https://oktelugu.com/

Europe society in crisis : ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంతో సంక్షోభంలో యూరప్ సమాజం

ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంతో సంక్షోభంలో యూరప్ సమాజంపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింద చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : November 2, 2023 / 06:10 PM IST

    Europe society in crisis : యూరప్ సమాజం సంక్షోభంలో కూరుకుపోయింది. ఎందుకంటే లండన్ లో కంటిన్యూస్ గా మూడు వీకెండ్స్ జిహాద్ అంటూ మారుమోగిపోతోంది. పారిస్ లో ప్రదర్శనలు నిషేధించినా ఉల్లంఘించి నిరసనలు తెలుపుతున్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్ లోనూ ఇవే నిరసనలుజరుగుతున్నాయి. ముస్లింలకు మద్దతుగా ప్రదర్శనలు చేస్తున్నారు. జోర్డన్ రివర్ నుంచి మెరిటేరియట్ వరకూ అంతా మాదేనని.. ఇజ్రాయిల్ దేశం ఉండకూడదని.. నాశనమైపోవాలని యూరప్ లో జరుగుతున్నాయి.

    ఈ నిరసనలు ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు. యూరప్ సమాజం భావ స్వేచ్ఛను, వ్యక్తిగత స్వేచ్ఛను నమ్మే సమాజం అది. ఆధునిక వ్యవస్థకు యూరప్ సమాజమే ఆదర్శం. ఫ్రెంచి విప్లవం నుంచే ఇవన్నీ ఉద్బవించాయి. యూరప్ అనేది స్వేచ్ఛకు ప్రతిరూపం. ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు.. తిట్టవచ్చు.. అది హింసగా మారనంత వరకూ దాన్ని ఆమోదిస్తామని యూరప్ సమాజం చెబుతోంది.

    యూరప్ కొన్ని శతాబ్ధాలుగా స్వేచ్ఛగా బతుకుతోంది. ఏ మత గ్రంథాలను అయిన విమర్శించే హక్కు ఆ దేశాల్లో ఉంది. మరి వచ్చేవారికి అదే అభిప్రాయం ఉండాలని ఉండదు కదా.. అదే ఇక్కడ సమస్యగా మారింది.

    ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంతో సంక్షోభంలో యూరప్ సమాజంపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింద చూడొచ్చు.