ఆకులలో తమలపాకులు ఎంతో శ్రేష్ఠమైనవి.అటు ఆరోగ్య పరంగాను, ఇటు ఆధ్యాత్మికంగాను ఈ తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. ఈ తమలపాకులలో సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుందని భావిస్తారు. మనం చేసే ఎటువంటి కార్యక్రమంలోనైనా తమలపాకులు తప్పనిసరిగా ఉంటాయి. అయితే ఈ తమలపాకులను ఏ రాశి వారు ఏ రోజున ఏ దేవునికి పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇక్కడ తెలుసుకుందాం…

మేషం:మేష రాశి వారు సుబ్రమణ్యేశ్వర స్వామికి ఇష్టమైన మంగళవారం రోజున తమలపాకులతో స్వామివారిని పూజించి మామిడి పండును తమలపాకులు పై ఉంచి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి.
వృషభం: వృషభ రాశి వారి జాతక రీత్యా రాహుగ్రహానికి తమలపాకులను,అందులో తొమ్మిది నల్ల మిరియాలను దేవుడికి సమర్పించాలి.
మిధునం: మిధున రాశి వారు తమ ఇంటి దైవానికి రెండు తమలపాకులు రెండు అరటి పండ్లను సమర్పించడం ద్వారా కష్టాలు తొలగిపోతాయి.
కర్కాటకం: కర్కాటక రాశి వారు శుక్రవారం కాళీ మాత కు తమలపాకులను, దానిమ్మ పండ్లను సమర్పించి పూజించాలి.
సింహం: సింహ రాశి వారు గురువారం తమ ఇష్టదైవానికి రెండు తమలపాకులు, అరటి పండ్లను సమర్పించి పూజించాలి.
కన్య:ఈ రాశి వారు గురువారం తమ ఇష్టదైవానికి రెండు తమలపాకులను సమర్పించి వాటిలో 27 నల్ల మిరియాలను ఉంచి పూజించాలి.
తుల: తులా రాశి వారు శుక్రవారం ఇంటి దైవానికి రెండు తమలపాకులను, రెండు లవంగాలను సమర్పించాలి.
వృశ్చికం: ఈ రాశి వారు మంగళవారం దుర్గామాతకు రెండు తమలపాకులను,రెండు ఖర్జూరాలను సమర్పించి పూజ చేయాలి.
ధనస్సు: ఈ రాశి వారు గురువారం కుమారస్వామికి రెండు తమలపాకులను కొద్ది పరిమాణంలో కలకండ సమర్పించి పూజించాలి.
మకరం: ఏ రాశి వారు శనివారం కాళికామాత తమలపాకులను, బెల్లం సమర్పించి పూజించాలి.
కుంభం: ఈ రాశివారు కూడా శనివారం కాళికామాతకు తమలపాకులను, నెయ్యిని సమర్పించి పూజించాలి.
మీనం: మీన రాశి వారు తమ ఇష్టదైవానికి తమలపాకులను వాటిలో కొద్దిగా చక్కెరను ఉంచి పూజించాలి.