గౌరీమాత అలంకరణలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ!

నవరాత్రి వేడుకల్లో భాగంగా ఎంతో ముఖ్యమైన రోజు ఎనిమిదవ రోజు. ఈ రోజును దుర్గాష్టమి అని కూడా పిలుస్తారు. దుర్గాష్టమి రోజు అమ్మవారు శ్రీ గౌరీ మాత అలంకరణ లో భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఏడవరోజున కాళరాత్రి అవతారంలో చీకటి రంగును ధరించిన అమ్మవారు ఎనిమిదవ రోజున ఆ చీకటిని చీల్చుకుని తెలుపు వర్ణంలో ఎంతో ప్రకాశవంతంగా భక్తులకు దర్శనం కల్పిస్తారు. శ్రీ గౌరీ మాత అలంకరణ లో తెలుపు రంగు చీరను ధరించి నాలుగు చేతులు […]

Written By: Navya, Updated On : October 24, 2020 10:56 am
Follow us on

నవరాత్రి వేడుకల్లో భాగంగా ఎంతో ముఖ్యమైన రోజు ఎనిమిదవ రోజు. ఈ రోజును దుర్గాష్టమి అని కూడా పిలుస్తారు. దుర్గాష్టమి రోజు అమ్మవారు శ్రీ గౌరీ మాత అలంకరణ లో భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఏడవరోజున కాళరాత్రి అవతారంలో చీకటి రంగును ధరించిన అమ్మవారు ఎనిమిదవ రోజున ఆ చీకటిని చీల్చుకుని తెలుపు వర్ణంలో ఎంతో ప్రకాశవంతంగా భక్తులకు దర్శనం కల్పిస్తారు.

శ్రీ గౌరీ మాత అలంకరణ లో తెలుపు రంగు చీరను ధరించి నాలుగు చేతులు కలిగి ఉంటుంది రెండు చేతులలో త్రిశూలం, రెండు చేతులను డమరుకాన్ని పట్టుకొని ఎద్దు పై కొలువై ఉండి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈరోజు అమ్మవారికి తెల్లటి మల్లెపూలతో పూజలు చేస్తారు. అంతేకాకుండా అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా వారికి అమ్మవారి అనుగ్రహం కలిగి దీర్ఘసుమంగళీ ప్రాప్తి కలుగుతుంది.

ఈ దుర్గాష్టమి రోజున శ్రీ మహా గౌరీ కన్యా దేవిగా కూడా పూజిస్తారు. ఈరోజు 9 మంది బాలికలను మన ఇంటికి ఆహ్వానించి వారికి భోజనాలను సమర్పించి వారికి ఏదైనా బహుమతులను కానుకగా ఇవ్వడం ద్వారా శుభం కలుగుతుంది. పెళ్లికాని అమ్మాయిలు ఈ అమ్మవారిని పూజించడం ద్వారా వారికి వివాహ యోగం కలిసివస్తుంది. పెళ్లికాని అమ్మాయిలు మంచి భర్త రావాలని కూడా ఈ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. పెళ్లి అయిన వారు ఈ అమ్మవారిని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం కలుగుతుంది. నవరాత్రులలో భాగంగా ఎనిమిది రోజులు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.