఆలోచిస్తున్నారు.

    Also Read: ‘చరణ్’ పై చేయి వేసిన మెగాస్టార్ !

    కాగా.. ఇదే సెషన్‌లో మరో నెటిజన్ ‘నీ క్రష్ ఎవరు’ అంటూ శ్రీముఖిని ప్రశ్నించాడు. దీనికి బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఫొటోను పోస్ట్ చేసింది శ్రీముఖి. ఆ విధంగా రణవీర్ ను మనసులో తలుచుకుంటూ ఆనందిస్తోందన్నమాట ఈ బొద్దు గుమ్మ. మరో నెటిజన్ న్యూడ్ ఫొటో అడిగితే.. రాంగోపాల్ వర్మ సినిమా ‘నగ్నం’ పోస్టర్‌ను పెట్టిన విషయం తెలిసిందే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్