Prakash Raj: మోడీతో పెట్టుకున్నాడు.. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనుభవిస్తున్నాడు

కేరళలోని తిరుచ్చికి చెందిన ప్రణవ్ జ్యువెలర్స్ అనే కంపెనీకి ప్రకాష్ రాజ్ ప్రచారకర్తగా పనిచేస్తున్నారు. ఆ కంపెనీ పై నవంబర్ 20న ఈడి దాడులు చేసింది. ఆ జువెలరీ సంస్థ నుంచి లెక్కల్లో చూపని దాదాపు 24 లక్షల నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడి స్పష్టం చేసింది.

Written By: Dharma, Updated On : November 24, 2023 8:58 am

Prakash Raj

Follow us on

Prakash Raj: భారతీయ జనతా పార్టీతో పాటు మోడీ విధానాలను విమర్శించడంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ ముందుంటారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో నటించారు. ప్రతిభ కలిగిన నటుడిగా గుర్తింపు పొందారు. అటువంటి వ్యక్తి మోదీ ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతుంటారు. దీంతో ఆయన ఎప్పుడు దొరుకుతాడా? ఇరికిద్దామా? అన్న ఆలోచనలో కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నట్టు ఉన్నారు. ఓ బంగారం షాపునకు సంబంధించి యాడ్లో ప్రకాష్ రాజ్ నటించడం.. సదరు సంస్థ స్కీం పేరిట వందల కోట్లు వసూలు చేసిందని ఈడీ నమోదు చేయడం జరిగింది. అయితే ప్రచారకర్తగా ఉన్న ప్రకాష్ రాజ్ కు సైతం ఈడి నోటీసులు జారీ చేయడం విశేషం.

ఎక్కువ మాట్లాడకు.. మీ ఇంటికి ఈ డి వస్తుందని ఆ మధ్యన ఏకంగా పార్లమెంటులో అధికార పార్టీ ఎంపీ ఒకరు ప్రత్యర్థి పార్టీ ఎంపీని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రత్యర్థులపై ఈడిని కేంద్రం ప్రయోగించడం పై విమర్శలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఏదో ఒక లింకు పెట్టి నోటీసులు జారీ చేయడం ఇటీవల జరుగుతుంది. మహదేవ్ యాప్ నకు సంబంధించి ప్రచారకర్తలు అందరికీ నోటీసులు జారీ చేశారు. అది మరువక ముందే ప్రకాష్ రాజ్ కు నోటీసులు జారీ చేయడం విశేషం.

కేరళలోని తిరుచ్చికి చెందిన ప్రణవ్ జ్యువెలర్స్ అనే కంపెనీకి ప్రకాష్ రాజ్ ప్రచారకర్తగా పనిచేస్తున్నారు. ఆ కంపెనీ పై నవంబర్ 20న ఈడి దాడులు చేసింది. ఆ జువెలరీ సంస్థ నుంచి లెక్కల్లో చూపని దాదాపు 24 లక్షల నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడి స్పష్టం చేసింది. ఆ సంస్థకు ప్రకాష్ రాజ్ ప్రచారకర్తగా ఉండడంతో అతనికి సైతం ఈడి విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ స్కీం ద్వారా ప్రణవ్ జ్యువెలర్స్ వందల కోట్లు వసూలు చేసినట్లు ఈడి చెబుతోంది. అయితే ఇందులో ప్రకాష్ రాజ్ పాత్ర ఉందన్న కోణంలో ఈడి నోటీసులు జారీ చేయడం విశేషం.

ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో తన సోషల్ మీడియా ఖాతాలో మోడీ తీరును ఎగతాళి చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో బాహటంగానే బిజెపిపై విమర్శలు చేసేవారు. ఒక విధంగా చెప్పాలంటే సినీ రంగంలో అతిరథ మహారధులు బిజెపికి సలాం కొడుతున్న తరుణంలో ప్రకాష్ రాజు కొరకరాని కొయ్యగా మారారు. వాస్తవానికి ఆ జ్యూయలరీ సంస్థ లావాదేవీలతో ప్రకాష్ రాజ్ కు ఏం సంబంధం? దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ప్రకాష్ రాజ్ నటిస్తుండటంతో బిజీగా ఉంటారు. ఒకటి రెండు రోజుల కాల్ షీట్లు ఇచ్చి జ్యుయలరీ సంస్థకు సంబంధించి ప్రచార ప్రకటనల్లో నటించి ఉంటారు. అయితే కంపెనీ లావాదేవీలకు ప్రకాష్ రాజ్ ను బాధ్యులుగా చేసి నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ రాజకీయ కక్ష ధోరణితో చేసినదే నన్న విమర్శలు వినిపిస్తున్నాయి.