Tollywood: హీరోలు విలన్ లా ప్రవర్తించిన సినిమాలు ఏవో తెలుసా?

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ హీరోయిన్ వెనుక పడిన విధానం చాలా కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. హీరో ప్రేమ హీరోయిన్ ను ఇబ్బంది పెట్టేలా ఉంటుంది.

Written By: Velishala Suresh, Updated On : December 15, 2023 2:22 pm

Tollywood

Follow us on

Tollywood: ఈ మధ్య వచ్చే చాలా సినిమాల్లో హీరోలు విలన్ లా ప్రవర్తిస్తున్నారు. విలన్ కనుక అలాంటి పాత్రను పోషిస్తే తిడుతారు. కానీ హీరో చేశారు కాబట్టి విజిల్స్, చప్పట్లు వస్తున్నాయి. ఈ మధ్య హీరో ఏది చేసినా కూడా గ్రేట్ అంటున్నారు. దొంగతనం, స్మగ్లింగ్ వంటివి కూడా చేసేస్తున్నారు హీరోలు. ఇంతకీ ఈ మధ్య వచ్చిన సినిమాలో ఇలాంటి సినిమాలో ఏంటో ఓ సారి చూసేద్దామా..

పుష్ప.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ హీరోయిన్ వెనుక పడిన విధానం చాలా కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. హీరో ప్రేమ హీరోయిన్ ను ఇబ్బంది పెట్టేలా ఉంటుంది. అంతేకాదు ఇందులో అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేస్తారు కూడా. అయితే ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కాస్త ప్రేమ సన్నివేశాలు ఇంకా కాస్త బెటర్ గా రాసి ఉంటే బాగుండు అని అంటారు కొందరు.

ఇస్మార్ట్ శంకర్.. ఈ సినిమాలో రామ్ పోతినేని నటన నెక్స్ట్ లెవల్. కానీ ఇందులోని ప్రేమ సన్నివేశాలు కూడా ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. హీరోయిన్ ను హీరో బూతులు తిడుతారు. రౌడీలా బిహేవియర్ ఉంటుందనేది కాదనలేని వాస్తవం. దీంతో ఈ సినిమాలోని ప్రేమ కూడా స్మూత్ గా లేదనే కామెంట్లు వచ్చాయి క్లాసికల్ ప్రేక్షకుల నుంచి..

అర్జున్ రెడ్డి.. విజయ్ దేవరకొండ టాపిక్ లేని లిస్ట్ ఉండదనే చెప్పుకోవాలి. ఇక ఈ లిస్ట్ లోకి అర్జున్ రెడ్డి సినిమా వస్తుంది. ఇందులో అర్జున్ రెడ్డి ప్రీతిని ఏ విధంగా లవ్ చేస్తాడో తెలిసిందే. ఆ లవ్ ప్రేక్షకులను చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. అంతేకాదు నిజ జీవితంలో ఎవరైనా ఇలా లవ్ చేస్తే ఏ అమ్మాయి కూడా ఒప్పుకోదు.

నేను లోకల్.. ఒక అమ్మాయి ప్రేమ కోసం తండ్రిన ఒప్పించి కెరీర్ కోసం అమ్మాయితో జీవితం బాగుండాలని కష్ట పడి పోలీస్ ఉద్యోగంతో తిరిగి వచ్చిన వ్యక్తి విలన్ అయితే హీరోయిన్ ను ఇబ్బంది పెట్టి చివరకు తన ప్రేమలో పడేలా చేసిన వ్యక్తి హీరో అయ్యాడు.

సర్కారు వారి పాట.. ఈ సినిమాలో హీరో ఏకంగా హీరోయిన్ ను కొడుతాడు. హీరో ఫ్రెండ్ ను హీరోయిన్ ను కొట్టడంతో హీరో కూడా అదే విధంగా కొడుతాడు. ఇది ఒక వరకు బాగున్నా.. హీరోయిన్ ను రోజు ఇంటికి పిలిచి, కాలు వేసి పడుకోవడం వంటి సీన్స్ చూస్తే దీన్ని ప్రేమంటారా? హీరోయిజం అంటారా? అనే ప్రశ్న కొందరిలో మొదలవుతుంది. ఇవన్నీ చూసి హీరోయిన్ ప్రేమలో పడడం ఆశ్యర్యం లాగా అనిపిస్తుంది.