Bigg Boss 7 Telugu Voice: బిగ్ బాస్…కనిపించని ఆ వ్యక్తి వెనక.. వినిపించే వాయిస్ ఎవరిదో తెలుసా..?

మనిషి కనిపించకపోయినా ఆ వాయిస్ వింటే చాలు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా అలర్ట్ అయిపోతారు. ఆ వాయిస్ లో ఉన్న పవర్ ఏమిటో కానీ…సూపర్ ఉంటుంది అనుకోని బిగ్ బాస్ ఫ్యాన్ ఉండరనే చెప్పాలి.

Written By: Vadde, Updated On : September 14, 2023 12:49 pm

Bigg Boss 7 Telugu Voice

Follow us on

Bigg Boss 7 Telugu Voice: తెలుగులో అతి పెద్ద రియాలిటీ షో ఏది అంటే వెంటనే అందరికీ గుర్తుకు వచ్చే పేరు బిగ్ బాస్. ఇప్పటికీ 6 సీజన్ లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 7 వ సీజన్ నడుస్తోంది. నిన్న మొన్న మొదలైనట్టు ఉన్న అప్పుడే ఒక ఎలిమినేషన్ పూర్తయిపోయి రెండో ఎలిమినేషన్ కి నామినేషన్లు కూడా జరిగాయి. ఆద్యంతం ఆసక్తిగా సాగే ఈ షోలో అందరినీ ఆకట్టుకునేది బిగ్ బాస్ గొంతు.

మనిషి కనిపించకపోయినా ఆ వాయిస్ వింటే చాలు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా అలర్ట్ అయిపోతారు. ఆ వాయిస్ లో ఉన్న పవర్ ఏమిటో కానీ…సూపర్ ఉంటుంది అనుకోని బిగ్ బాస్ ఫ్యాన్ ఉండరనే చెప్పాలి. హౌస్ లో కంటెస్టెంట్స్ ని మెయింటైన్ చేస్తూ…బిగ్ బాస్ అనే కనిపించని ఒక వ్యక్తికి శక్తిని ఇచ్చేది మనం ఆ షోలో వినే వాయిస్ …అనడంలో ఎటువంటి సందేహం లేదు.

మరి ఇంతకీ ఆ వాయిస్ ఎవరిదా…? అని మీకు డౌట్ వచ్చే ఉండాలి…అయితే పదండి ఈరోజు ఆ వాయిస్ వెనక ఉన్న పర్సన్ ఎవరో మీకు రివిల్ చేస్తాను. బిగ్ బాస్ రియాలిటీ షో మొదట హిందీలో ప్రారంభమైంది.. ఆ తర్వాత క్రమంగా అన్ని భాషలకు విస్తరిస్తూ 2017లో తెలుగులో స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఆరు టెలివిజన్, ఒక ఓటీటీ సీజన్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు తెలుగులో 7వ సీజన్లో అడుగుపెట్టింది.

బిగ్ బాస్…అంటే మనకు కేవలం షోలో వినే వాయిసే గుర్తుకు వస్తుంది. ఆ వాయిస్ కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి…బిగ్ బాస్ లో వచ్చే ఆ వాయిస్ ని ఇమిటేట్ చేయడం కోసం ఇప్పటికే ఎంతోమంది ట్రై చేశారు. సీజన్లు ఎన్ని వచ్చినా .. కంటెస్టెంట్స్ అందరూ మారినా…బిగ్ బాస్ వాయిస్ మాత్రం మారదు. ఎంతో గంభీరంగా ..హౌస్ కంటెస్టెంట్ ని సులభంగా తన మాట వినేలా చేసుకుని ఈ బిగ్ బాస్ వాయిస్ వెనక ఉన్న వ్యక్తి అసలు పేరు రాధాకృష్ణ అలియాస్ రేనుకుంట్ల శంకర్.

శంకర్ ఒక సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. బిగ్ బాస్ షోలో చేయడానికి ముందు అతను ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పాడు. అంతేకాదు పలు సీరియల్స్, అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా అతని గాత్రం వినవచ్చు. సీనియారిటీ ఉన్నప్పటికీ బిగ్ బాస్ షో కోసం అతను అంత ఈజీగా సెలెక్ట్ కాలేదు. వందమంది డబ్బింగ్ ఆర్టిస్టులను నిర్వాహకులు పరీక్షించినప్పుడు ఫైనల్ గా అందరిలో శంకర్ గొంతు నచ్చిందట. ముఖ్యంగా అతని మాట తీరులో ఉన్న గాంబీర్యమే అతనికి ఈ షో తెచ్చి పెట్టింది.

మీరు బిగ్ బాస్ షోను మొదటి నుంచి ఫాలో అవుతున్నట్లు అయితే మొదటి మూడు నాలుగు సీజన్ల వరకు శంకర్ మాట్లాడిన తీరు ఆ తరువాత అతను మార్చిన మాడ్యులేషన్ గమనించగలుగుతారు. షో స్టార్టింగ్ కంటే కూడా శంకర్ తన మాడ్యులేషన్ మార్చుకున్న తరువాత అతని గాత్రం మరింత గంభీరంగా మారింది. ప్రస్తుతం శంకర్ తన గాత్రానికి రికగ్నిషన్ ఉంది అని తెలుసుకొని ఆనందిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.