తెలంగాణలోనే తిరుగులేని రాజకీయ శక్తి టీఆర్ఎస్ కు దుబ్బాక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ ప్రకంపనలు ఏపీలోనూ ప్రతిధ్వనిస్తున్నాయి. దుబ్బాకలో ఓటమి ఓ గుణపాఠం అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అంటే.. 2024లో తెలంగాణ తమదేనంటూ కమలనాథులు తొడగొడుతున్నారు. జీహెచ్ఎంసీపై పాగ వేసేందుకు సై అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీనియర్ నేతలతో సమీక్షించిన సీఎం జగన్ నేతలను హెచ్చరించినట్టు సమాచారం. ‘ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేయకపోతే ఏపీలోనూ మనకు అదే గతి’ పడుతుందని నేతలను సీఎం జగన్ హెచ్చరించినట్టు పార్టీలో ప్రచారం సాగుతోంది.
Also Read: ఏపీలో 49 ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేత.. కారణమేమిటంటే..?
దుబ్బాక ఎన్నికలపై కీలక నేతలతో చర్చించిన జగన్ ఈ మేరకు ఏపీలో బీజేపీతో కాచుకొని ఉండాలని.. ఉదాసీనంగా వ్యవహరిస్తే తెలంగాణలో టీఆర్ఎస్ కు పట్టిన గతే ఏపీలో వైసీపీకి పడుతుందని.. అందుకే ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేయాలని నేతలను సీఎం జగన్ హెచ్చరించినట్టు తెలిసింది.
ప్రస్తుతం ఏపీలో రెండు ఎన్నికలు ఉన్నాయి. ఒక స్థానిక సంస్థల ఎన్నికలు కాగా… తిరుపతి వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ మరణంతో అక్కడా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే ఈ రెండు ఎన్నికల్లో ఏమరపాటుగా ఉండొద్దని.. పకడ్బందీగా పనిచేయాలని.. ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదని నేతలను జగన్ హెచ్చరించినట్టు సమాచారం.
ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రాంతమైన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై మరింత అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించినట్టు ప్రచారం సాగుతోంది. ఎందుకంటే టీటీడీతో అన్యమత ప్రచారం.. స్వామి వారి భూముల అమ్మకం.. నగల విషయంలో వివాదం.. సహా ఇటీవలే ఓ టీటీడీ ఉద్యోగికి బూతు మెసేజ్ లు రావడం సహా హిందుత్వానికి భంగం కలుగుతోందని బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోంది. తిరుమల కేంద్రంగా బీజేపీ చేయని రచ్చ లేదు. దీంతో ఈ ఉప ఎన్నిక ఇప్పుడు అధికార వైసీపీకి కత్తిమీద సాములా మారింది.
Also Read: విశాఖకు రాజధాని తరలింపు షురూ.. మార్చి నుంచి అక్కడి నుంచే పాలన?
ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ పార్టీ అధిష్టానం ముఖ్యులు, నేతలతో సమావేశమై తెలంగాణలో బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తోందని.. ప్రజల్లోనూ వ్యతిరేకత పెల్లుబుకుతోందని.. ఈ క్రమంలోనే మనం తేరుకోకపోతే ఏపీలోనూ బీజేపీ అదేలా వ్యవహరించేలా ప్రమాదం ఉందని నేతలను హెచ్చరించినట్టు తెలిసింది. ఇప్పటికే బీజేపీ ప్రతీసారి వైసీపీని మతం కోణంలో చూపిస్తూ కార్నర్ చేయడంపై కూడా జగన్ నేతలను సీరియస్ గా హెచ్చరించినట్టు సమాచారం. బీజేపీకి అలాంటి అవకాశం ఇవ్వకుండా ముందుకెళ్లాలని జగన్ సీరియస్ డిసిషన్ తీసుకున్నాడని తెలిసింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
మొత్తంగా దుబ్బాక ఎన్నిక తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ఒక గుణపాఠం కాగా.. ఏపీలోనూ దాని ప్రకంపనలు వైసీపీకి మేలుకొలుపుగా మారాయి. మెల్లిమెల్లిగా బలపడుతున్న బీజేపీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఏపీలో ఎదగకుండా జగన్ ఇప్పటినుంచే అప్రమత్తమవుతున్నట్టు తెలుస్తోంది.