Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu - Pawankalyan : చంద్రబాబులో భయం.. వారాహి టీడీపీ కొంపముంచనందా? పవన్ పవర్ ఫుల్...

Chandrababu – Pawankalyan : చంద్రబాబులో భయం.. వారాహి టీడీపీ కొంపముంచనందా? పవన్ పవర్ ఫుల్ అవుతాడా?

Chandrababu – Pawankalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కీలకంగా మారనున్నాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా జనసేనాని అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా నువ్వు వ్యతిరేకిస్తుండడం వల్ల చంద్రబాబుకు దగ్గరగా ఉంటారన్న ఉద్దేశంతో టిడిపి అనుకూల మీడియాకు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నచ్చుతున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ అప్పుడున్న పరిస్థితులను బట్టి ఎప్పుడు, ఎలా మారతారో కూడా ఎవరికీ అంతుచిక్కదని ఆయనతో సన్నిహితంగా ఉన్న ఎంతోమంది చెబుతున్నారు. ఇదే విషయాన్ని టిడిపి వర్గాలు కూడా ధ్రువీకరిస్తున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ యాత్రతో ప్రజల్లోకి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. బుధవారం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. వైసిపి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చనివ్వనని ఇంత వరకు ఆయన చెబుతూ వచ్చారు. ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందలేనని, అందుకే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటానని పవన్ కళ్యాణ్ పదే పదే అంటూ వస్తున్నారు. అయితే, గౌరవ ప్రదమైన సీట్లు ఇస్తేనే పొత్తు ఉంటుందనే షరతు కూడా విధించారు. రాజకీయాల్లో గౌరవం, మర్యాద అనేవి పైకి చెప్పుకోవడానికే. రాజకీయ పార్టీలు అవకాశాల గురించే తప్ప మిగిలిన అంశాలను అస్సలు పట్టించుకోవు. అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరించే మనిషి. తన గౌరవ మర్యాదలకు ఏమాత్రం ఇబ్బంది కలిగిన తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించే గుణం ఆయన సొంతం. కాబట్టి పవన్ కళ్యాణ్ తో తేడా వస్తే తెలుగుదేశం పార్టీకే ఇబ్బందులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్న మాట.
పవన్ ఆలోచనల్లో మార్పు వస్తే మాత్రం ఇబ్బందే..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి వారాహి యాత్రతో జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ యాత్రకు జనం భారీగా పోటెత్తే అవకాశం ఉంది. తన యాత్రకు వచ్చే జనాన్ని చూసి.. తెలుగుదేశం పార్టీతో ముందుకు వెళ్లాలన్న పవన్ కళ్యాణ్ ఆలోచనలో మార్పు వస్తే ఏమిటి పరిస్థితి అన్న ప్రశ్న తెలుగుదేశం పార్టీ నాయకులను వేధిస్తోంది. ప్రస్తుతం జనసేన పార్టీకి 22 సీట్లు ఇచ్చి ఆయన సామాజిక వర్గం, అభిమానుల మద్దతు పొందాలనేది టిడిపి ఎత్తుగడగా ఉంది. అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సీట్లకు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. వారాహి యాత్ర ప్రారంభమైన తరువాత ప్రజల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న ఆదరణ బయటపడుతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ మరిన్ని ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే తమకు మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.
వారాహి యాత్రతో పవన్ బలపడకూడదనేది టిడిపి యోచన..
నమ్మినోళ్లను నట్టేట ముంచడంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరితేరారనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఈ నిజం తెలిసి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విభేదించడం వల్ల తెలుగుదేశం పార్టీతో మరోసారి కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోకపోతే వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా పతనావస్థకు చేరే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ తెలిసినప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వెళ్లి ఆ పార్టీని బతికించే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా రాజకీయాల్లో ఎదుటి పార్టీలు బలపడకూడదని మిగిలిన పార్టీలు భావిస్తుంటాయి. అందుకు విరుద్ధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ మాదిరిగా జనసేన పార్టీ బలంగా తయారు కావాలన్నా ఆకాంక్షను వ్యక్తం చేయడం లేదు. వారాహి యాత్రతో జనాల్లోకి పవన్ కళ్యాణ్ వెళుతుండడంతో.. ఎక్కువ మంది జనాలు వస్తే మరిన్ని ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తారన్న ఆందోళన టిడిపిలో కనిపిస్తోంది. అందుకే వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్ బలపడకూడదనేది టిడిపి కోరిక. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం జనసేనకు జనాదరణ ఉండాలని ఆశిస్తే.. అదే రానున్న రోజుల్లో తమకు ఏకు మేకు అవుతుందని టిడిపి వర్గాల్లో వినిపిస్తున్న మాట. చూడాలి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో వచ్చే జన స్పందనను తెలుగుదేశం పార్టీగాని, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాగానీ ఏ విధంగా తీసుకుంటుందో.
RELATED ARTICLES

Most Popular