Dr. Uma .R. Katiki (Aramandla) : ఆమె జీవితం.. సేవకు అంకితం.. అసమాన వ్యక్తిత్వం డా.ఉమా. ఆర్. కటికి (ఆరమండ్ల)

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల్లో ‘సాంస్కృతిక సమన్వయకర్త’గా పోటీచేస్తోన్న డా. ఉమా .ఆర్. కటికి (ఆరమండ్ల) (Dr. Uma .R. Katiki (Aramandla )) గారు..

Written By: NARESH, Updated On : December 24, 2023 9:03 am
Follow us on

  • ఉన్నత విద్యావంతురాలు.. గొప్ప విద్యావేత్త డా. ఉమా .ఆర్. కటికి (ఆరమండ్ల)
  •  తానాలో అందరికీ చేదోడువాదోడుగా విస్తృత సేవలు
  • మహిళలకు నేనున్నాంటూ భరోసా
  • గృహహింసతో బాధపడే మహిళలకు తోడునీడ
  • చైతన్యస్రవంతి’ పేరిట మహిళా సాధికారితకు అగ్రతాంబూలం
  • మహిళల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు
  • చికాగో ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షురాలిగా గతంలో విస్తృత సేవలు
  • మరోసారి తానా ఎన్నికల్లో పోటీ చేస్తున్న డా. ఉమాగారికి మద్దతుగా అమెరికాలోని తెలుగువారి ఉధృత ప్రచారం

TANA Elections  – Dr. Uma .R. Katiki (Aramandla) : కష్టేఫలి అంటారు.. తల్లిదండ్రుల నేర్పిన పాఠాలను శ్రద్ధగా వింటూ ఆమె పెరిగారు.. వారి సేవలను స్ఫూర్తిగా తీసుకున్నారు. అందుకే అగ్రదేశం అమెరికా చేరినా ఆ సేవ తత్పరతను వదులుకోలేదు. ఆపదలో ఉన్న ప్రతీవారికి అండగా నిలుస్తున్నారు.. ఆదుకుంటున్నారు.. ఆమె ఎవరో కాదు… ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల్లో ‘సాంస్కృతిక సమన్వయకర్త’గా పోటీచేస్తోన్న డా. ఉమా .ఆర్. కటికి (ఆరమండ్ల) (Dr. Uma .R. Katiki (Aramandla )) గారు..

ఫీడ్ మై స్టర్వింగ్ చిల్డ్రన్‌  కార్యక్రమంలో  వాలంటీర్లతో   డా. ఉమా గారు  

ప్రచార ఆర్భాటాలకు ఉమా గారు పోరు.. హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటారు.. పుట్టినిల్లైనా.. మెట్టునిల్లైనా సరే మహిళలు ఆపదలో ఉన్నారంటే ముందుంటారు.. సమాజంలోని ప్రతీ బాధను తన బాధగా భావించి ముందుండి ఆదుకుంటారు.. అందుకే సైలెంట్ గా సేవ చేసుకుంటూ వెళుతున్న డా. ఉమా గారి సేవలకు అంత పేరు ప్రఖ్యాతలు దక్కాయి..

కేఎల్ యూనివర్సిటీలో పేద ఇంజినీరింగ్ విద్యార్థిలకు ఆర్థికసాయం అందజేస్తున్న డా. ఉమా గారు

-డా. ఉమా గారి బయోడేటా..

