PM Modi: మోదీ.. పదేళ్ల క్రితం ప్రధాని పదవి చేపట్టినప్పుడు ఒక సమర్థుడైన ముఖ్యమంత్రి. అభివృద్ధికి మార్గదర్శి. ఆవే ఆయనను బీజేపీలో ప్రధాని అభ్యర్థిగా చేశాయి. 2014 మేలో ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాయి. కాలం గిర్రున తిరిగింది. పదేళ్లు గడిచాయి. నాడు సమర్థ ముఖ్యమంత్రి నేడు విశ్వగురువు. ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపు చూసేలా మన కీర్తిని, మన సమర్థతను విశ్వానికి చాటి చెప్పిన అసమాన్యుడు. ఒకప్పుడు భారత్ ఏం చేసినా ఆంక్షలు విధించే ప్రపంచ అగ్రదేశాలు.. ఇప్పుడు ఏది చేసినా.. గమ్మున చూస్తూ కూర్చుంటున్నాయి. అంతలా మన బలం, బలగం, కీర్తి, సమర్ధతను పెంచారు నరేంద్రమోదీ. అగ్రరాజ్యాలకు అణిగి మనిగి ఉండే రోజులు పోయాయి. అగ్రరాజ్యాధి నేతల భుజంపై చేయి వేసి మాట్లాడే స్థాయి భారత్ చేరుకుంది. ఇందుకు మోదీయే కారణం అంటే ఎవరూ కాదనలేదు.
నాడు అణుపరీక్షలంటే భయం..
భారత ప్రధానుల్లో శక్తివంతమైన ప్రధానిగా ఇందిరాగాంధీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. పొరుగున ఉన్న మన దాయాది దేశంలో యుద్ధం తర్వాత మన సైన్యాన్ని బలోపేతం చేయడానికి అణ్వాయుధాలు సమకూర్చుకోవాలనుకుంది. ఈమేరకు అణు పరీక్షలు నిర్వహించింది. కానీ, అగ్రరాజ్యాలు భారత్‌ను భయపెట్టాయి. వ్యాపార సంబంధాలు దెబ్బతీస్తామని, ఆక్షలు విధిస్తామని, ఆర్థికసాయం అందకుండా చేస్తామని హెచ్చరించాయి. దీంతో శక్తివంతమైన ప్రధాని అయిన ఇందర కూడా ఒక్క అణ్వాయుధ పరీక్షకే పరిమితమైంది.
వాజ్‌పేయి రాకతో..
కాంగ్రెస్ దేశాన్ని పాలించినతం కాలం ప్రపంచ దేశాలకు తలొగ్గిన భారత్.. వాజ్‌పేయి ప్రధాని అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. కార్గిల్ యుద్ధం వాజ్‌పేయిని మరింత శక్తివంతం చేసింది. కార్గిల్ విజయం తర్వాత తన దౌత్య నీతితో పాకిస్థాన్‌పై భారత దాడిని సమర్థంచుకున్నారు. అమెరికాలాంటి కొన్ని దేశాలు ఆంక్షలు విధిస్తామని భయపెట్టినా వెనుకడుగు వేయలేదు. ఇక అణు పరీక్షలకు వెనుకాడలేదు. ఒకేసారి ఐదు అణుపరీక్షలు నిర్వహించి భారత శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. తర్వాత వచ్చిన మన్మోహన్సింగ్.. మళ్లీ ధనిక దేశాల కనుసన్నల్లోనే పనిచేశారు. భారత్‌ను అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంచారు. ఆర్థికవేత్త అయినా.. ఆంక్షల నడుమ పనిచేయాల్సిన పరిస్థితే. 2004 నుంచి 2014 వరకు ఇదే కొనసాగింది.
మోదీ ఎంట్రీతో..
ఇక 2013 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా, ఆదర్శంగా తీర్చిదిద్దిన నరేంద్రమోదీ.. తర్వాత బీజేపీ ప్రధాని అభ్యర్థి అయ్యారు. అప్పటికే మూడు పర్యాయాలు గుజరాత్ సీఎంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. గోద్రా అల్లర్లు మోదీ రాజకీయ జీవితానికి కాస్త ఇబ్బందిగా మారినా అవి ప్రధాని పదవి చేపట్టేందుకు అడ్డురాలేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రమోట్ చేసి ఎన్నికలకు వెళ్లింది. యావత్ భారత దేశం ఆయనను అంగీకరించింది. దీంతో మోదీ ప్రధాని పీఠం అధిష్టించాడు. ఇక అప్పటి నుంచి భారత అభివృద్ధి, ఆర్థిక శక్తిగా ఎదగడం, సైన్యాన్ని సమర్థవంతంగా తయారు చేయడం, శత్రు దేశాలను దెబ్బతీయడంలో మోదీ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. పుల్వామా ఘటన తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిపి.. పాకిస్థాన్‌పై ఆదేశ భూభాగంలోకి చొచ్చుకెళ్లి అక్కడి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశారు. పెద్దనోట్లు రద్దు చేసి పాకిస్థాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీశారు. ప్రపంచంలో రెండో శక్తివంతమైన దేశంగా ఉన్న మన పొరుగు దేశం చైనాకు చుక్కలు చూపించారు. గాల్వాన్ ఘటన తర్వాత ఆర్థిక ఆంక్షలు విధించారు. ఎగుమతులను నిషేధించారు. వ్యాపారాన్ని దెబ్బతీశారు. యాప్స్‌ను నిషేధించారు. ఇప్పుడు చైనా మద్దతుతో రెచ్చిపోయిన మాల్దీవులకు చుక్కలు చూపిస్తున్నారు.
ఐదో ఆర్థిక శక్తిగా..
ఇక అభివృద్ధిలో భారత్‌ను ఐదో ఆర్థిక శక్తిగా నిలిపారు. ఇంగ్లండ్‌ను వెనక్కు నెట్టి… భారత్ ప్రపంచ ధనిక దేశాల్లో ఐదో స్థానంలో నిలిచేలా చేశారు మోదీ. మరో ఐదేళ్లలో భారత్‌ను మూడో స్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎలాంటి బెదిరంపులకు లొంగకుండా.. దేశ భద్రత, రక్షణ, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ డిఫోన్స్ మోడ్‌లో ఉన్న భారత్‌ను అఫెన్స్మోడ్లో నిలబెట్టారు. పేద దేశాలకు ఆర్థిక సాయంలోనూ ఎక్కడా తగ్గడం లేదు. మిత్రదేశాలకు అండగా, శత్రు దేశాలకు శత్రువగానే సమాధానం ఇస్తున్నారు. దీంతో యావత్ ప్రపంచమే ఇప్పడు భారత్‌వైపు చూసేలా నిలబెట్టారు. దటీజ్ మోదీ!
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Datij modi the world is looking at india
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com