Ramana Deekshitulu: తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలా?

తిరుమలలో ప్రసాదాలు తయారు చేసే కిచెన్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని కూడా రమణ దీక్షితులు ఆరోపణలు చేశారు. నిషేధిత మత్తు వస్తువులు కూడా వినియోగిస్తుంటారని.. తిరుమల ఆలయంలోని పరకామణిలో గ్రానైట్ తీసి తవ్వకాలు చేస్తున్నారని కూడా సంచలన ఆరోపణలు చేశారు.

Written By: Dharma, Updated On : February 22, 2024 6:28 pm
Follow us on

Ramana Deekshitulu: గత ఎన్నికలకు ముందు టిడిపి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వచ్చేందుకు చాలా శక్తులు పనిచేశాయి. మేధావి బృందం వైసిపికి అనుకూలంగా పనిచేసింది. ఈ క్రమంలో అప్పటి చంద్రబాబు సర్కార్ పై ఆరోపణలు చేయడంలో ఈ బృందం ముందుండేది. అందులో రమణ దీక్షితులు ఒకరు. చంద్రబాబు ప్రభుత్వం పై ఆయన చేసిన ఆరోపణల గురించి చెప్పాల్సిన పనిలేదు. వాటిని పట్టుకొని వైసీపీ నేతలు ఏ రేంజ్ లో రాజకీయాలు చేశారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. తెలుగుదేశం పార్టీ రమణ దీక్షితులపై పరువు నష్టం దావా కూడా వేసింది. కానీ అధికారంలోకి వచ్చాక ఆ కేసు ముందుకెళ్లలేదు. అయితే వైసిపి ప్రభుత్వం మంచి ఆశించినది దక్కలేదో.. ఇతర కారణం తెలియదు కానీ ఇప్పుడు రమణ దీక్షితులు అదే తరహా ఆరోపణలు వైసీపీ సర్కార్ పై చేయడం విశేషం. అయితే నేరుగా ఆయన విమర్శలు చేయలేదు. ఆయన విమర్శలు లీక్ అయ్యాయి.

ముఖ్యంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డిని రమణ దీక్షితులు టార్గెట్ చేసుకున్నారు. పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. ఈవోగా ఉన్న ధర్మారెడ్డి క్రిస్టియన్ అంటూ ఆరోపించారు. టీటీడీలో చాలామంది క్రిస్టియన్లు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్. సీఎం జగన్ క్రిస్టియన్ అని దీక్షితులు వ్యాఖ్యానించారు. ధర్మారెడ్డి కుమారుడు చనిపోతే దహనం చేయలేదని.. ఖననం చేశారని.. కనీసం ధర్మారెడ్డి బొట్టు కూడా పెట్టుకోడని దీక్షితులు కామెంట్ చేయడం విశేషం.

మరోవైపు టిటిడి అంతర్గత విషయాలపై సైతం దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అహోబిలంలో గుప్త నిధులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. రెండు శతాబ్దాల కిందట కొండమీద ఒక గుహలో ఓ జీయర్ లోపలికి వెళ్లి సమాధి అయ్యాడని.. ఆ గుహలో అప్పట్లో విజయనగరం సామ్రాజ్యకాలంలో పెద్ద ఎత్తున నిధులు పెట్టారని చెప్పుకొచ్చారు. దాన్ని బయటకు తీయాలని చాలాసార్లు అహోబిలం జీయర్ దగ్గరికి ధర్మారెడ్డి వెళ్లి వస్తుంటారని కూడా దీక్షితులు చెప్పడం విశేషం. బెంగళూరులో ఆర్కియాలజీలో పురుషోత్తమ రెడ్డి అనే అధికారి ధర్మారెడ్డి మనిషి అని కూడా దీక్షితులు ప్రకటించడం విశేషం.

తిరుమలలో ప్రసాదాలు తయారు చేసే కిచెన్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని కూడా రమణ దీక్షితులు ఆరోపణలు చేశారు. నిషేధిత మత్తు వస్తువులు కూడా వినియోగిస్తుంటారని.. తిరుమల ఆలయంలోని పరకామణిలో గ్రానైట్ తీసి తవ్వకాలు చేస్తున్నారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. వెయ్యికాళ్ల మండపం, దేవ మండపం.. ఇలా అన్నింటిని నిధుల కోసమే తవ్వారని ఆరోపించారు. అక్కడ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని కూడా చెప్పుకొచ్చారు.అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన రామచంద్ర యాదవ్ నేరుగా అమిత్ షాక్ లేఖ రాశారు. ఈ వీడియో పై వివాదం నెలకొన్న నేపథ్యంలో రమణ దీక్షితులు స్పందించారు. ఆ వీడియోలో ఉన్న వాయిస్ తనది కాదని తేల్చి చెప్పారు. అయితే వైసిపి ప్రభుత్వం నుంచి ఆశించినది దక్కకపోవడం వల్లే ఎన్నికల ముంగిట ఈ తరహా ప్రయత్నాలకు రమణ దీక్షితులు దిగారని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.