IPL Auction 2024 : విదేశీ ప్లేయర్లకు అన్ని కోట్లా.. ఇలాగైతే కోహ్లీకి 42 కోట్లు ఇవ్వాలి

అలాంటి వాళ్ల కోసం అన్ని కోట్లు ఎందుకు పెట్టారు అని ఆకాశ్ చోప్రా కూడా కలకత్తా, హైదరాబాద్ టీమ్ ల ఫ్రాంచైజ్ ల  పైన విమర్శలు చేశాడు...

Written By: NARESH, Updated On : December 20, 2023 9:05 pm
Follow us on

IPL Auction 2024 : 2024 ఐపీఎల్ సీజన్ కోసం నిన్న దుబాయ్ వేదికగా మినీ ఆక్షన్ ని నిర్వహించారు. ఇక అందులో అన్ని టీములు వారికి అవసరం ఉన్న ప్లేయర్లని కొనుగోలు చేశాయి. ఇక అందులో ఆస్ట్రేలియన్ ప్లేయర్లు అయిన పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ ఇద్దరు కూడా 20 కోట్ల పైన డబ్బులకి అమ్ముడు పోవడం అనేది ఐపీఎల్ హిస్టరీలోనే ఒక సరికొత్త రికార్డు అనే చెప్పాలి…ఇక ఇదే క్రమంలో దీని మీద చాలామంది సీనియర్ ప్లేయర్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు ముఖ్యంగా మాజీ క్రికెటర్లు అయిన సురేష్ రైనా, ఆకాష్ చోప్రా లు స్పందిస్తూ ఈ విషయం మీద చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
ఐపీఎల్ లో మన ఫ్రాంచైజ్ లు మన ఇండియన్ ప్లేయర్లను తీసుకోవడానికి కంటే విదేశీ ప్లేయర్ లను తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే వాళ్ళకి ఎక్కువ డబ్బులను పెట్టి కొనడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. నిజానికి ప్రపంచం లోనే అత్యుత్తమమైన బౌలర్లు గా పేరుపొందిన జస్ప్రీత్ బూమ్రా కి 12 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారు, అలాగే మహమ్మద్ షమీకి 5 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో విదేశీ ప్లేయర్లు అన్ని కోట్ల డబ్బులు చెల్లించడం ఏంటి అంటూ రైనా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు…
ఇక ఇదే క్రమంలో ఆకాష్ చోప్రా కూడా మాట్లాడుతూ ఈ లెక్కన చూసుకుంటే విరాట్ కోహ్లీకి 42 కోట్ల వరకు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఆయన ఐపీఎల్ హిస్టరీలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమమైన బ్యాట్స్ మెన్ గా ఉన్నాడు.ఇక  మిచెల్ స్టార్, పాట్ కమ్మిన్స్ లాంటి వాళ్లకి 20 కోట్లకు పైన చెల్లిస్తుంటే విరాట్ కోహ్లీకి 40 కోట్ల పైన చెల్లించడంలో తప్పేమీ లేదు అంటూ అతను వ్యాఖ్యానించాడు. కానీ దానికోసం ఐపీఎల్ రూల్స్ ని కొన్ని మార్చాల్సి ఉంటుంది. అదేంటి అంటే ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజ్ లా దగ్గర 100 కోట్ల పర్స్ మని ఉంది. ఆ 100 కోట్లని 200 కోట్లు చేసి 150 కోట్ల వరకు ఇండియన్ ప్లేయర్ల మీద ఖర్చు పెట్టాలి.మిగితా 50 కోట్లను విదేశీ ప్లేయర్ల మీద ఖర్చు పెట్టాలని రూల్ పెట్టినప్పుడు తప్పకుండా విరాట్ కోహ్లీ 42 కోట్ల వరకు అమ్ముడుపోతాడు అంటూ తను జోస్యం చెప్పాడు…
ఇక మిచెల్ స్టార్క్ ని 24.75 కోట్లతో కలకత్తా కొనుగోలు చేసింది. ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారుతుంది. అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన స్టార్క్ ఐపీఎల్ లో 14 మ్యాచులు ఆడితే అందులో ఒక్కో మ్యాచ్ లో  నాలుగు ఓవర్లు బౌలింగ్ చేస్తాడు. అంటే ఆయన వేసే ఒక్కో బాల్ వాల్యూ 7,60,000 రూపాయలు అవుతుంది… ఈ లెక్కన కలకత్తా టీమ్ ఆయన మీద ఒక్కో బంతికి అన్ని లక్షలు పే చేస్తుంది. మరి తన స్థాయి మేరకు పర్ఫామెన్స్ ఇవ్వగలుగుతాడా లేదా అనే విషయం పక్కన పెట్టినా కూడా ఒక్క ప్లేయర్ మీద అన్ని డబ్బులు కేటాయించడం అనేది మంచి విషయం కాదు ఒకే వేళ టాలెంట్ ని బట్టి డబ్బులు పెట్టాల్సి వస్తె మన ప్లేయర్లకి అంతకుమించి పెట్టాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్న జస్ప్రిత్ బుమ్రా,కంటే మిచెల్ స్టార్క్, పాట్  కమ్మిన్స్ లు పెద్ద బౌలర్లు అయితే కాదు… అలాంటి వాళ్ల కోసం అన్ని కోట్లు ఎందుకు పెట్టారు అని ఆకాశ్ చోప్రా కూడా కలకత్తా, హైదరాబాద్ టీమ్ ల ఫ్రాంచైజ్ ల  పైన విమర్శలు చేశాడు…