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జన్మించి అమెరికాకు ఏగి అంచలంచెలుగా ఎదిగి.. ఎన్నో సేవా కార్యక్రమాలతో గొప్ప సంఘసంస్కర్తగా ఉమా గారు పేరుతెచ్చుకున్నారు. ఉమాగారు ఆంధ్ర యూనివర్సిటీలో పీ.హెచ్.డీ పట్టా అందుకున్నారు. అమెరికాలోని ప్రఖ్యాత స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఇన్ఫర్మాటిక్స్ సర్టిఫికేషన్ మరియు యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుంచి క్లినికల్ ట్రయల్స్ మానేజ్మెంట్ సర్టిఫికేషన్ పొందారు.. అంత ఉన్నత చదువులు చదివిన ఉమా గారు తల్లిదండ్రులు నేర్పిన సేవను మాత్రం ఎప్పుడూ వదులుకోలేదు. అందుకే తన దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా సమాజంలోని మహిళల సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. 2021లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘ఉమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్’గా ఎన్నికై ఎంతో మందికి సేవ చేశారు. మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి తన సేవా తత్పరతను నిరూపించుకున్నారు.

చైతన్య స్రవంతి కార్యక్రమంలో డా. ఉమా గారు

అమెరికాలో సంస్కృతి, పరువు, సమాజం వంటి పలు కారణాల రీత్యా ఎవరికి చెప్పుకోలేక మగ్గుతున్న ఎంతోమంది మహిళలను గురించి డా. ఉమా గారు గోప్యత పాటిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. బయటకు చెప్పుకోలేని.. గృహహింసతో బాధపడుతున్న ఎంతో మంది మహిళలకు తానా విమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ గా డా. ఉమా గారు అండగా నిలిచారు. ప్రతీవారం 2 నుంచి 3 వరకూ పరిష్కరిస్తూ డా. ఉమా గారు మహిళల కోసం ముందుండి నడిచారు. గత రెండుమూడేళ్లుగా పలువురిని కూడగట్టుకొని మరీ అవగాహన కల్పిస్తూ తానా తరుఫున ఎన్నో సేవా కార్యక్రమాలను డా. ఉమా గారు నిర్వహించారు. అంతకుముందు APNRT కోఆర్డిన్టేటర్ గా.. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్ సంయుక్త కార్యదర్శిగా మరియు చికాగో ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలను ఉమాగారు నిర్వహించారు.

మహిళా సాధికారిత కింద 40 మంది మహిళలకు కుట్టు శిక్షణ, బ్యూటీషన్ కోర్సులో శిక్షణ ఇప్పించి సర్టిఫికెట్ అందజేసిన డా. ఉమా గారు

-ఉమా గారి సేవా కార్యక్రమాలు..

తానా విమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ గా ఎన్నో కార్యక్రమాలను డా. ఉమా గారు చేపట్టారు. ఆర్థిక స్వావలంబన సదస్సులు, ఆరోగ్య సదస్సులు.. అన్నదానం, యోగా సెషన్స్, ఉమెన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, మహిళా త్రోబాల్ టోర్నమెంట్, ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరాలు, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ కార్యక్రమాలు, క్యాన్సర్ అవగాహన సదస్సులు వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే.. తానాలో మహిళా అభ్యున్నతి కోసం సేవలో నేను సైతం అంటూ ఉమా గారు అందరికంటే ముందున్నారు.

మహిళా దినోత్సవం సందర్భంగా పేరెన్నికగన్న మహిళలకు సన్మానం చేస్తోన్న డా. ఉమా గారు

-గత జనవరిలో ముగిసిన తానా చైతన్య స్రవంతి కార్యక్రమాల కోసం సైతం ఇండియా వెళ్లి తనవంతుగా ఎంతో మందికి సహాయం చేశారు. తన తల్లిదండ్రుల పేరు మీద అనాథ బాలబాలికలకు స్కాలర్ షిప్స్ ద్వారా ఆర్థిక సాయాన్ని స్వయంగా అందజేసి ఉదారత చాటుకున్నారు.

షికాగోలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లీడర్స్ ను సన్మానించిన డా. ఉమా గారు

-మహిళా సాధికారతలో భాగంగా దాదాపు 40 మందికి పైగా మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు డా. ఉమా గారు సాయం చేశారు. మహిళలు తమ కాళ్లమీద తాము నిలబడేలా నైపుణ్య శిక్షణను ఇప్పించి వారికి కుట్టు మిషన్లు అందజేశారు.

