Munugodu Exitpolls : ఓవైపు గులాబీ దండు.. మరోవైపు కాషాయ దళం.. మధ్యలో కాంగ్రెస్ శ్రేణులు.. దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసినట్టు అధికారులు ప్రకటించారు. అయితే క్యూలో భారీగా ఓటర్లు బారులు తీరి ఉండడంతో వారికి ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ 77 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. చివరి వరకూ 90శాతం దాటే అవకాశం కనిపిస్తోంది. కాగా అన్ని టాప్ న్యూస్ చానెల్స్, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. మునుగోడులో గెలుపు ఎవరిదన్నది బయటపెట్టాయి. అందరూ ఊహించిన దానికి భిన్నంగా మునుగోడులో ఫలితం రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మునుగోడు ఉప ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తుతున్నాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ లో ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోరుమాత్రమే ఉందని తేలుతోంది. బీజేపీ మూడో స్థానంలోకి పడిపోయిందని సమాచారం. రాజగోపాల్ రెడ్డిపై వ్యతిరేకత కారణంగానే ఆయనకు తక్కువ ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఎంత డబ్బులు, మద్యం,బంగారం పంచినా కూడా ప్రజలు తీసుకొని తెలంగాణ అధికార పార్టీకే పట్టం కట్టబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ కోడై కూస్తున్నాయి.
*వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ చూస్తే..
*-థర్డ్ విజన్ రీసెర్చ్-నాగన్న ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం..*
టీఆర్ఎస్ కు 48-51 శాతం ఓట్లు
బీజేపీకి 31-35 శాతం ఓట్లు
కాంగ్రెస్ కు 13-15 శాతం ఓట్లు
*-SAS గ్రూప్ సర్వే ప్రకారం..*
టీఆర్ఎస్ కు 41-42 శాతం ఓట్లు
బీజేపీకి 35-36 శాతం ఓట్లు
కాంగ్రెస్ కు 16.5-17.5 శాతం
*-నేషనల్ ఫ్యామిలీ సర్వే ప్రకారం..*
టీఆర్ఎస్ కు 42 శాతం,
బీజేపీకి 35.17 శాతం ఓట్లు
ఇలా మూడు సంస్థల ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. అన్నింట్లోనూ టీఆర్ఎస్ కు 40శాతానికి పైగా ఓట్లు వస్తాయని తేలింది. ఇక రెండో స్థానంలోని బీజేపీ 35శాతానికి పైగా ఓట్లు వస్తాయని తేలింది. కాంగ్రెస్ కు 16శాతం వరకే పరిమితమైంది. ఓవరాల్ గా టీఆర్ఎస్ గెలుస్తుందని అర్థమవుతోంది.