Bigg Boss 7 Telugu : ఇది రైతుబిడ్డ రేంజ్.. ప్రశాంత్ తో పోటీపడలేక డాక్టర్ బాబు ఏం చేశాడో చూడండి!

కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచేందుకు బిగ్ బాస్ నిర్వహిస్తున్న టాస్కుల్లో గెలవాల్సి ఉంటుంది. కెప్టెన్సీ రేస్ లో భాగంగా తాజా ప్రోమో లో 'జంపింగ్ జపాంగ్ ' అని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

Written By: NARESH, Updated On : November 1, 2023 8:23 pm
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 తొమ్మిదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ ని రెండు టీమ్స్ గా విభజించారు. కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచేందుకు బిగ్ బాస్ నిర్వహిస్తున్న టాస్కుల్లో గెలవాల్సి ఉంటుంది. కెప్టెన్సీ రేస్ లో భాగంగా తాజా ప్రోమో లో ‘జంపింగ్ జపాంగ్ ‘ అని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో కంటెస్టెంట్స్ వారి అపోనెంట్ టీం పై గెలిచేందుకు వీలైనన్ని ఎక్కువ బెలూన్స్ ఊది .. అక్కడున్న టైర్స్ లో ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఏ టీం కలర్ బెలూన్ ని ఆ టీం సభ్యులు ఊది టైర్స్ లో ఫిట్ చేయాలి.

ప్రియాంక ఈ టాస్క్ కి సంచాలక్ గా వ్యవహరించింది. బజర్ మోగడం తో టాస్క్ మొదలైంది. ఇందులో తేజ,పల్లవి ప్రశాంత్ బెలూన్స్ ఊదారు. యావర్ ఇంకా అర్జున్ వాటిని ఫిట్ చేశారు. ఇక టాస్క్ మధ్యలో సంచాలక్ ప్రియాంక అందరి మీద అరిచింది. తర్వాత యావర్ బెలూన్స్ తీస్తుంటే.. తీసి పెట్టడం కౌంట్ లోకి రాదు అని ప్రియాంక చెప్పింది. టాస్క్ పూర్తయ్యే సమయానికి ఆరంజ్ కలర్ టీం ఎక్కువ బెలూన్స్ ని ఫిట్ చేశారు.

దాంతో టాస్క్ లో గెలిచిన టీం కి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు బిగ్ బాస్. పోస్ట్ ద్వారా ఆరంజ్ టీం కి ఒక లెటర్ పంపారు.ఆ లెటర్ లో ‘మొదటి పవర్ బాక్స్ మీకు లభిస్తున్న పవర్.. మీ అపోజిట్ టీం లో నుంచి ఒకరిని తీసేయడం .. వారు ఎల్లప్పుడూ డెడ్ బోర్డు వేసుకుని ఉండాల్సి ఉంటుంది అని లెటర్ లో వుంది. ఇక ఆరంజ్ టీం సభ్యులు కాసేపు చర్చించుకున్నారు. ప్రశాంత్ ని తీసేద్దాం అనుకుంటున్నాం అని గౌతమ్ చెప్పాడు.

దాంతో ప్రశాంత్ చాలా బాధ పడ్డాడు. వాడ్ని కాదు రా .. దమ్ముంటే నన్ను తియ్యాల్సిందిరా అని శివాజీ సవాల్ విసిరాడు. ఇక అమర్,అశ్విని ప్రశాంత్ ని ఓదార్చారు. ప్రశాంత్ మాత్రం ఏడుపు ఆపలేదు. ఇక డెడ్ బోర్డు తెచ్చి ప్రశాంత్ మెడలో వేసి అతన్ని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించాడు గౌతమ్. దాంతో శివాజీ ‘దీన్ని చూసి ఇంకా కసి పెంచుకుని బాగా ఆడు’… పుష్ప డెడ్ అనుకున్నారు అందరూ … కానీ పుష్ప 2 రాలేదా… అంటూ డైలాగులు వేస్తూ ప్రశాంత్ కి ధైర్యం చెప్పాడు.