Telangana Elections 2023 : రాజకీయ పార్టీలు 119లో ఒక్క సీటు సామాన్యులకు వదిలి పెట్ట లేవా?

బర్రెలక్క పోటీచేసే నియోజకవర్గం కూడా ఎవరికి తెలియదు. ఆమెపై పోటీ చేసే వారు ఎవరో కూడా తెలియదు. కానీ ఆమె గెలుపును కోరుకుంటున్నారు. ఏదో తెలియని తపన పడుతున్నారు.ఒక్క వారంలోనే పరిణామం చోటు చేసుకుంది.

Written By: NARESH, Updated On : November 28, 2023 2:29 pm

Telangana Elections 2023 : బర్రెలక్క గెలవాలి.. తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు ఇదే కోరుకుంటోంది. సామాన్యుల మనోగతం ఇదే ఇప్పుడు… రాజకీయాలకు అతీతంగా ఇంతగా బర్రెలక్క వైపు జనం మొగ్గారు.

బర్రెలక్క పోటీచేసే నియోజకవర్గం కూడా ఎవరికి తెలియదు. ఆమెపై పోటీ చేసే వారు ఎవరో కూడా తెలియదు. కానీ ఆమె గెలుపును కోరుకుంటున్నారు. ఏదో తెలియని తపన పడుతున్నారు.ఒక్క వారంలోనే పరిణామం చోటు చేసుకుంది.

ఈ వ్యవస్థ మీద కోపంతోనే జనం బర్రెలక్కకు సపోర్టు చేస్తున్నారు. పరీక్షలు రాస్తే ఫలితం రాలేదని వ్యవస్థ మీద కోపం ప్రదర్శిస్తున్నారు. బలిదానంతో తెలంగాణ తెచ్చుకుంటే ఫలితం రాని వ్యవస్థ మీద కోపం ప్రదర్శిస్తున్నారు. బంగారు తెలంగాణ అనుకుంటే బడబాగ్ని తెలంగాణగా మార్చారని పాలకులపై కోపంగా ఉన్నారు జనాలు. ఉద్యమాలతో తెలంగాణ తెచ్చుకున్నాం కానీ జీవితం మార్చలేకపోయామన్న వ్యవస్థపైన కోపంగా ఉన్నారు. ఉద్యోగాల కోసం ఇప్పటికీ కొట్లాడుతున్న నిరుద్యోగులకు వ్యవస్థ మీద కోపమే ‘బర్రెలక్క’కు మద్దతు పెరగడానికి కారణం.

దోపిడీ పాలకవర్గాలపై కొట్లాడితే ఆ దోపిడీ మారని వైనమే ఈ వ్యవస్థ మీద కోపానికి కారణం. ఇది సామాన్యుడి సగటు మనిషి ఆవేదన.. అదే బర్రెలక్క గెలవాలని జనం కోరుకుంటున్నారు. కర్నె శిరీష గెలవాలని ఎవరూ కోరుకోవడం లేదు. కానీ బర్రెలక్క లాంటి నిరుద్యోగ ఆవేదన గెలవాలని అందరూ అనుకుంటున్నారు.

రాజకీయ పార్టీలు 119లో ఒక్క సీటు సామాన్యులకు వదిలి పెట్టలేవా? బర్రెలక్క పోటీపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.