Dhootha Web Series Review: దూత సీరీస్ ఫుల్ రివ్యూ…

చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ దూత సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు అలరించింది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : December 3, 2023 11:18 am

Dhootha

Follow us on

Dhootha Web Series Review: ప్రస్తుతం ఇండస్ట్రీలో వైవిధ్యమైన సినిమాలకి డిమాండ్ పెరుగుతుంది.ఇక ఈ క్రమంలోనే చాలా సినిమాలు ప్రేక్షకుల్లో ఇంటెన్స్ ని క్రియేట్ చేస్తూ వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఇక వీటికి ఏమాత్రం తగ్గకుండా కొన్ని వెబ్ సీరీస్ లు మంచి కథాంశం తో వచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి.ఇక అలాంటి ఒక సబ్జెక్టుతో వచ్చిందే దూత… చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ దూత సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు అలరించింది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ముందుగా దూత కథ విషయానికి వస్తే సాగర్ వర్మ అనే ఒక వ్యక్తి అప్పుడే మొదలైన సమాచారం వార్త పత్రికలో చీఫ్ ఎడిటర్ గా పని చేస్తాడు. అతనికి సహాయకురాలిగా అమృత(ప్రాచి దేశాయ్) పనిచేస్తూ ఉంటుంది…అయితే ఒకరోజు ఆయన తన ఉద్యోగాన్ని ముగించుకుని అతని భార్య ప్రియ (ప్రియా భవానీ శంకర్‌), కుమార్తె అంజలి, పెంపుడు కుక్క తో కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో మధ్యలో ఓ హోటల్‌ దగ్గర ఆగాల్సి వస్తుంది. హోటల్లో సాగర్ వర్మ కి కనిపించిన ఒక న్యూస్ పేపర్ ని చూస్తాడు అందులో ఏముంటుంది అంటే అతను చాలా ఇష్టంగా పెంచుకుంటున్న తన కుక్క కారు ప్రమాదంలో చనిపోతుంది అని రాసి ఉంటుంది దాంతో కొద్దిసేపట్లోనే ఒక లారీ వచ్చి కారును గుద్దేయడంతో అందులో ఉన్న కుక్క చనిపోతుంది. ఇక అప్పట్నుంచి పేపర్లో కట్టింగ్ లో ఏదైతే వస్తుందో అది జరుగుతూ ఉంటుంది అలా తనకు కావాల్సిన వాళ్లు ప్రతి ఒక్కరు చనిపోతూ ఉంటారు.ఇక ఆ క్రమంలోనే అతని కుటుంబ సభ్యులు గానీ అతని స్నేహితులు గాని అందరూ చనిపోతూ ఉంటారు ఇలా ఎందుకు జరుగుతుంది. ఇది కావాలనే ఎవరైనా చేస్తున్నారా,లేదా యాదృచ్ఛికంగా జరుగుతుందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి సాగర్ చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు.ఇక ఈ ప్రయత్నంలో అతనికి కళ్ళు చెదిరిపోయే నిజాలు తెలుస్తూ ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నని చిక్కుముడి లాగా విప్పుతూ తనకి కావాల్సిన సమాచారాన్ని తెలుసుకున్నాడా లేదా అనే విషయాలు తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ దూత సీరీస్ ని చూడాల్సిందే…

ఇక ఈ సీరీస్ ఎలా ఉంది అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీలో ఏ ఎలిమెంట్స్ కావాలో ఆ ఎలిమెంట్స్ అన్ని ఈ సీరీస్ లో పుష్కలంగా ఉన్నాయి. దర్శకుడు ఈ సీరీస్ ని ఆద్యంతం ఆసక్తిగా తెరకెక్కించడం లో చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ కి ఇలాంటి ఒక సీరీస్ ని తీయాలనే ఆలోచన రావడమే గొప్ప విషయం…ప్రస్తుతం ఆయన సినీ కెరియర్ పరం గా కొద్దిగా డల్ అయినప్పటికీ ఈ సీరీస్ మాత్రం ఆయన కెరియర్ కి చాలా బాగా ఉపయోగపడుతుందనే చెప్పాలి… ఇక ఈ సీరీస్ ని తన శక్తి యుక్తులను పెట్టీ మరి తీసే ప్రయత్నం చేశాడు. అందుకే పేపర్ మీద ఉన్న కథని ఎక్కడా కూడా డివియెట్ అవ్వకుండా క్యారెక్టర్లని ఎక్కడ కూడా ఔట్ ఆఫ్ ది స్టోరీ వెళ్లకుండా ఒక ఇంటెన్స్ ని క్రియేట్ చేస్తూనే పాత్రలో ఉన్న ప్రెష్ నెస్ ని ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా బాగా డీల్ చేశాడు…ఇక ఇదిలా ఉంటే కొన్ని సీన్లలో షార్ప్ గా ఎండ్ చేయకుండా లాగ్ చేసినట్టుగా అనిపించింది. నిజానికి విక్రమ్ కే కుమార్ మేకింగ్ చాలా బాగుంటుంది మనం సినిమాలో చూసుకున్నట్లయితే ఆయన మేకింగ్ నిజంగా వేరే లెవల్లో ఉంటుంది.ఆయన ఇప్పుడు కొంచెం డీలా పడినప్పటికీ ఆయన మంచి మేకర్ అనే చెప్పాలి. అయితే అనుక్షణం ఈ సిరీస్ ని ఉత్కంఠ గా తెరకెక్కించినప్పటికీ చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ని మాత్రం ఈ సీరీస్ లో ఆయన చేశారనే చెప్పాలి రెండు కీలకమైన సీన్లలో ఆయన ఆ సీన్ తాలూకు ఉత్కంఠ ని పండించడంలో కొంతవరకు తలపడినట్టుగా అనిపించింది. ఎందుకంటే సీన్ అనేది లాగ్ అయ్యే కొద్ది అందులో ఉన్న ఉత్కంఠ అనేది తగ్గుతూ ఉంటుంది. అందుకే థ్రిల్లర్ సినిమాల్లో సీన్ అనేది ఎంత తక్కువ డ్యూరేషన్ లో డిజైన్ చేసుకుంటే అంత మంచిది తక్కువ టైం లోనే మనం ఏం చెప్పాలనుకున్నామో అది స్ట్రెయిట్ గా చెప్పాలి లేకపోతే ఇప్పుడున్న ప్రేక్షకుడు ఆ ట్విస్ట్ ని పసిగట్టేస్తాడు. అలాంటప్పుడు మనం చెప్పాలనుకున్న సీన్ అనేది అతడికి ఉత్కంఠను కలిగించకపోవచ్చు కొన్ని సీన్ లలో విక్రమ్ కే కుమార్ అలానే చేశాడు దాంతో అక్కడి దాకా ఒక లెవల్ లో వచ్చిన సినిమా అక్కడ కొంచం తగ్గినట్టు గా అనిపిస్తుంది…

