
ప్రకృతే ఈ భూమ్మీద జీవ కోటి మనుగడకు ప్రాణం పోసింది. చెట్లు-జీవులకు అవినాభావ సంబంధం ఏర్పడింది. చెట్లు ఆక్సిజన్ విడుదల చేసి మనుషులను కాపాడితే.. మనుషులు కార్పన్ డై అక్సైడ్ విడుదల చేసి చెట్లకు ప్రాణం పోస్తున్నారు. ఈ భూమ్మీద ఈ రెండు ఆధారపడి జీవించేవే..
Also Read: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే?
అయితే ఈ భూమ్మీద ఎన్నో రకాల చెట్లు తమంత తాముగా పెరిగి పెద్దదవుతున్నాయి. మనిషి తన అవసరాల కోసం చెట్లను నరికి ఇప్పుడు ప్రకృతి బీభత్సానికి కారణమవుతున్నాడు.. మనిషికి, చెట్టుకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. మానవ మనుగడకు చెట్లు జీవనాధారం.. చెట్టునుంచి వచ్చే పండ్లు, ఫలాలు, ఆకులతోనే మనిషి జీవితం ప్రారంభమైంది. మనిషి నుంచి ఏం ఆశించకుండా స్వయం ప్రతిపత్తితో పెరిగే చెట్లు మనిషికి ఎన్నో ఇచ్చాయి.
దేశంలో చెట్ల సంఖ్య పడిపోతోంది. అడవులు తరగిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే చెట్లను పెంచే హరితహారం లాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విదేశాల్లో మాత్రం చెట్లను ప్రాణంగా చూసుకుంటారు. రోడ్డు వెడల్పులో భారీ చెట్లను తీసేయకుండా వాటి వేళ్లను కట్ చేసి వేరే చోట నాటుతారు.. అలాంటి టెక్నాలజీ ఇంకా దేశంలో రాలేదు..
Also Read: ఆకుకూరలు తినే ప్రతి ఒక్కరూ ఇది చదవాల్సిందే..
అయితే చెట్లకు రూపాలుంటాయి.. కొన్ని చెట్లు ఏపుగా, గుబురుగా పెరిగితే.. మరికొన్ని వివిధ ఆకృతుల్లో కనువిందు చేస్తుంటాయి.. మానవ అవయావాలను తమలో ఇముడ్చుకున్న పలు చెట్లు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్నాయి. యూరప్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సహా చాలా దేశాల్లో మానవుల అవయవాలను పోలిన ఈ చెట్లు పర్యాటకంగా అందరినీ అలరిస్తున్నాయి. ఈ శృంగార చెట్లు మనుషుల వలే కలగలసి పోయి సృష్టికార్యాన్ని గుర్తు చేస్తున్నాయి..