https://oktelugu.com/

ఈ పాస్‌వర్డ్‌ లు వాడుతున్నారా.. ప్రమాదంలో పడినట్లే..?

ప్రపంచ దేశాల్లో రోజురోజుకు టెక్నాలజీ వినియోగం పెరుగుతుండటంతో సైబర్ సెక్యూరిటీ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. మనం ఉపయోగించే ప్రతి అకౌంట్ కు పాస్ వర్డ్ ఎంతో భద్రంగా ఉంటే మాత్రమే ఆ అకౌంట్ సురక్షితం అని అర్థం చేసుకోవాలి. చాలామంది వేర్వేరు అకౌంట్లకు ఒకటే పాస్ వర్డ్ ను వినియోగించడం, లేదా సులభంగా ఉండే పాస్ వర్డ్ ను వినియోగించడం చేస్తూ ఉంటారు. Also Read: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 11, 2021 / 12:37 PM IST
    Follow us on

    ప్రపంచ దేశాల్లో రోజురోజుకు టెక్నాలజీ వినియోగం పెరుగుతుండటంతో సైబర్ సెక్యూరిటీ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. మనం ఉపయోగించే ప్రతి అకౌంట్ కు పాస్ వర్డ్ ఎంతో భద్రంగా ఉంటే మాత్రమే ఆ అకౌంట్ సురక్షితం అని అర్థం చేసుకోవాలి. చాలామంది వేర్వేరు అకౌంట్లకు ఒకటే పాస్ వర్డ్ ను వినియోగించడం, లేదా సులభంగా ఉండే పాస్ వర్డ్ ను వినియోగించడం చేస్తూ ఉంటారు.

    Also Read: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం పొందే ఛాన్స్..?

    అయితే పాస్ వర్డ్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదంలో పడినట్లేనని సైబర్ నిపుణులు వెల్లడిస్తున్నారు. హ్యాకింగ్ చేసేవాళ్లు సింపుల్ పాస్ వర్డ్ లను సులభంగా హ్యాక్ చేయగలరని అలాంటి పాస్ వర్డ్ లను వినియోగిస్తే ప్రమాదంలో పడినట్లేనని సైబర్ నిపుణులు వెల్లడిస్తున్నారు. 123456, picture1 , password , 111111, 123123, senha , qwerty , abc123 లాంటి పాస్ వర్డ్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకపోవడమే మంచిది.

    Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. వారికి లైఫ్ టైమ్ ఫ్యామిలీ పెన్షన్..?

    ప్రతి సంవత్సరం నార్డ్‌పాస్ చెత్త పాస్ వర్డ్ లకు సంబంధించిన జాబితాను విడుదల చేస్తుంది. https://nordpass.com/mostcommonpasswordslist వెబ్ సైట్ ద్వారా సులభంగా హ్యాక్ చేయగలిగే చెత్త పాస్ వర్డ్ లకు సంబంధించిన వివరాలను సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ వెబ్ సైట్ లో ఉన్న పాస్ వర్డ్ లలో మీరు వినియోగించే పాస్ వర్డ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఆ జాబితాలో మీ పాస్ వర్డ్ ఉంటే మాత్రం వెంటనే పాస్ వర్డ్ ను మార్చుకుంటే మంచిది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    పాస్ వర్డ్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే అవకాశంతో పాటు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కామన్‌గా ఉండే పాస్‌వర్డ్‌ లను వినియోగించడం వీలైనంత వరకు తగ్గిస్తే మంచిది.