మొట్టమొదటిసారిగా అమెరికాలో ఇల్లినాయిస్, ఇండియానాలో తానా ఉచిత కంటి వైద్య శిబిరంలో డా. ఉమా గారు..

-ఇటీవల తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ‘తానా ఫౌండేషన్ మరియు లీడ్ ద పాత్ ఫౌండేషన్ ద్వారా జానపద కళాకారుల కుటుంబాలకు డా. ఉమాగారు అండగా నిలిచారు. వారికి ఆర్థిక సాయం చేశారు. విజయవాడలోని అమ్మ ప్రేమ ఆదరణ ఓల్డేజ్ హోంలో అన్నదానం నిర్వహించారు.

– తానాలో ఉమెన్ సర్వీస్ కోఆర్డినేటర్ గా విస్తృత సేవలు
తానాలో ఉమెన్ సర్వీస్ కోఆర్డినేటర్ గా మహిళల తరుఫున బలంగా నిలబడుతూ ఉమాగారు ఎంతో పాటు పడ్డారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ముందుండి ఆదుకున్నారు. తానా ద్వారా సాయమందించారు. ‘ఎడ్యుకేట్.. ఎంకేరేజ్.. ఎంపవర్’ అనే మూడు థీమ్స్ తో ఉమాగారు అమెరికాలో, ఇండియాలో సేవలందించాలని నిర్ణయించారు. బాలికలు, యువత, మహిళలకు నైతికంగా, ఆర్థికంగా.. స్వావలంబన దిశగా ఈ మూడు కార్యక్రమాలు రూపొందించి ఉమా గారు అమలు చేశారు. 2020 కోవిడ్ టైంలో డబ్ల్యూ.టీ.సీఎఫ్ లాంటి పెద్ద ఈవెంట్ ను తానాలో విజయవంతంగా నిర్వహించడంలో ఉమాగారు కీలక ఆర్గనైజర్ గా వ్యవహరించారు.

– ఉమా గారు ఈ క్రింది కార్యక్రమాలను అతి తక్కువ కాలంలో విజయవంతంగా నిర్వహించి సత్తా చాటారు..

  • 2023లో విజయవాడలో ఒక అన్నదాన కార్యక్రమం మరియు జానపద కళాకారులకు ఆర్థికసాయం చేశారు

