Eider down : బంగారం కంటే విలువైనది.. ప్లాటినం కంటే ఖరీదైనది.. ఇంతకీ ఏంటది?

సాధారణంగా మన ప్రాంతంలో బాతులు గుడ్లు పెట్టేటప్పుడు తన రెండు కాళ్ళతో నేలను కొంచెం గుల్లగా చేసుకుంటాయి. ఆ తర్వాత అందులో గుడ్లను పెడతాయి. వెచ్చదనం కోసం మళ్లీ మట్టిని దగ్గరికి జరుపుతాయి. కానీ గుడ్లపై పొదిగేంత వెచ్చదనం వాటి వద్ద ఉండదు. కానీ వెస్ట్రన్ కంట్రీస్ లో కొన్ని రకాల కు చెందిన బాతులు గుడ్లను నదీతీర ప్రాంతాల్లో పెడతాయి.

Written By: NARESH, Updated On : March 13, 2024 8:27 am

Eider down is more valuable than gold and more expensive than platinum

Follow us on

Eider down : ఈ భూమ్మీద ఖరీదైన వస్తువుల గురించి చెప్పాలంటే ముందుగా మన మదిలో మెదిలేది బంగారమే. ఆ తర్వాత ప్లాటినం, వజ్రాలు, కెంపులు, వైడూర్యాల గురించి చెబుతుంటాం. కానీ వీటన్నింటి కంటే విలువైన వస్తువు మరొకటి ఉంది. అది భూమ్మీద ఎక్కువగా లభ్యం కాదు. సంవత్సరం మొత్తం మీద మహా అయితే 50 కేజీల వరకు సేకరించవచ్చు. అలా సేకరించిన దానితో ఒక వస్తువు తయారు చేస్తే.. అది ఆరు లక్షలకు పైగా ఖరీదు చేస్తుంది. ఇంతకీ అదేంటంటే..

సాధారణంగా మన ప్రాంతంలో బాతులు గుడ్లు పెట్టేటప్పుడు తన రెండు కాళ్ళతో నేలను కొంచెం గుల్లగా చేసుకుంటాయి. ఆ తర్వాత అందులో గుడ్లను పెడతాయి. వెచ్చదనం కోసం మళ్లీ మట్టిని దగ్గరికి జరుపుతాయి. కానీ గుడ్లపై పొదిగేంత వెచ్చదనం వాటి వద్ద ఉండదు. కానీ వెస్ట్రన్ కంట్రీస్ లో కొన్ని రకాల కు చెందిన బాతులు గుడ్లను నదీతీర ప్రాంతాల్లో పెడతాయి. అవి ఆ ప్రాంతంలో పెట్టినప్పుడు గుడ్లపై వెచ్చదనం కోసం ఐడర్ డౌన్ (Eider down) అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది ఒక రకమైన దూదిలాగా ఉంటుంది. నీటిలో ముంచినప్పటికీ తడవదు. పైగా అత్యంత తేలికగా ఉంటుంది. దానిని ఉపయోగించి పరుపులు తయారు చేస్తారు. అలా తయారు చేసిన ఒక్కో పరుపును ఆరు లక్షల వరకు విక్రయిస్తుంటారు.

ఐడర్ డౌన్ ద్వారా తయారు చేసిన పరుపులను కేవలం శ్రీమంతులు మాత్రమే కొనుగోలు చేస్తారు. సంవత్సరం మొత్తం మీద ఐడర్ డౌన్ ను కేవలం 50 కిలోల వరకే సేకరించగలరు. అందువల్లే వాటితో తయారు చేసిన పరుపులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇప్పటివరకు ఈ ప్రపంచంలో ఆగర్భ శ్రీమంతులు మాత్రమే ఆ పరుపులు కొనుగోలు చేశారు. మరో నాలుగు సంవత్సరాల వరకు పరుపులు తయారీ కి ఆర్డర్లు ఉన్నాయి.. అంటే ఇప్పట్లో డబ్బులు ఉన్నా ఆ పరుపులు కొనుగోలు చేసే అవకాశం లేదు.. అన్నట్టు ఐడర్ డౌన్ కు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో బాతుల పెంపకాన్ని విరివిగా చేపడుతున్నారు..