Homeఎంటర్టైన్మెంట్Dharja Review : మూవీ రివ్యూ: మాస్ ని అలరించే అనసూయ ' దర్జా '

Dharja Review : మూవీ రివ్యూ: మాస్ ని అలరించే అనసూయ ‘ దర్జా ‘

చిత్రం: దర్జా
నటీనటులు: సునీల్, అనసూయ
నిర్మాత: శివశంకర్ పైడిపాటి
దర్శకత్వం : సలీమ్ మాలిక్
సంగీతం: రాప్ రాక్ షకీల్
ఎడిటర్: ఎంఆర్ వర్మ
విడుదల తేదీ: జులై 22, 2022


Dharja Review : బుల్లితెరపై ఎవర్ గ్రీన్ యాంకర్ అనసూయ. ఈ మధ్య సినిమాల్లోనూ ‘తగ్గేదే లే’ అంటూ దూసుకెళుతోంది. పుష్ప సినిమాలో ఈమె విలనిజం అందరినీ మెస్మరైజ్ చేసింది. బుల్లితెర షోలు తగ్గించి వెండితెరకు ప్రాధాన్యం ఇస్తున్న అనసూయ మంచి మంచి పాత్రలు పోషిస్తూ చెరగని ముద్ర వేస్తోంది. తాజాగా ‘దర్జా’గా మరో అడుగు ముందుకేసింది. కమెడియన్ కం హీరో సునీల్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ‘దర్జా’ సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించింది. సునీల్ తో పాటు ఈ చిత్ర కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ నిర్మాత రవి పైడిపాటి ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ ఈ చిత్రానికి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సమర్పణ. పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రంగా తెరకెక్కింది. ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మించారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రవి పైడిపాటి వ్యవహరించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి లేడీ ఓరియెంటెడ్ పాత్రకు అనసూయ ఏమాత్రం న్యాయం చేసిందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం..

కథ:
బందరు కనకం అలియాస్ కనక మహాలక్ష్మి (అనసూయ) అంటే బందరు చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు హడల్. పోలీస్ యంత్రాంగాన్ని సైతం తన రౌడీయిజంతో శాసిస్తు తన గుప్పెట్లో పెట్టుకుని దందా సాగిస్తుంటుంది. ఈ క్రమంలో గణేశ్ (అరుణ్ వర్మ) తను ప్రేమించిన అమ్మాయి పుష్ప(శిరీష) చేతిలో మోసపోయి ఉరేసుకుని చనిపోతాడు. తన అన్న చావుకి కారణం అయిన పుష్పని… గణేశ్ తమ్ముడు రంగ (షమ్ము) చంపాలని చూస్తుండగా… కొత్తగా వచ్చిన బందరు ACP శివ శంకర్ పైడిపాటి(సునీల్) అడ్డుకుని.. ఆ కేసు విచారణ చేపడతాడు. మరి గణేష్ చనిపోవడానికి కారణం పుష్ప మోసం చేయటం వల్లనేనా? బందరు కనకం ఆగడాలను ACP ఎలా ఆట కట్టించాడు? అసలు ACP శివశంకర్ ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!!!

కథ… కథనం విశ్లేషణ:

లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ వుంది. ఎప్పుడూ యూత్ ను ఆకట్టుకునే పాత్రల్లో నటించిన యాంకర్ అనసూయ దర్జాలో ఓ పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషించింది. ఈ పాత్రను హైలైట్ చేయటం కోసం దర్శకుడు ఎంచుకున్న స్టోరీ… దాని చుట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. అనసూయ పాత్ర ఆది నుంచి చివరి దాకా ఎంతో క్రూరంగా సాగి ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని పెంచుతుంది. అలాగే సునీల్ ఏసీపీ పాత్రలో వచ్చే ట్విస్ట్ లు ఆడియెన్స్ ని బాగా ఎంగేజ్ చేస్తాయి. ఓ వైపు బందర్ కనకం ఆగడాలను చూపిస్తూనే… మరో వైపు గణేష్, పుష్పాల స్వఛ్చమైన ప్రేమను… అలానే రంగ, తీన్ మార్ గీతల చిలిపి ప్రేమను, ఆమని, తన పిల్లల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్… శకలకశంకర్, థర్టీ ఇయర్స్ పృథ్వీల కామెడి అన్నీ మాస్ ను బాగ ఎంటర్టైన్ చేస్తాయి. చివర్లో వచ్చే మాస్ బీట్ సాంగ్ ఆడియెన్స్ ని అలరిస్తుంది.

పుష్పా సినిమా తరువాత అనసూయ మంచి రౌద్రం వున్న పాత్రలో నటించి మెప్పించారు. విలనిజం తాలూకు పాత్రలో వచ్చే డైలాగ్స్ చాలా బాగా చెప్పింది. ఏసీపీ శివశంకర్ పాత్రలో మాస్ ని మెప్పించేలా యాక్షన్ సీన్స్ తో మెప్పించాడు. ఈ చిత్రం కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి డెబ్యూ అయినా… పోలీస్ పాత్రలో ఒదిగిపోయాడు. శమ్ము, అరుణ్ వర్మ అన్నదమ్ముల పాత్రల్లో లీనమై నటించారు. అలానే శిరీష, అక్సాఖాన్ అక్కా చెల్లెళ్ళుగా నటించి ఆకట్టుకున్నారు. చివర్లో ఆక్సాఖాన్ చేసిన మాస్ బీట్ సాంగ్ యూత్ ని ఉర్రూతలూగిస్తుంది. షకలక శంకర్, పృథ్వీ, పాల్ రాము బాగ నవ్వించారు. మహేష్ సిద్ధాంతిగా తన పాత్రకి న్యాయం చేశాడు. విలన్ గా బళ్ళారి పాత్రలో సమీర్ బాగా క్రూరంగా నటించి మెప్పించాడు.

దర్శకుడు సలీమ్ మాలిక్ రాసుకున్న కథ.. కథనాలు బాగున్నాయి. డెబ్యూ మూవీ ఆయినా బాగానే హ్యాండిల్ చేశాడు. డైలాగ్స్ బాగున్నాయి. సంగీతం పర్వాలేదు. చివర్లో వచ్చే మాస్ సాంగ్ ఆడియెన్స్ కి మాంచి కిక్ ఇస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీన్స్ మాస్ ను బాగ ఆకట్టు కుంటాయి. నిర్మాతలు ఖర్చుకి వెనుకాడకుండా సినిమాని క్వాలిటీగా నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్..!!!

రేటింగ్: 2.75/5
Recommended Videos
ప్రభాస్ కొత్త సినిమాలో కమల్ హాసన్ | Kamal Haasan in Prabhas Movie | Prabhas Salaar Movie | ProjectK
చైతుతో విడాకులపై సమంత సంచలన నిజాలు | Samantha Reveals The Reasons On Divorce | Koffee With Karan S7
మరోసారి విలన్ పాత్రలో సమంత || Samantha Playing Villan Role Again || Oktelugu Entertainment

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version