August Box office : ఆగస్టు నెలలో కొంచెం సెలవు దినాలు ఎక్కువే. స్వాతంత్ర దినోత్సవం, వరలక్ష్మి వ్రతం, శ్రీ కృష్ణాష్టమి ఇలా ఎన్నో సెలవులు ఈ నెలలో మనల్ని పలకరిస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ఈ నెలలో ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధమై భారీగానే పోటీ పడనున్నాయి. మరి ఈ నెలలో మనల్ని అల్లరించడానికి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం…
నెల్సన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం “జైలర్” ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో చేస్తున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్‌కు చెందిన కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 10న రిలీజ్ కాబోయే ఈ సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన తమన్నా సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది.
మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తూ ఉన్న సినిమా బోళా శంకర్ 2015 లో విడుదలైన తమిళ చిత్రం “వేదాళం” యొక్క అధికారిక రీమేక్. ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కూడా నటించారు. ఈ చిత్రం ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఇక ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉన్నాయి.
దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న “కింగ్ ఆఫ్ కోతా” మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ఇప్పటికే ఈ చిత్రమే హామీ ఇచ్చారు. అభిలాష్ జోషి దర్శకుడిగా అరంగేట్రం చెయ్యనున్న ఈ సినిమా ఆగస్టు నెలలో ఓనం పండుగకు విడుదల కానుంది.
కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన “బెదురులంక 2012” ఈస్ట్ గోదావరి నేపథ్యంలో సాగే నాటకీయ చిత్రం. మణిశర్మ సంగీతం అందించి, క్లాక్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 25న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర మేకర్స్.
“ఆర్‌ఎక్స్ 100” ఫేమ్ అజయ్ భూపతి రచన, దర్శకత్వం వహించిన “మంగళవారం” 90 బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమా. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో సహా పలు భాషల్లో ఈ చిత్రం ఈ నెలలో విడుదల కానుంది.
నయనతార, జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం “ఇరైవన్”. అహ్మద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెలలో విడుదల కానుంది.
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రానున్న మమ్ముట్టి “కన్నూర్ స్క్వాడ్” ఈ నెలలో విడుదల కానున్న అగ్ర హీరోల మలయాళీ చిత్రాలలో ఒకటి.
ఆగస్ట్ ముగుస్తున్న కొద్దీ, సినిమా ఔత్సాహికులు యాక్షన్, ఇక థ్రిల్లర్ నుండి కామెడీ డ్రామా వరకు అనేక రకాలైన జూనియర్స్ కి చెందిన సినిమాలను చూసేయొచ్చు. ఎందుకంటే పైన చెప్పిన ప్రకారం ఎన్నో సినిమాలు ఈ నెలలో విడుదల కాలంలో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆగస్టులో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో సినిమా ట్రీట్ కోసం సిద్ధంగా ఉండండి!