https://oktelugu.com/

సక్సెస్ కోసం రొమాన్సే బెటర్ !

టాలీవుడ్ లో రవిబాబు శైలి ప్రత్యేకం. దర్శకుడిగా నటుడిగా నిర్మాతగా విభిన్న పాత్రల్లో తనకంటూ ఒక పేజీని సృష్టించుకోవడం అంటే, అంత తేలికైన విషయం కాదు. కాకపోతే, రవిబాబుకు గత కొన్ని సినిమాలుగా వరుసగా ఫ్లాపులు వెక్కిరిస్తున్నాయి. అందుకే మరోసారి తన మూలాల్లోకి వెళ్లిపోయి, తనలో దాగిన చిలిపి దర్శకుడ్ని నిద్ర లేపి సక్సెస్ కోసం రొమాన్సే బెటర్ అనే విధానాన్ని అనుసరిస్తూ మొత్తానికి మరో బూతు సినిమాని జనం మీదకు వదలడానికి రెడీ అవుతున్నాడు. Also […]

Written By:
  • admin
  • , Updated On : March 4, 2021 / 05:48 PM IST
    Follow us on


    టాలీవుడ్ లో రవిబాబు శైలి ప్రత్యేకం. దర్శకుడిగా నటుడిగా నిర్మాతగా విభిన్న పాత్రల్లో తనకంటూ ఒక పేజీని సృష్టించుకోవడం అంటే, అంత తేలికైన విషయం కాదు. కాకపోతే, రవిబాబుకు గత కొన్ని సినిమాలుగా వరుసగా ఫ్లాపులు వెక్కిరిస్తున్నాయి. అందుకే మరోసారి తన మూలాల్లోకి వెళ్లిపోయి, తనలో దాగిన చిలిపి దర్శకుడ్ని నిద్ర లేపి సక్సెస్ కోసం రొమాన్సే బెటర్ అనే విధానాన్ని అనుసరిస్తూ మొత్తానికి మరో బూతు సినిమాని జనం మీదకు వదలడానికి రెడీ అవుతున్నాడు.

    Also Read: ఎంత సంపాదించినా తృప్తి లేదు !

    తన మొదటి సినిమా ఫార్మాట్ లోకి మరోసారి దూరిపోయాడు రవిబాబు. నిజానికి తన మొదటి బూతు బోగతం “అల్లరి” సినిమాని కూడా అప్పటి ట్రెండ్, సెన్సార్ నిబంధనలకు లోబడి తీశాడు. కానీ ఈ సారి మాత్రం “క్రష్” అనే తన కొత్త బూతు తంతుకు మాత్రం ఏకంగా సెన్సార్ గేట్లును కూడా పూర్తిగా ఎత్తేసి, విచ్చలవిడిగా రెచ్చిపోయాడు. పైగా అసలు తన సినిమాకు సెన్సార్ అవ్వకపోయినా ఫర్వాలేదు, అవసరమైతే ఓటీటీలో రిలీజ్ చేసుకుంటాననే దృఢనిశ్చయంతో రవిబాబు ఈ సినిమా తీశాడట.

    Also Read: ప్చ్.. రీమేక్ లు అంటేనే భయపడుతున్నాడు !

    ఎంత బోల్డ్ గా ఆలోచించాడు. ఆ మధ్య రిలీజైన ఈ సినిమా టీజర్ చూసే ఫ్యామిలీస్ భయపడ్డాయి. అంతలా ఫస్ట్ పీప్ అంటూ రవిబాబు క్రష్ సినిమాని పూర్తిగా అడల్ట్ కంటెంట్ తో నింపిపడేశాడు. అయినా ఈ రేంజ్ లో అడల్ట్ సినిమా తీసి.. ఎలాంటి మొహమాటాలు, అనుమానాలు పెట్టుకోకుండా దైర్యంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రవిబాబు సన్నాహాలు చేసుకుంటున్నాడు అంటే.. కలెక్షన్స్ కోసం రవిబాబు పడుతున్న తాపత్రయం అర్ధమవుతుంది. కానీ, ఈ సినిమాకి కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయి అన్నదే ఇక్కడ మిలియన్ల డాలర్ల ప్రశ్న.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్