
చాలా సందర్భాల్లో వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పై సరైన అవగాహన లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. గతంలో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు బైక్ ఆపితే తప్పనిసరిగా ఫిజికల్ డాక్యుమెంట్లను చూపించాల్సి వచ్చేది. అయితే కాలం మారింది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. వాహనదారులు డిజి లాకర్ లాంటి యాప్ లలో వాహనానికి సంబంధించిన పత్రాలను సేవ్ చేసుకుని చూపిస్తున్నారు.
Also Read : లాక్డౌన్ నష్టాలను పూడ్చుకుంటున్న రామోజీరావు?
సాఫ్ట్ కాపీల సహాయంతో వాహనదారులకు పని సులువైంది. అయితే సాఫ్ట్ కాపీలు చూపిస్తే కొందరు ట్రాఫిక్ పోలీసులు అంగీకరిస్తున్నా కొందరు మాత్రం తప్పనిసరిగా ఫిజికల్ గా డాక్యుమెంట్లు చూపించాలని కోరుతున్నారు. దీంతో కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మోటార్ వాహనాల చట్టం – 1989లో కీలక మార్పులు చేసింది. రవాణా శాఖ చేసిన మార్పుల వల్ల వాహనదారులకు ప్రయోజనం కలగనుంది.
అక్టోబర్ ఒకటి నుంచి అమలులోకి రాబోయె నూతన నిబంధనల ప్రకారం వాహనదారుడు సాఫ్ట్ కాపీస్ కలిగి ఉంటే ఫిజికల్ డాక్యుమెంట్స్ ను చూపించాల్సిన అవసరం లేదు. వాహనదారుడు నేరం చేసినా ట్రాఫిక్ అధికారికి డిజిటల్ డాక్యుమెంట్లు చూపిస్తే సరిపోతుంది. ఒకవేళ వాహనదారుడు పెద్దతప్పు చేస్తే మాత్రం టాఫిక్ అధికారి వాహనదారుడి లైసెన్స్ ను ఆన్ లైన్ లో రద్దు చేయవచ్చు.
ట్రాఫిక్ అధికారులు ఎక్కడైనా వాహనాన్ని ఆపి పత్రాలను తనిఖీ చేస్తే ఆ వివరాలను ఆన్ లైన్ లో తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇలా చేయడం వల్ల మరో ప్రాంతంలో ఆ వాహనాన్ని అధికారులు చెక్ చేయకుండానే పంపించవచ్చు. డిజి లాకర్ లేదా ఎం పరివాహన్ యాప్ ల ద్వారా వాహనదారులు డిజిటల్ డాక్యుమెంట్లను సేవ్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ సమయంలో నావిగేషన్ కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగించవచ్చు.
Also Read : తారల చీకటి బాగోతం: డ్రగ్స్ కేసులో వెలుగుచూస్తున్న సెక్స్ రాకెట్?