12-19-2022న- కేఎల్ యూనివర్సిటీ, విజయవాడలో ఆమె తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అనాథ పిల్లలకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు.
12-15-2022న -మీర్‌పేట్‌లో మహిళా సాధికారత కార్యక్రమం, 40 మంది మహిళలకు హైదరాబాద్ లో శిక్షణ ఇవ్వబడింది
10-27-22న క్యాన్సర్ మరియు జీవనశైలి మార్పులు పై అవగాహన కల్పించారు.
9-24-22-ఫీడ్ మై స్టర్వింగ్ చిల్డ్రన్‌లో అతిపెద్ద స్వచ్ఛంద కార్యక్రమం
9-18-22- మెర్రిల్‌విల్లే, ఇండియానాలో ఉచిత కంటి స్క్రీనింగ్ క్యాంప్.
9-3-22& 9-4-22 -తానా నేషనల్ ఉమెన్స్ త్రోబాల్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీలో భాగమయ్యారు
8-20-22– గృహ హింస కేంద్రం మరియు హస్డ్ హౌస్‌కి ఫుడ్ డ్రైవ్.
6-18-22- ఇల్లినాయిస్‌లోని బోలింగ్‌బ్రూక్‌లో ఉచిత కంటి పరీక్ష శిబిరం.
5-22-22- “అమ్మా నాన్న సంబరాలు” పేరిట మదర్స్ డే మరియు ఫాదర్స్ డే వేడుకలు.
3-6-22 -అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా USA & భారతదేశానికి చెందిన ప్రముఖ మహిళలతో జూమ్ సెషన్‌ను నిర్వహించింది.
3-12-22- నేపర్‌విల్లేలో ఉమెన్స్ డే గాలా ఈవెంట్
1-23-22- యోగా సెషన్ “సుషుమ్నా క్రియా యోగా” నిర్వహించారు.
1-25-22- శ్రీమతి అరుణా మిల్లర్ మరియు శ్రీమతి పద్మా కుప్పాతో “రాజకీయాల్లోకి ఒక ప్రయాణం” సెషన్ నిర్వహించారు.
12-15-21 – వ్యక్తిగత ఆర్థిక సెషన్ “ఇటీవల మీ ఆర్థిక వ్యవస్థ ఉందా?”
11-19-21- నేటి హైస్కూల్ విద్యార్థులలో “కరోనా అంటువ్యాధి”పై హెల్త్ సెషన్.
11-14-21 – “ఆరోగ్యకరమైన జీవనం”పై ఆరోగ్య సెషన్
10-6-21 – మదర్ థెరిస్సా వృద్ధాశ్రమం, రాయనపాడు, & ఆదరణ వృద్ధాశ్రమం, వణుకూరు, ఇండియాలో రెండు అన్నదానాలను నిర్వహించారు.
10-3-21- “గుండె జబ్బులు మరియు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌లు, భారతీయులపై దృష్టి” అనే అంశంపై ఆరోగ్య సెషన్
10-16-21-హెల్త్ సెషన్ “ఊబకాయం &మహిళల ఆరోగ్యం కోసం యోగా చికిత్స”.
10-9-21-“హైపర్‌టెన్షన్ & డిప్రెషన్ కోసం యోగా థెరపీ”పై హెల్త్ సెషన్.
10-2-21 – “నిద్రలేమికి యోగా థెరపీ”పై హెల్త్ సెషన్.
9-25-21- “యోగా థెరపీ ఆన్ మెంటల్ టెన్షన్ & ఆస్తమా”పై హెల్త్ సెషన్.
9-18-21 “యోగా థెరపీ ఫర్ స్పాండిలైటిస్ & సయాటికా”పై హెల్త్ సెషన్.
9-11-21 “మైగ్రేన్లు & తలనొప్పులపై యోగా థెరపీ”పై ఆరోగ్య సెషన్.
3-21-21 భారతదేశంలోని నెల్లూరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పంపిణీ చేయడానికి ప్రాయోజిత మహిళా పరిశుభ్రత ఉత్పత్తులు.
మే 2020లో – భారతదేశంలోని విజయవాడలో తానా ఫౌండేషన్ ద్వారా ప్రాయోజిత అన్నదానం డ్రైవ్
సెప్టెంబర్-2020-భారతదేశంలోని విజయవాడలో తానా ఫౌండేషన్ ద్వారా స్పాన్సర్డ్ అన్నదానం డ్రైవ్.. చికాగోలో తానా ఫుడ్ డ్రైవ్ యొక్క ప్రధాన నిర్వాహకులలో ఒకరు
సెప్టెంబరు-2020లో- మాస్క్ పంపిణీ టీ అరోరా పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు బాలాజీ టెంపుల్, అరోరా, ఐఎల్ నిర్వాహకులలో ఒకరు
సెప్టెంబర్ -2019 -భారతదేశంలోని ప్రకాశం స్వర్ణలో జడ్పీ ఉన్నత పాఠశాల కోసం వేదిక మరియు సైకిల్ స్టాండ్ నిర్మాణం స్పాన్సర్ చేశారు..

-చికాగో ఆంధ్రా అసోసియేషన్‌లో ఉమాగారి అధ్యక్షతన ఈ క్రింది కార్యక్రమాలను నిర్వహించారు

సెప్టెంబర్-2018- ‘మహిళల గాలా’ నిర్వహించారు
ఆగస్టు-2018 -భారత స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్నారు
జూలై-2018- 600 కంటే ఎక్కువ మంది వ్యక్తులతో పిక్నిక్ నిర్వహించారు.
మే-2018 -వృద్ధుల కోసం సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు.
మార్చి-2018 సీఏఏ సాంస్కృతిక కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది
ఫిబ్రవరి-2018 -వ్యవస్థీకృత యోగా పని నిర్వహించారు.

