Pawan Kalyan vs Jagan: విశాఖను పవన్ కళ్యాణ్ వదిలాడు.. వైసీపీ సర్కార్ పంతం నెగ్గింది. పవన్ జనాల్లోకి వెళ్లలేదు. వైసీపీ లోపాలను ఎత్తి చూపలేకపోయారు. కానీ విజయవాడ వచ్చి తొడకొట్టారు. యుద్ధం ఇప్పుడే ఆగలేదు.. ఇప్పుడే మొదలైందని సవాల్ చేశారు. మరింత బలంగా ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ను ఒంటరిని చేసి ఆడుకుంటున్న వైసీపీకి షాకిస్తూ బీజేపీ సపోర్టుగా నిలిచింది. సోమువీర్రాజు పవన్ ను కలిసి మద్దతిచ్చారు. ఇప్పటికే చంద్రబాబు ఫోన్ చేసి మరీ పవన్ కు ధైర్యం చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉత్తరాంధ్రలో సమస్యల పరిష్కారం దిశగా కదిలిన పవన్ కళ్యాణ్ సాధించేందేంటి? గర్జన పేరుతో వైసీపీ చేసిందేమిటీ? జనసేన, వైసీపీ ఫైట్ లో గెలిచిందెవరు? ఓడిందెవరు? అన్న దానిపై స్పెషల్ ఫోకస్.

ఏపీలో ఇప్పుడు రాజకీయం రంగు మారింది.. మొన్నటి విశాఖ ఎపిసోడ్ లో పవన్ పైచేయి సాధించారా..? లేకుంటే సీఎం జగన్ అనుకున్నది నెరవేర్చుకున్నారా? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చనీయాంశంగా మారింది. పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ విశాఖ గర్జన చేపట్టిన సంగతి తెలిసిందే. దాదాపు లక్ష మందితో గర్జిస్తామని ముందుగానే వైసీపీ నేతలు ప్రకటించారు. కానీ పది, పదిహేను వేల మందిని కూడా సమీకరించలేకపోయారు. అటు జనసేన జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. నేరుగా అధినేత పవన్ ఉత్తరాంధ్ర ప్రజల నుంచి వినతులు స్వీకరించే ఏర్పాట్లు చేసింది. అయితే మంత్రులు, వైసీపీ కీలక నేతలు వెళ్లేటప్పుడు, పవన్ వచ్చేటప్పుడు విశాఖ ఎయిర్ పోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జనసేనాని పవన్ కు స్వాగతం పలికేందుకు వేలాది మంది అభిమానులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే తమపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారంటూ మంత్రుల ఫిర్యాదు మేరకు జనసేన శ్రేణులపై పోలీసులు కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. ఇందులో జనసేనకు చెందిన వీర మహిళలు కూడా ఉన్నారు.
అటు పవన్ తాను బస చేసే హోటల్ నుంచి బయటకు రాకుండా పోలీసులు దిగ్బంధించారు. నిర్బంధం విధించారు. ఆంక్షలు పెట్టారు. జనవాణి కార్యక్రమానికి హాజరుకావడానికి వీలులేదని.. నెల రోజుల పాటు విశాఖలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని సూచిస్తూ నోటీసులు జారీచేశారు. నగరాన్ని విడిచిపెట్టాలని ఆదేశాలు జారీచేశారు. అయితే ఈ పరిణామాలపై అధికార పార్టీ ఆనందపడుతోంది. తాము అనుకున్నది సాధించామని అహంకారపూరిత స్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారు. అయితే ఈ విషయంలో వైసీపీ ఊహించిన స్థాయిలో మాత్రం పవన్ రియాక్టు కాలేదు. రియాక్టు అయితే జరిగే పరిణామాలు పవన్ కు తెలుసు కనుకే తన ఆవేశాన్ని, భావోద్వేగాన్ని తన అదుపులో ఉంచుకున్నారు.
వాస్తవానికి పవన్ ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారాన్ని కల్పించారు. అదే జరిగితే జనసేన అభిమానులు రియాక్టు అవుతారని భావించారు. విధ్వంసాలకు దిగుతారని ఆశించారు. కానీ పవన్ చాలా కూల్ గా ఈ అంశాన్ని డీల్ చేశారు. అధికార పార్టీ కుయుక్తులను అంచనా వేసి ఎప్పటికప్పుడు స్టెప్ మార్చుతూ వచ్చారు. అటు పార్టీ నేతలతో జనవాణి కార్యక్రమాన్ని జరిపించారు. అటు వివిధ కారణాలతో చనిపోయిన జనసేన నేతల కుటుంబాలకు బీమా పరిహారం అందించారు. అటు పోలీసులతోనూ హుందాగా నడుచుకున్నారు. ఎక్కడా అధికార పార్టీ కవ్వింపులకు పవన్ తలొగ్గలేదు. పరిస్థితులు ముదిరిపోకుండా జాగ్రత్తపడ్డారు. తద్వారా అధికార పార్టీ ఎత్తుగడలకు చెక్ చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే విశాఖ టూర్ లో సంపూర్ణ విజయం సాధించారు.

విశాఖలో మూడు రోజుల పాటు పవన్ ను హోటల్ నుంచి బయటకు రాకుండా చేశామని అధికార పార్టీ భావిస్తున్నా…నిర్బంధాలతో ఆ పార్టీకే చేటు అని గత అనుభవాలు తెలియజేస్తున్నాయి. 1989 ఎపిసోడ్ లో వంగవీటి మోహన్ రంగా హత్య తరువాత రాష్ట్రం అట్టుడికింది. ఆ దెబ్బకు జరిగిన ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ ఓటమి చవిచూశారు. 1994లోనూ కూడా సేమ్ సీన్ కాపులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేద్దామనుకున్న కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వానికి మంచి గుణపాఠమే ఎదురైంది. అటు తరువాత 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా కాపు ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. ఫలితం అనుభవించారు. ఇప్పుడు జగన్ ఆలోచన సరళి కూడా అదే మాదిరిగా ఉంది. ఆయనకు కూడా గుణపాఠం తప్పదని జన సైనికులు, అభిమానులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికైతే విశాఖ ఎపిసోడల్ లో ఆపరేషన్ సక్సెస్..బట్ పెషెంట్ ఈజ్ డెడ్ అన్న పరిస్థితిలో వైసీపీ ఉందన్న మాట.