Star Director: తెలుగు ఇండస్ట్రీలో చకచకా సినిమాలు తీయడంలో ఆ డైరెక్టర్ తోపు. ఈ మధ్య ఓ స్టార్ హీరో ఛాన్స్ ఇస్తే.. తన రెమ్యునరేషన్ కూడా పెంచాడు. కాకపోతే, ఆ స్టార్ హీరోతో సినిమా ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. కానీ, మాట అయితే బయటకు వచ్చింది. కాబట్టి రేంజ్ పెరిగింది. అది వేరే సంగతి. ఇప్పుడా డైరెక్టర్ ఇల్లు ఒకటి డైలమాలో పడింది. డబ్బుల్లేక ఆఖరి నిమిషంలో ఆ ఇంటిని అమ్మేస్తున్నాడు.

అదేమిటి ? అతని దగ్గర డబ్బులు లేకపోవడం ? అని అతని గురించి తెలిసిన వాళ్ళు షాక్ అవుతున్నారు. కారణం.. ఆ ఇల్లు అమ్మాల్సిన అవసరం అతనికి ఏ మాత్రం లేదు. అతను తన తల్లిదండ్రుల కోసం ఆ ఇల్లు కొన్నాడు. అయితే, దురదృష్టవశాత్తు అతని తండ్రి ఇటీవలే చనిపోయారు. ఇల్లు ఇప్పుడు ఖాళీగా ఉంటుంది. అతనికి ఒక అక్కయ్య ఉన్నారు.
Also Read: Renu Desai- Akira Nandan: ‘అకీరా నందన్’ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్ !
ఆ అక్కయ్య ఆ ఇల్లు కోసం ఆశ పడుతున్నారు. సదరు డైరెక్టర్ కి ఆ ఇల్లు ఆమెకు ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే, తనకు డబ్బు అర్జెంట్ అంటూ ఆ ఇంటిని బేరానికి పెట్టాడు. బేరం కుదిరింది, ఓ నిర్మాత ఆ ఇంటిని కొనడానికి ముందుకు వచ్చాడు. ఇక అంతా ఓకే అనుకున్న టైమ్ లో ఆ నిర్మాత చేతులెత్తేశాడు. తనకు ఫైనాన్షియర్లు డబ్బులు ఇవ్వడం లేదని, కాబట్టి ఇప్పుడు ఇల్లును కోనలేనని చెప్పేశాడు.
నిర్మాత హ్యాండ్సప్ అనడంతో సదరు దర్శకుడు ఆ ఇంటిని ఎలా అమ్మాలా ? అంటూ ప్లాన్స్ వేసే పనిలో పడ్డాడు. మరోపక్క ఆ దర్శకుడు అక్కయ్య గారు మాత్రం ఈ ఇల్లు తనది అని, తన తండ్రి బతికి ఉన్నప్పుడే తన పేరు మీద రాశాడు అని వాదిస్తోంది. పైగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా చూపిస్తోంది. మరి ఇప్పుడు ఆ డైరెక్టర్ ఏమి చేస్తాడో చూడాలి.

ప్రస్తుతానికి అయితే, ఇంటిని సాఫీగా అమ్మడానికి, కస్టమర్ల కోసం అన్వేషిస్తున్నాడు. ఇందులో భాగంగా తనకు తెలిసిన సౌండ్ పార్టీలకు ఫోన్లు చేస్తున్నాడు సదరు దర్శకుడు. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఎవ్వరు ఆ ఇల్లు కొనడానికి ముందుకు రావడం లేదు.
Also Read:NTR-Sai Pallavi: ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్ కి పోటీగా సాయిపల్లవి డ్యాన్స్ చేస్తే.. ?