తానా కార్యక్రమంలో మహిళలతో డా. ఉమా గారు

-డా. ఉమా గారికి తోడుగా అమెరికాలోని తెలుగు వారు..

సేవ చేస్తే ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకుంటారు. తమకు సేవ చేసిన వారికి అండగా నిలుస్తారు. ఇప్పుడు డా. ఉమా గారికి అందుకే తానా ఎన్నికల్లో ప్రజాదరణ పెల్లుబుకుతోంది. ఇవన్నీ చూసినా.. తెలిసిన తానా సభ్యులు డా.ఉమా గారి గెలుపు కోసం స్వయంగా ప్రచారం చేస్తున్నారు. పలువురు వీడియోలు విడుదల చేసి మరీ మద్దతు తెలుపుతున్నారు.

2023లో షికాగోలో మహిళా దినోత్సవం సందర్భంగా బోలింగ్ గ్రూప్ మేయర్, ఇండియన్ కౌన్సిలర్ జనరల్ భార్యతో డా. ఉమా గారు…

2021 తానా ఎన్నికల్లో ఉమా గారు ఏం చెప్పారో అంతకు మించి చేసి చూపించారు. తానా విమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ గా ఎన్నికై వందకు 100 శాతానికి పైగా తన హామీలు నెరవేర్చారు. సేవలో పునరంకితం అయ్యారు. తోటి మహిళలకు మార్గదర్శిగా నిలిచారు. అందుకే డా. ఉమా గారు పోటీచేస్తున్నారంటే వారంతా స్వయంగా మద్దతు తెలుపుతూ గెలుపు కోసం కృషి చేస్తున్నారు.

మహిళా సాధికారితలో భాగంగా హైదరాబాద్ మీర్ పేటలో ప్రసంగిస్తున్న డా. ఉమా గారు

సేవ తప్ప మరే ఇతర అనవసర విషయాల్లో డా. ఉమా గారు తలదూర్చారు. సేవ కోసమే అంకితమవుతారు. ఆ ఉదార స్వభావమే ఆమెను ఎన్నికల్లో విలక్షణంగా నిలిపింది. రాజకీయాలకు దూరంగా.. కేవలం ఆదుకోవడమే ధ్యేయంగా ఆమె ముందుకు కదులుతున్నారు.. వేరే విషయాల్లో తలదూర్చడం లేదు.. అందుకే డా. ఉమా గారి గెలుపు అంత ఈజీ అవుతోంది. ఆమె మరోసారి తానా ఎన్నికల్లో గెలిచి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి సమాజానికి మరెన్నో సేవలు చేయాలని ఎంతో మంది అమెరికాలోని తెలుగు వారు కోరుకుంటున్నారు.

అందుకే మీరు కూడా తానా ఎన్నికల్లో (TANA Elections) లో ‘సాంస్కృతిక సమన్వయకర్త’గా పోటీచేస్తోన్న డా. ఉమా .ఆర్. కటికి (ఆరమండ్ల) (Dr. Uma .R. Katiki (Aramandla) ) గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. అందరి మద్దతుతో ఆమె మరిన్ని సేవ చేసేందుకు మీ మద్దతు కోరుతున్నారు..

డా. ఉమా గారు ‘టీం కొడాలి ప్యానెల్ నుండి పోటీలో ఉన్నారు. ఆమెకు టీం కొడాలిలో ఉన్న ప్రతీ ఒక్కరికి ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన

ఓట్ ఫర్ టీం కొడాలి.. ఓట్ ఫర్ డా. ఉమా

Please Vote For Dr. Uma..