అయితే ఈ సిరీస్ లో తెలుగు సినిమాల ప్రభావం కూడా ఎక్కువగానే పడ్డట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా మురారి లాంటి సినిమా ప్రభావం ఈ సినిమా మీద చాలా ఎక్కువగా ఉంది. అలాగే విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో వచ్చిన 13b సినిమా ఇంపాక్ట్ కూడా ఈ సినిమా మీద పడినట్లుగా తెలుస్తుంది.

ఇక ఆర్టిస్టులు పర్ఫామెన్స్ విషయానికి వస్తే నాగచైతన్య ఈ సిరీస్ ని ప్రాణం పెట్టి చేసినట్టుగా తెలుస్తుంది. సాగర్ వర్మ అనే పాత్రలో నటించడమే కాకుండా జీవించేశాడు. సినిమాకి నాగచైతన్య ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇక నాగచైతన్య తో పాటుగా ప్రాచీ దేశాయ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అందుకే ఈ రెండు క్యారెక్టర్లు కూడా ప్రతి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తు ప్రేక్షకుడిని చివరి వరకు ఆ పాత్రలతో కనెక్ట్ అవుతూ ఉంటాడు…ఇక మిగిలిన పాత్రల్లో నటించిన నటినటులు కూడా వాళ్ళ పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించారు. ముఖ్యంగా చైతన్య ప్రాచీ దేశాయ్ క్యారెక్టర్లు మాత్రం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి…ఇక డైలాగ్ రైటర్ వెంకటేష్ దొండపాటి డైలాగ్స్ కొంత వరకు ఒకే అనిపించినప్పటికీ గుండెల్లో గుచ్చుకునే డైలాగ్స్ కానీ,గుర్తుండిపోయే డైలాగ్స్ కానీ రాయలేదు.మంచి డైలాగ్స్ రాసే స్కోప్ ఉన్నప్పటికీ వాటిని రాయడం లో ఆయన ఫెయిల్ అయ్యాడు…

ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఈ సిరీస్ కి మ్యూజిక్ అందించిన ఇషాన్ ఛబ్రా ఆయన రీతిలో మ్యూజిక్ అందించాలనే ప్రయత్నం చేశాడు కానీ ఆ మ్యూజిక్ అంత పెద్దగా ప్లస్ అయితే అవ్వలేదని తెలుస్తుంది.సీన్ లో ఉన్న ఇంటెన్స్ ని ఎలివేట్ చేయడంలో కొంతవరకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది తగ్గింది. విక్రమ్ కే కుమార్ గత సినిమాలు అయిన మనం, ఇష్క్ లాంటి సినిమాలకి అనూప్ రూబెన్స్ ఇచ్చిన మ్యూజిక్ గానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహించింది.ఇక ఈ సీరీస్ కి మ్యూజిక్ అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు…ఇక సినిమాటోగ్రాఫర్ అయిన మికోలజ్ సైగులు అందించిన విజువల్స్ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాయి. కొన్ని షార్ట్స్ అయితే తను అద్భుతంగా డిజైన్ చేసుకొని భారీ సినిమా రేంజ్ లో విజువల్స్ ని అయితే ప్రజెంట్ చేసినట్టు గా తెలుస్తుంది. ఇక ఎడిటర్ నవీన్ నూలి కొంచెం షార్ప్ గా ఎడిట్ చేసి ఉంటే బాగుండేది ఇలాంటి థ్రిల్లర్ సినిమాల్లో ఎడిటింగ్ అనేది ఎంత షార్ప్ గా ఉంటే అంత మంచిది… ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.ప్రతిదీ చాలా రిచ్ గా ఉండేలా డిజైన్ చేశారు…

ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే
కథ,స్క్రీన్ ప్లే

నాగచైతన్య యాక్టింగ్

విజువల్స్

ఇక సినిమాలో ఉన్న మైనస్ పైన ఏంటంటే

కొన్ని సీన్లు లాగ్ అయ్యాయి…

కొన్ని సీన్లలో అయితే ఆ ట్విస్ట్ లను మనం ముందే కనిపెట్టొచ్చు అలాగే వస్తూ పోతుండే క్యారెక్టర్లు ఈ సీరీస్ కి మైనస్ అయ్యాయి…

మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

ఇక ఈ సీరీస్ కి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5