https://oktelugu.com/

రూ.35కే ఉల్లిగడ్డను విక్రయించాలి

రూ.35కే ఉల్లిగడ్డను విక్రయించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శనివారం ఆదేశించారు. గత కొన్ని రోజులగాఉల్లిగడ్డ ధర రూ. 100  పలుకుతుండడంతో కేంద్రప్రభుత్వం తాజాగా బఫర్ స్టాక్ నుంచి ఉల్లిని తీసుకోవాలని రాష్ట్రాలకు , కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు అసోం, బీహార్, చండీగఢ్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని జంట నగరాల్లోని 11 రైతు బజార్లలో ఉల్లిగడ్డ రూ. 35కే విక్రయించాలని మంత్రి నిరంజన్ […]

Written By: , Updated On : October 24, 2020 / 11:03 AM IST
onion prices
Follow us on

రూ.35కే ఉల్లిగడ్డను విక్రయించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శనివారం ఆదేశించారు. గత కొన్ని రోజులగాఉల్లిగడ్డ ధర రూ. 100  పలుకుతుండడంతో కేంద్రప్రభుత్వం తాజాగా బఫర్ స్టాక్ నుంచి ఉల్లిని తీసుకోవాలని రాష్ట్రాలకు , కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు అసోం, బీహార్, చండీగఢ్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని జంట నగరాల్లోని 11 రైతు బజార్లలో ఉల్లిగడ్డ రూ. 35కే విక్రయించాలని మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బతిన్నదని, ఎలాంటి లాభం లేకుండా రవాణా ఖర్చులు, దెబ్బతిన్న సరుకును చూసుకొని అమ్మకాలు జరపాలన్నారు.