KCR Meeting: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత.. బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) ఎట్టకేలకు ఫామ్‌హౌస్ నుంచి బయటకు రాబోతున్నారు. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రచారం చేసినా.. ప్రభావం చూపలేదు. ఒక్క సీటు కూడా గెలిపించలేదు. అంతకుముందు బాత్‌రూంలో జారిపడి ఆరు నెలలు మంచానికే పరిమితమయ్యారు. రెండేళ్లు కాంగ్రెస్ సమయం ఇద్దామని కేసీఆర్ చెప్పారని.. ఇప్పుడు రెండేళ్లు పూర్తి కావడంతో బయటకు వస్తున్నాడన్న ప్రచారం కూడా జరుగుతోంది.
కీలక సమావేవం..
తెలంగాణ రాజకీయాల్లో భూకంపం సృష్టించినట్లుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్య నిర్ణయం ప్రకటించారు. దీర్ఘకాలం ఆరోగ్య సమస్యలతో ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీర్చుకున్న ఆయన ఇక సర్వత్ర ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు నాయకత్వం వహిస్తారు. ఈ ఆదివారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరయ్యే ఆయన, పార్టీ బలోపేతానికి కీలక చర్చలు నిర్వహిస్తారు. చాలా కాలం తర్వాత ఇలాంటి పెద్ద సమావేశానికి ఆయన రావడం ప్రత్యేకమే. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు పాల్గొంటారు. మొదట 19వ తేదీకి ప్లాన్ చేసినా, పార్లమెంటు సమావేశాల కారణంగా 21కి మార్చారు.
సాగునీటి ప్రాజెక్టులపై చర్చ..
సమావేశంలో ముఖ్య చర్చలకు సాగునీటి ప్రాజెక్టులు కేంద్రం. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలైన పోలవరం–నల్లమల సాగర్‌తోపాటు, బీఆర్‌ఎస్ హయాంలో ప్రారంభమైన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అజెండాలో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 45 ఖీMఇ కష్ణా నీటితో సర్దుకోవాలనే నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పార్టీ నేతలు 90 టీఎంసీ నీటి కోసం గట్టిగా పోరాడామని దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ అంశంపై ఉద్యమ కార్యాచరణను రూపొందించి ప్రకటించే అవకాశం ఉంది.
‘స్థానిక’ ఎన్నికలపై దిశానిర్దేశం..
రాష్ట్రంలో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం సమయాన్ని ఆలస్యం చేస్తోంది. దీనిపై కూడా చర్చలు జరిగి, పోరాట వ్యూహాలు ఖరారు చేస్తారు. కేసీఆర్ స్వయంగా నిరసనల్లో పాల్గొనేందుకు సిద్ధమని సమాచారం. అదే సమయంలో పార్టీ సభ్యత్వ నమోదు, నిర్మాణ బలోపేతంపై కూడా నిర్ణయాలు తీసుకుంటారు.
ఈ సమావేశం బీఆర్‌ఎస్‌కు కొత్త ఊపిరి పోస్తుందని, రాజకీయ ఉత్కంఠను పెంచుతుందని నిరీక్షణ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాలే లక్ష్యంగా ప్రణాళిక రూపొందిస్తారని సమాచారం.