Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే డైరెక్టర్లకు వెన్నులో వణుకు పుట్టడానికి కారణం అదే!

హరిహర వీరమల్లు సినిమా కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిమీద ఇప్పటికీ కూడా సరైన క్లారిటీ అయితే రావడం లేదు...అందుకే పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా భయపడుతున్నారు...

Written By: Gopi, Updated On : January 8, 2024 9:46 am
Follow us on

Pawan Kalyan : అయితే ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ప్రతి డైరెక్టర్ కూడా చాలా ఉత్సాహాన్ని చూపించేవారు ఆయన తో సినిమా చేసే అవకాశం రావడమే అదృష్టం గా భావించేవారు.కానీ ఇప్పుడు ఈయనతో సినిమా చేయాలంటేనే అభిమానులు భయంతో వణికిపోతున్నారు కారణం ఏంటి అంటే..

పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే ఎప్పుడు షూట్ ఉంటుంది ఆ సినిమా ఎపుడు రిలీజ్ అవుతుందో ఎవ్వరికీ క్లారిటీ గా తెలీడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ తో గత 4 సంవత్సరాల క్రితమే డైరెక్టర్ క్రిష్ హరిహర వీరమల్లు అనే సినిమాని మొదలు పెట్టాడు. ఇక ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన ఒక గ్లిమ్స్ ని మాత్రమే వదిలారు. దానికి మించి ఈ సినిమా కి సంబందించిన మరే అప్డేట్ రాకపోవడం తో ఇపుడు ఈ సినిమా షూటింగ్ నడుస్తుందా లేదా ఆపేసరా అనే విషయాల మీద కూడా ఎలాంటి క్లారిటీ రావడం లేదు. అందువల్లే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే డైరెక్టర్లు కొంతవరకు భయపడుతున్నారనే చెప్పాలి. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజి సినిమాలు కూడా ఈ సంవత్సరం రిలీజ్ అవ్వాల్సి ఉంది.

కానీ కొద్ది రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున క్యాంపెనింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఒక ఆరు నెలల వరకు ఆయన సినిమా షూటింగ్ లకి బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.ఇక ఇలాంటి క్రమంలోనే హరీష్ శంకర్ రవితేజతో బాలీవుడ్ లో సక్సెస్ అయిన రైడ్ సినిమాని తెలుగు లో రీమేక్ చేస్తున్నాడు. ఈ ఆరు నెలల వ్యవధిలో ఆయన ఈ సినిమాని కంప్లీట్ చేసి మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో పాల్గొనబోతున్నట్టు గా తెలుస్తుంది. ఇక అలాగే ఓ జి సినిమాకి కూడా బ్రేక్ రావడం వల్ల తన తదుపరి ప్రాజెక్టు కు సంబంధించిన పనులను చూసుకోవడం లో సుజీత్ బిజీ గా ఉన్నట్టు గా తెలుస్తుంది.

కానీ డైరెక్టర్ క్రిష్ మాత్రం హరిహర వీరమల్లు సినిమా మీదనే నాలుగు సంవత్సరాల నుంచి కూర్చొని ఉన్నాడు. మరి ఇంకో స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడా లేదా అనే విషయాల్లో కూడా క్లారిటీ లేదు. హరిహర వీరమల్లు సినిమా కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిమీద ఇప్పటికీ కూడా సరైన క్లారిటీ అయితే రావడం లేదు…అందుకే పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా భయపడుతున్నారు…