మళ్ళీ పొరపాటు చేసిన నాగబాబు !

సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీలు చేసే పొరపాట్లు బాగా వైరల్ అవుతున్నాయి. ఎలాంటి చిన్న తప్పు చేసినా క్షణాల్లోనే నెటిజన్లు కామెంట్స్ రూపంలో విరుచుకుపడుతున్నారు. అందుకే ప్రముఖులు కామెంట్స్ చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాలి. ఫొటోలు పోస్ట్ చేయడం, కామెంట్స్ రాయడం లాంటి వాటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ముందుకుపోవాలి. ఏ మాత్రం తేడా జరిగినా, స్టార్ డమ్ ను చూడరు, వ్యక్తిత్వాన్ని కూడా చూడరు, ఏకి పారేస్తారు. మరి సోషల్ మీడియాలో అలాంటి ట్రోలింగ్ […]

Written By: Neelambaram, Updated On : January 11, 2021 11:12 am
Follow us on


సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీలు చేసే పొరపాట్లు బాగా వైరల్ అవుతున్నాయి. ఎలాంటి చిన్న తప్పు చేసినా క్షణాల్లోనే నెటిజన్లు కామెంట్స్ రూపంలో విరుచుకుపడుతున్నారు. అందుకే ప్రముఖులు కామెంట్స్ చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాలి. ఫొటోలు పోస్ట్ చేయడం, కామెంట్స్ రాయడం లాంటి వాటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ముందుకుపోవాలి. ఏ మాత్రం తేడా జరిగినా, స్టార్ డమ్ ను చూడరు, వ్యక్తిత్వాన్ని కూడా చూడరు, ఏకి పారేస్తారు. మరి సోషల్ మీడియాలో అలాంటి ట్రోలింగ్ వీరులు మరీ ఎక్కువుగా ఉన్నారు.

Also Read: గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత , ప్రముఖ జర్నలిస్ట్ తుర్లపాటి ఇక లేరు

ఇక ఇప్పటికే నాగబాబును ఇలా చాలా సార్లు ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ నుండి పూర్తిగా బయటకు రాకముందే మరో చిన్న తప్పుడు పోస్ట్ చేసి మళ్ళీ ట్రోలింగ్ కి గురయ్యారు మెగా బ్రదర్. రీసెంట్‌గా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఫొటోకి బదులు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఫోటోను షేర్ చేస్తూ కపిల్ అభిమానుల ఆగ్రహానికి గురి అయ్యారు నాగబాబు, అయితే, కపిల్ దేవ్ బయోపిక్‌గా వస్తోన్న 83 సినిమా పోస్టర్ నుంచి రణ్‌వీర్ సింగ్ స్టిల్‌ను ఆయన పోస్ట్ చేయడం ఒక విధంగా ఆ సినిమాని ప్రమోట్ చేయడమే. కానీ, కపిల్ అభిమానులు అది ఆలోచించలేదు. నాగబాబు పై సీరియస్ అయ్యారు.

Also Read: వావ్.. 100 మిలియన్లు.. ఇంకా అదే ఊపు !

దాంతో వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు నాగబాబు. అయితే, తాజాగా మరోసారి సరిగ్గా అలాంటి పనే చేశారు నాగబాబు. డైరెక్టర్ సుకుమార్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంలో ఆయన మళ్ళీ చిన్న పోరపాటు చేశారు. నిన్న నిర్మాత అల్లు అరవింద్ బర్త్ డే. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెస్ తెలుపుతూ ఓ నాలుగు గొప్ప మాటలు చెప్పి.. ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్‌కి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే సుకుమార్ బర్త్ డే నిన్న కాదు నేడు. దాంతో మళ్ళీ ఆ పోస్ట్ ను డిలీట్ చేసేశారు నాగబాబు. ఏంటో పాపం నాగబాబు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్