Indentured Labour : 19 దేశాలకు వలస వెళ్లిన భారతీయ ‘కూలీ కార్మికుల’ గురించి తెలుసుకుందామా?

19 దేశాలకు వలస వెళ్లిన భారతీయ 'కూలీ కార్మికుల' గురించి తెలుసుకుందామా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : January 2, 2024 3:42 pm

Indentured Labour : ఈరోజు మనం ప్రవాస భారతీయుల కూలీ కార్మికుల దీనగాథను గురించి తెలుసుకుందాం. ఎందుకంటే అమెరికాకు వలసవెళ్లిన.. తీసుకెళ్లిన ఆఫ్రికా బానిసల గురించి పుంఖానుపుంకాలుగా వింటుంటాం.. అప్పటి చరిత్రపై అమెరికా మ్యూజియంలలో చరిత్రను వివరిస్తున్నారు.

దానికి ఏమాత్రం తీసిపోని భారతీయ వలస కార్మికుల కష్టాల గురించి ఎవ్వరూ అమెరికాలో పట్టించుకోరు. భారత్-పాకిస్తాన్ విభజన సమయంలో ఎన్నో లక్షల మంది చనిపోయినా పట్టించుకోలేదు. చరిత్రలోకి ఎక్కదు.

అమెరికాలో భారతీయుల వలసల బాధా అంతా ఇంతాకాదు. బానిసగా చూశారు. 1833లో బ్రిటన్ ఈ వ్యతిరేతతో బానిసత్వాన్ని నిషేధించింది. ఆ తర్వాత ఫ్రాన్స్, డచ్, 1865లో అమెరికాలో సివిల్ వార్ తో బానిసత్వాన్ని నిషేధించింది. బానిసత్వాన్ని నిషేధించి అప్రెంటీస్ విధానాన్ని తీసుకొచ్చారు. ‘ఒప్పంద కార్మికులు’, లేదా కూలీ కార్మికుల విధానాన్ని తీసుకొచ్చారు. ఐదేళ్లు ఒప్పందంతో వివిధ దేశాల కార్మికులను తీసుకెళుతారు. తీసుకెళ్లిన కార్మికులు భారతీయులే..

19 దేశాలకు వలస వెళ్లిన భారతీయ ‘కూలీ కార్మికుల’ గురించి తెలుసుకుందామా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.